E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఏంట్రా మనిద్దరి ట్రాక్… ఏవీ చూశాక కళ్యాణ్ దగ్గర తనూజా ఎపిక్ రియాక్షన్

Bigg Boss 9 Telugu : ఏంట్రా మనిద్దరి ట్రాక్… ఏవీ చూశాక కళ్యాణ్ దగ్గర తనూజా ఎపిక్ రియాక్షన్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే ప్రతీ కంటెస్టెంట్ టాప్ 5లో ఉండాలని కలలు కంటారు. ఎందుకంటే సీజన్ మొత్తం ముప్పుతిప్పలు పెట్టే బిగ్ బాస్ ఎండింగ్ లో మాత్రం టాప్ 5ను స్వయంగా ప్రశంసలతో ముంచెత్తుతాడు. ఇక ఆ టైమ్ లో తమ ఏవీల ద్వారా అన్ని రోజుల జర్నీని చూసుకోవడం అన్నది నిజంగా గూస్ బంప్స్ మూమెంట్. ప్రస్తుతం సీజన్ 9 బిగ్ బాస్ హౌస్ లో ఇదే నడుస్తోంది. ఇమ్మూ, డెమోన్, తనూజ ఏవీలను వేశారు. అయితే ఏవీలు చూసుకున్నాక ఒక్కొక్కరూ ఒక్కో విధంగా రియాక్షన్ ఇచ్చారు. అందులో తనూజ హైలెట్.

ఇదస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు   

ఏవీని చూశాక “బిగ్ బాస్ థాంక్యూ సో మచ్. ఇది నాకొక డ్రీమ్ లాగా ఉంది. ఈరోజు ఇక్కడ నిలబడి నా ఏవీని చూస్తుంది నెనేనా  అన్పిస్తోంది. ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇంతగా ప్రేమించి, ఈరోజు నేను ఇక్కడ నిలబడేలా చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అని కృతజ్ఞతకు వ్యక్తం చేసింది. ఆ తరువాత హౌస్ లోకి వెళ్ళి “నేను ఎడవలేదు. ఏడవనని చెప్పాను కదా. సంజన గారు మనిద్దరి మధ్య అంత బాండ్ ఉందని నాకు తెలీదు. మీరు నా వెనక మాట్లాడినవి కూడా చూపించారులే” అంటూ సంజనకు ఇచ్చి పడేసింది. తరువాత కళ్యాణ్ తో “ఒరేయ్ ఏంట్రా…. మనిద్దరి గురించి అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ లవ్ 8th లో కళ్యాణ్ అన్నప్పటి నుంచి మనిద్దరిదీ స్టార్ట్. మా నాన్నది ఎంత ఉందో, దానికంటే ఎక్కువ వీడిది ఉంది. అంత వచ్చింది. మీ అమ్మ వెళ్ళాక మనిద్దరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకున్నది, మొన్న ప్రైజ్ మనీ అయితే ఇమ్యూనిటీ వద్దు అన్నపుడు నేను కింద కూర్చుంటే, నువ్వు కుర్చీలో నుంచి దిగి కూర్చున్నది కూడా” అంటూ ఎగ్జైట్ అయ్యింది తనూజ.

Advertisement

నిజానికి హౌస్ లో వీళ్లిద్దరి లవ్ ట్రాక్ అన్నది బిగ్ బాస్ ఆడియన్స్ కు ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అయితే హౌస్ లో ఉన్నవాళ్లకు బయట ఏం జరుగుతుంది అన్నది పూర్తిగా తెలియకపోవచ్చు. తాజాగా తనూజ రియాక్షన్ చూస్తుంటే కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ ఇలా బయటకు వెళ్ళిందని ఆమె ఊహించలేదు అన్పిస్తోంది. అదే నిజమైతే బయటకు వచ్చాక కళ్యాణ్ – ఆమెపై జరిగిన ప్రచారం చూసి ఏమవుతుందో మరి.

డెమోన్ – రీతూలకు ముడి పెట్టిన బిగ్ బాస్ 

తనూజ – కళ్యాణ్ ల లవ్ ట్రాక్ బయట పడీ పడనట్టుగా ఉంటే, డెమోన్ – రీతూ ఇంకో టైపు. ఇద్దరూ మొదటి నుంచే తమది జెన్యూన్ ఎఫెక్షన్ అని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఏవీలో బిగ్ బాస్ కూడా అదే చెప్పాడు. ఆమె వెళ్లిపోయినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాకు తెలుసు. మీ మనసు మీ మాట వినకుండా ఆ వ్యక్తి వెనక నడిచింది” అంటూ డెమోన్ ఏవీలో చాలా వరకు రీతూనే చూపించారు.

Advertisement

Read Also :  తనూజ రెండు వైపులా పదునున్న కత్తి… డెమోన్ ఆటకు వెన్నులో వణుకు… బిగ్ బాస్ మాస్ ఎలివేషన్స్

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×