E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్
Advertisement

Bigg Boss 9 Telugu Latest Promo: బిగ్‌ బాస్ తెలుగు 9 సీజన్‌ మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం సన్‌ ఫండేగా సాగిన బిగ్‌ బాస్‌ లో మళ్లీ రచ్చ మొదలైంది. ఈ వారం నుంచి టెనెంట్స్‌ ఓనర్స్‌గా.. ఓనర్స్‌ టెనెంట్స్‌గా మారిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పటి నుంచి కామన్స్‌ టెనెంట్స్.. సెలబ్రిటీలు ఓనర్స్‌. దీంతో ఓనర్స్‌ కి ఫుల్‌ పవర్‌. సోమవారం అంటేనే నామినేషన్స్‌. ఈ ఎపిసోడ్‌ కోసం ఆడియన్స్‌ అంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో ఈ నామినేషన్స్‌ హీట్ ఎలా ఉండబోతోందో చెబుతూ తాజాగా బిగ్‌ బాస్‌ టీం ప్రొమో వదిలింది. పదిహేనో రోజుకు సంబంధించిన లేటెస్ట్‌ ప్రొమో తాజాగా విడుదలైంది. ఇందులో టెనెంట్స్‌ అయిన కామనర్స్‌ని హౌజ్‌ లోని ఐదుగురిని నామినేషన్‌ చేయాలని బిగ్‌ బాస్‌ ఆదేశించారు. 

సంజనకు అహం..

Advertisement

అయితే అందులో తప్పనిసరిగా ఒక టెనెంట్‌ ఉండాల్సిందేనని ట్విస్ట్‌ ఇచ్చాడు.  ముందుగా ఓనర్స్‌ నుంచి నామినేషన్‌ మొదలుపెట్టారు. మాస్క్‌ మ్యాన్‌ హరీష్‌ సంజన పేరు తీశాడు. కెప్టెన్‌ అయ్యాక ఆమెలో దెయ్యం కనిపించింది. కెప్టెన్‌ అని.. అందరిని శాసించాలని చూసిందంటూ మాస్క్‌ మ్యాన్‌ తన ఒపినియన్‌ చెప్పారు. ఇక నిర్ణయానికి ప్రియ కూడా మద్దతు ఇచ్చింది. తను కూడా సంజనని నామినేట్‌ చేసింది. సంజనకు అహం ఎక్కువ అంటూ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది ప్రియ. దీంతో టెనెంట్స్‌ అంత కలిసి ఏకగ్రీవంగా సంజనను నామినేట్‌ చేశారు. యాక్టివిటీ రూంలో కేవలం టెనెంట్స్ తో మాత్రమే ఈ నామినేషన్స్ ప్రక్రియ జరిపిన బిగ్‌ బాస్‌ అది ఓనర్స్‌ కి కనిపించేలా స్క్రీన్‌పై ప్లే చేశాడు.

బూతు కంటే అబద్ధం పెద్ద తప్పు

అలా తమ తమ అభిప్రాయాల ప్రకారం సంజన, సుమన్‌ శెట్టి, ఫ్లోరాని అంత నామినేట్‌ చేశారు. ఇక నాలుగలో నామినేషన్‌ టైంలో వారి మధ్యే వాగ్వాదం జరిగింది. ఒక్కరి అభిప్రాయాలను ఒకరు వ్యతిరేకించడం వల్ల టెనెంట్స్‌ మధ్య వాదన మొదలైంది. హౌజ్‌లో అంత గట్టిన చెప్పిన వాల్ల మాటే వింటున్నారు.. అది తప్పయిన ఆ మాట కరెక్ట్‌ అని ఫీల్‌ అవుతున్నారంటూ కళ్యాణ్‌. ఆ తర్వాత నాకు బూతు కన్నా.. అబద్దం ఆడటం రాంగ్‌ అంటూ డిమోన్‌ విరుచుకుపడ్డారు. ఇలా నామినేషన్స్‌ పేరుతో టెనెంట్స్‌ మధ్య గొడవ పెట్టాడు బిగ్ బాస్‌. ఫైనల్‌ గా ఓనర్స్‌ నుంచి సంజన, సుమన్‌ శెట్టి, ప్లోరా, రీతూ చౌదరిని నామినేట్‌ చేసి మ్యాగ్నెట్‌ బోర్డుపై వారి బొమ్మలను పెట్టారు.

Advertisement

శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

ఇక టెనెంట్స్‌ నుంచి నామినేషన్స్‌ వచ్చేసరికి.. వారి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. అమ్మాయిలకు రెస్పాక్ట్‌ ఇవ్వడు అంటూ శ్రీజ హరీష్‌ని పేరు ప్రతిపాదించింది. ఈ క్రమంలో శ్రీజ, హరీష్‌ వాదన తారస్థాయికి చేరింది. నువ్వు అన్నందుకు శ్రీజపై హరీష్‌ విరుచుకుపడ్డాడు. మర్యాద మర్యాద అంటూ ఆమె ధ్వజమెత్తాడు. కోడిగుడ్డు మీద బోచ్చు పీకమంటే నేను పీకుతూ అంటూ శ్రీజపై మాస్క్‌ మ్యాన్‌ ఫైర్‌ అయ్యాడు. ఇక ఫైనల్‌గా టెనెంట్స్‌ నుంచి హరీష్‌ని నామినేట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రొమో చూస్తుంటే మూడో వారం నామినేషన్స్‌ వాడివేడిగా సాగినట్టు తెలుస్తోంది. మరి అసలేం జరిగిందో తెలియాలంటే ఫుల్‌ ఎపిసోడ్‌ వరకు వేయిట్ చేయాల్సిందే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×