Bigg Boss 9 Telugu Day 92 : ఇంకో రెండు వారాలే మిగిలి ఉండడంతో బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ఎవరనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. డే 92 ఎపిసోడ్ లో బిగ్ బాస్ కెప్టెన్ కళ్యాణ్ ను తప్ప మిగతా అందరినీ డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. అలాగే భరణిని ఇమ్యూనిటీ లేని కెప్టెన్ గా నియమించారు. ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇమ్యూనిటీ కావాలంటే ఇప్పటి నుంచీ పెట్టే టాస్క్ లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పారు.
అందులో భాగంగానే “ముందుగా మీలో ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ సీజన్ 9 జర్నీలో మీ ముద్ర వేశారు. షోను గొప్పగా మార్చడంలో మీ అందరి కృషి ఉంది. ఇప్పుడు ఆ కృషిని నెంబర్స్ తో కొలిచే సమయం వచ్చింది. బాక్సులలో ఉన్న పాయింట్స్ కంటెస్టెంట్ ఎంత వర్త్ అన్నది సూచిస్తుంది. సమయానుసారంగా బాల్ పడుతుంది. దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరికి, ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనేది చెప్పాలి. ప్రతీ ఒక్కరికీ కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం తుది దశపై, అలాగే ప్రైజ్ మనీపై నేరుగా ప్రభావం చూపుతాయి. కంటెస్టెంట్లకు ఇచ్చే బాక్సుల విలువ వారు ఈ సీజన్ లో కనబరిచిన ప్రదర్శన, చేసిన కాంట్రిబ్యూషన్ ను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. ఒకరు ఒక బాక్స్ అందుకుంటే మిగిలిన వారు మిగిలిన బాక్స్ లను మాత్రమే అందుకోగలరు. మీ హక్కు కోసం బలంగా గళం విప్పాల్సిన సమయం ఇది” అంటూ టాస్క్ మొదలు పెట్టారు బిగ్ బాస్.
ఫస్ట్ బాల్ ను పట్టుకున్న డెమోన్ 1 లక్షను సుమన్ శెట్టికి ఇచ్చాడు. దానికి హౌస్ మేట్స్ అందరూ ఒప్పుకున్నారు. తనూజాకు భరణి 2 లక్షలు, ఇమ్మూకి కళ్యాణ్ 2.5 లక్షలు, డెమోన్ కు సుమన్ 1.50 లక్షలు, భరణికి 50 వేల పాయింట్స్ వచ్చాయి. సంజనాకు మాత్రం జీరో పాయింట్స్ వచ్చాయి. నిజానికి చివర్లో సంజన, భరణి మిగిలారు. దానికి ముందుగానే ఇమ్మూ బాల్ అందుకుని సంజనాకు పాయింట్స్ ఇవ్వాలి అనుకున్నాడు.
బాల్ అందుకున్న ఇమ్మూ “నేను సంజన గారికి ఇద్దాం అనుకుంటున్న. ఫిజికల్ గా ఆమెకు అయినంత వరకు ఆడింది. అయితే మెంటల్ గా మాత్రం గేమ్ అదరగొట్టింది. 14వ వారం దాకా వచ్చింది అంటే ఆమె గేమ్ ఆడియన్స్ కు కూడా నచ్చి ఉంటది. ఆమె గేమ్ అంటే నాకు చాలా ఇష్టం. 1.5 లక్షలు ఇవ్వాలి అనుకుంటున్నా” అని చెప్పాడు. పర్సనాలిటీ, గేమ్ వైజ్ అనేకన్నా మేమే బెటర్ అనే పాయింట్స్ పెట్టారు తనూజా, భరణి, డెమోన్, సుమన్. సంజనాకు సపోర్ట్ గా ఒక్క ఓటు కూడా పకడపోవడంతో ఇమ్మూ ప్లాన్ వర్కవుట్ కాలేదు.
చివరగా మిగిలిన 50వేలు, జీరో కోసం సంజన బాల్ తీసుకుంది. భరణి కంటే తానే బెటర్ అంటూ ఆ 50,000 తనకే ఇచ్చుకుంటానని చెప్పింది. కానీ ఇక్కడ కూడా ఆమెకంటే భరణికి ఎక్కువ సపోర్ట్ దక్కడంతో 50 వేలు భరణి సొంతం చేసుకున్నాడు. జీరో వచ్చిన సంజనాను పనిష్మెంట్ గా జైలుకు పంపారు. దీంతో సంజన ప్రతీవారం తననే టార్గెట్ చేస్తున్నారంటూ కన్నీరు మున్నీరు అయ్యింది.
“ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ మీ ప్రయాణంపై నియంత్రణ తీసుకుని ఈ నామినేషన్ నుంచి బయటపడి, ఫైనలిస్ట్ గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి ఛాన్స్ మీకిస్తున్నాను. ఈ టాస్క్ లలో ఆడి, లీడర్ బోర్డులో టాప్ 1గా నిలిచిన వారికి నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ దక్కుతుంది. టాప్ 2 లో ఉన్నవారు ప్రేక్షకులను ఎదుర్కొని, నామినేషన్లను నుంచి సేవ్ అవ్వడానికి ఓటు అప్పీల్ చేసుకుని ఛాన్స్ పొందుతారు. చివర్లో ఉన్నవారు ఎప్పుడైనా ఎలిమినేట్ కావచ్చు. అందులో భాగంగా మీకిస్తున్న టాస్క్ స్వింగ్ జరా. తమకు కేటాయించిన ప్లాంక్ కు కట్టిన బాల్స్ ను దానికే ఉన్న హోల్స్ లో పడేలా చేయాలి” అంటూ మరో టాస్క్ షురూ చేశారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇమ్మూ 50, భరణి 40, డెమోన్ 30, తనూజ 20, సుమన్ 10 పాయింట్స్ తెచ్చుకున్నారు. సంజన జైల్లో, కళ్యాణ్ ఫస్ట్ ఫైనాలిస్ట్ కాబట్టి ఈ టాస్క్ ఆడలేదు.
Read Also : రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్… 13 వారాలకే హీరోయిన్ల రేంజ్ లో