E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్… 13 వారాలకే హీరోయిన్ల రేంజ్ లో

Bigg Boss 9 Telugu : రీతూ చౌదరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్… 13 వారాలకే హీరోయిన్ల రేంజ్ లో
Advertisement

Bigg Boss 9 Telugu : 13 వ వారం బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, టాస్క్ లు… ఇలా ఏ రకంగా చూసుకున్నా తనకన్నా తక్కువ స్థాయిలో పర్ఫామ్ చేసిన సంజన, సుమన్ శెట్టి లాంటి కంటెస్టెంట్లు హౌస్ లో ఉండగానే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. మరి ఈ 13 వారాల్లో ఆమె ఎంత పారితోషికం సంపాదించిందో తెలుసుకుందాం పదండి.

రీతూకి భారీ రెమ్యూనరేషన్ 

హౌస్ లో మొదటి నుంచి చలాకీగా కనిపించినప్పటికీ, విపరీతమైన నెగెటివిటీతోనే వచ్చింది. వస్తూనే డెమోన్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత టార్గెట్ అయ్యింది. ఆడియన్స్ నుంచి వైల్డ్ కార్డ్స్ వరకూ ప్రతీ ఒక్కరూ వీరి బాండ్ ను టార్గెట్ చేసిన వారే. ముఖ్యంగా ఫైర్ స్టార్మ్స్ అయితే వీళ్ళని విడగొట్టాలనే పంతంతోనే హౌస్ లోకి వచ్చారు. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా డెమోన్ – రీతూ కలిసే ఉన్నారు. మధ్యమధ్యలో వీళ్ళ గిల్లికజ్జాలు కొన్ని చికాకు పెట్టినా, రీతూ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ను అలరిస్తూనే, టాస్క్ లు వచ్చాయంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కూడా భయపడే రేంజ్ లో దుమ్మురేపింది. ఫేక్ ఏడుపు నుంచి క్యూట్ రీతూగా ఆడియన్స్ మనసు గెలుచుకుంది రీతూ. ఆడపులికి డెమోన్ తో బంధం మైనస్ అన్నారు కానీ అదే ప్లస్ అయ్యింది. ఎందుకంటే స్ట్రాంగ్ అన్న రీజన్ తో వీళ్లిద్దరికీ సపోర్ట్ చేసే కంటెస్టెంట్లు ఒక్కరు కూడా హౌస్ లో లేరు. ఏదైతేనేం విపరీతమైన నెగెటివిటీని తట్టుకుని 13వ వారం దాకా వచ్చింది రీతూ. టాప్ 5 ఖాయం అనుకుంటున్న తరుణంలో షాకింగ్ ఎలిమినషన్ తో బయటకు వచ్చింది. కాగా ఈ 13 వారాలకు గానూ రీతూ ఏకంగా 26 లక్షలు తన ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం. అంటే వారానికి రెండు లక్షలన్నమాట.

రీతూ ఎలిమినేషన్ కు కారణం సంజనే 

Advertisement

గత వారం సంజన – రీతూ మధ్య జరిగిన రచ్చ ఓటింగ్ పై గట్టి ఎఫెక్ట్ చూపించింది. “డెమోన్ తో రాత్రిపూట నువ్వు హత్తుకుని కూర్చుంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తోంది. హౌస్ లో నువ్వు చేసింది అంతకంటే ఏముంది?” అంటూ సంజన నోరు జారింది. ఆ టైమ్ లో సంజన అభిమానులతో పాటు చాలామంది అదే ఫీల్ అయ్యారు. ఎంతో కొంత సింపతీ రీతూకి కూడా దక్కింది. కానీ నాగార్జున వీకెండ్ లో సంజనకు సీరియస్ గా క్లాస్ పీకడంతో ఆమెను కావాలని టార్గెట్ చేశారంటూ కథ అడ్డం తిరిగింది. సంజన సారీ చెప్పడానికి బదులు సెల్ఫ్ రెస్పెక్ట్ కు ఓటేసింది.  ఫలితంగా రీతూ కంటే సంజనకు ఓటింగ్ ఎక్కువ పడింది.

Read Also : లవ్ యూ టూ చెప్పు… బిగ్ బాస్ కు మీసాల పిల్ల రీతూ రిక్వెస్ట్… ఎలిమినేషన్ ట్విస్ట్ తో కన్నీరు మున్నీరైన డెమోన్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×