Bigg Boss 9 : ఎప్పటినుంచి ఎదురు చేస్తున్న తెలుగు బిగ్ బాస్ షో మొదలైపోయింది. మొత్తానికి ఐదు రోజులు కూడా పూర్తయిపోయింది. అయితే ప్రతి వారం ఒకరు ఎలిమినేషన్ అవుతారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో మూడు రోజులు చూడడం మొదలుపెడితే 4వ రోజు నుంచి చూడకుండా ఉండలేరు. అంతలా ఈ షో కి కనెక్ట్ అయిపోతారు. అందుకనే ఇప్పటికి 8 సీజన్లు నడిపి తొమ్మిదో సీజన్లోకి అడుగు పెట్టారు.
అయితే ఈ షోలో ఎలిమినేట్ అయిన వాళ్లతో ఇమీడియట్గా బిగ్ బాస్ కు సంబంధించిన ఒక వ్యక్తితో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మిగతా హౌస్ మేట్స్ ఎలా ఆడారు. ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి. ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటారు. దీనివలన కూడా చాలా విషయాలు బయటపడతాయి. బిగ్బాస్ సీజన్ 9 ఎక్స్ క్లూజివ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయింది.
నటుడుగా హీరోగా ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు శివాజీ. అలానే బిగ్ బాస్ లో కూడా శివాజీ ఎంట్రీ ఇచ్చి మంచి గేమ్ ఆడారు. గెలవక పోయినా కూడా చాలామంది హృదయాలను గెలుచుకున్నారు శివాజీ. ఇక రీసెంట్ గా కోర్ట్ అనే సినిమాలో మంగపతి అనే పాత్రతో విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇక్కడితో తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయింది అని చెప్పాలి.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ను శివాజీ ఇంటర్వ్యూ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. శివాజీ గ్రాండ్ ఎంట్రీ తో బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పారు. నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగబోయే మరో మూమెంట్ను డిసైడ్ చేస్తుంది. దీనినే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. కానీ మీకు బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసా? హోస్మిట్స్ తీసుకునే డేసిషన్స్ వల్ల.వాళ్లు చేసే పనులు వల్ల. ఆడియన్స్లో వాళ్ల ఇమేజ్ మారుతూ ఉంటుంది. ఇదే బిగ్ బాస్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటూ ప్రోమోలో చెప్పాడు శివాజీ. మొత్తానికి అద్భుతమైన ట్విస్ట్ లతో ఈ షో కంటిన్యూ అవుతుంది.