E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 91 : లవ్ యూ టూ చెప్పు… బిగ్ బాస్ కు మీసాల పిల్ల రీతూ రిక్వెస్ట్… ఎలిమినేషన్ ట్విస్ట్ తో కన్నీరు మున్నీరైన డెమోన్

Bigg Boss 9 Telugu Day 91 : లవ్ యూ టూ చెప్పు… బిగ్ బాస్ కు మీసాల పిల్ల రీతూ రిక్వెస్ట్… ఎలిమినేషన్ ట్విస్ట్ తో కన్నీరు మున్నీరైన డెమోన్
Advertisement

Bigg Boss 9 Telugu Day 91 : హోస్ట్ నాగార్జున సండే ఫన్ డే అంటూ ఎనర్జిటిక్ ఎంట్రీతో రాగానే హౌస్ మేట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టి, టాస్కులు స్టార్ట్ చేశారు. ఒకటి భరణి టీం కాగా, రెండు కళ్యాణ్ టీం. “కొన్ని సెకన్ల వ్యవధి ఉన్న సినిమా క్లిప్స్ చూపిస్తాను. అందులో ఉన్న రెండు సినిమాలు ఏంటో బెల్ కొట్టి గెస్ చేయాలి” అని చెప్పారు నాగ్. ఈ టాస్క్ లో భరణి టీంకి కేవలం 10 పాయింట్స్ రాగా, 70 పాయింట్స్ తో కళ్యాణ్ టీం విన్ అయ్యింది.

బెడిసికొట్టిన పనిష్మెంట్

“స్పెషల్ వీడియో ఆన్ మ్యాథమేటిక్స్” అంటూ రీతూ ఆడిన మ్యాథ్య్ టాస్క్ ను చూపించారు నాగార్జున. రీతూపై మీమ్స్, ట్రెండింగ్ పంచ్ లైన్స్ తో ఉన్న ఆ ఫన్నీ వీడియో చూసి పడీ పడీ నవ్వుకున్నారు. తరువాత పనిష్మెంట్ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరు ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పి, బాల్ ను గ్లాస్ లో పడేలా వేయాలి. అది పడకపోతే పనిష్మెంట్ వాళ్ళే తీసుకోవాలి. రీతూకి ఇమ్ము మీసాలు పెట్టాడు. భరణి బాల్ గ్లాస్ లో పడకపోవడంతో సిట్ అప్స్, సుమన్ నిమ్మకాయ తినడం, సంజనా బిట్టర్ జ్యూస్ తాగడం, కళ్యాణ్ కు 5 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడడం, ఇమ్మూకి లిప్ స్టిక్ వేయడం వంటివి చేసి నవ్వించారు. అయితే డీమాన్ ‘ఒక నిమిషం ఎవరినైనా పొగడాలి’ అనే పనిష్మెంట్ కు సంజనని సెలక్ట్ చేశాడు. కానీ బాల వేయలేకపోవడంతో అతనే సంజనను పొగడాల్సి వచ్చింది.

తనూజ చిలిపి పని 

Advertisement

అనంతరం ప్రతీ కంటెస్టెంట్ గురించి 3 స్టేట్మెంట్స్ చెప్తారు. అందులో ఏది కరెక్ట్? ఎవరు అన్నారు? అనేది గెస్ చేయాలి. ఒకవేళ తప్పు గెస్ చేస్తే ఫేస్ కి ఫోం పూసుకోవాలి. ఇందులో ఎవ్వరూ సరిగ్గా గెస్ చేయలేకపోయారు. అయితే తమ గురించి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలంటే తనను ఇంప్రెస్ చేయాలని నాగార్జున చెప్పారు. అందులో బహగమగా తనూజ చిన్నప్పుడు తాను చేసిన చిలిపి పని గురించి చెప్పింది.

“చిన్నప్పుడు చిలిపి పనులు చేస్తే నాన్న మమ్మల్ని తిట్టనిచ్చేవారు కాదు. తిట్టొద్దు వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి వెళ్లిపోగానే మా అమ్మ తిట్టేది. ఆమె స్టార్ట్ చేయగానే నేను నాన్నకు ఫోన్ చేసి కిచెన్ లో పెట్టేదాన్ని. ఆయన కట్ చేసి, మళ్ళీ కాల్ చేసి తిట్టొద్దు అని చెప్పా కదా అని అరిచేవారు” అంటూ తన తల్లిని తండ్రి దగ్గర బుక్ చేసిన చిలిపి పని గురించి చెప్పింది.

Advertisement

ఈ టాస్క్ అయ్యాక రీతూ, సంజన చివరగా నామినేషన్ లలో మిగిలారు. వీళ్లలో ఎవరు వైర్ కట్ చేసినప్పుడు బాంబ్ పేలితే వాళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. రీతూ ఎలిమినేట్ కావడంతో డెమోన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజా షాక్ నుంచి తేరుకోలేదు. హౌస్ మేట్ ను ఫేస్ చేయలేనని, బై చెప్పకుండానే వెళ్ళిపోతా అని సంజనాతో చెప్పింది. కానీ ఆమె ఒప్పుకోకుండా తీసుకెళ్లడంతో నాకు వెళ్లాలని లేదు. టాప్ 5లో ఉండాలని ఉందని చెప్పి గుక్కపెట్టి ఏడ్చింది. చివరికి అందరికీ బై చెప్పి, బిగ్ బాస్ ను ఐ లవ్ యూ టూ చెప్పమని రిక్వెస్ట్ చేసింది. కానీ రిప్లై రాకపోవడంతో నాగ్ దగ్గరకు వెళ్ళిపోయింది.

స్టేజ్ పై దివ్యాను నామినేట్ చేయడం నచ్చలేదు. ఫైర్ ఉండాలంటే అన్నింట్లో అగ్రెషన్ ఉండాలని కాదు అంటూ టాప్ 7లో భరణిని పెట్టింది. 6లో నామినేషన్ లో తప్ప సరిగ్గా మాట్లాడటం లేదు అని సుమన్ ను, 5లో సారీ చెప్పి ఫిల్టర్ లేదని సంజనాను, 4లో కళ్యాణ్ ను, తనూజా, ఇమ్మూనీ 4,3,2లలో, ఎలాగైనా కొట్టి మా ఇంటికి తీసుకునిరా అని పవన్ ని టాప్ 1లో పెట్టింది.

Read Also : అది ట్రయాంగిలేనట భయ్యో… భరణి, తనూజల డౌట్ పై మ్యాథ్స్ లాజిక్ తో కొట్టిన నాగ్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×