E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 93 : తనూజాతో సంజన తగవు… భగ్గుమన్న భరణి… ఇమ్మూకి దక్కిన గోల్డెన్ ఛాన్స్

Bigg Boss 9 Telugu Day 93 : తనూజాతో సంజన తగవు… భగ్గుమన్న భరణి… ఇమ్మూకి దక్కిన గోల్డెన్ ఛాన్స్
Advertisement

Bigg Boss 9 Telugu Day 93 : ఈ వారం ఇంటి సభ్యులను అందరినీ నామినేట్ చేసి, ఇమ్యూనిటీ కోసం పోరాడమంటూ బిగ్ బాస్ టాస్క్ లు పెడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో లీడర్ బోర్డులో ఇమ్మాన్యుయేల్ 50 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. జైలులో ఉన్న సంజనకు జైలు నుంచి వేరు వేరు కారణాలతో 3 సార్లు జైలు నుంచి బయటకు వెళ్లాలని బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆమె దాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడంతో లీడర్ బోర్డులో 20 పాయింట్స్ ఇచ్చారు.

మళ్ళీ ఇమ్మూనే టాప్ లో 

Advertisement

తాజా ఎపిసోడ్ లో “లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న టాస్క్ వీల్ బ్యారెల్. దానిపై ఉన్న 5 పాట్స్ ను బ్యాలెన్స్ చేస్తూ, ముందున్న పెడల్స్ ను ఒకదాని తర్వాత ఒకటి క్రాస్ చేస్తూ, దారిలో ఉన్న పెడస్టల్స్ మీద పాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి” అని సెకండ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇమ్మూ గెలవగా, 150 స్కోర్ చేసి టాప్ లో ఉన్నాడు. డెమోన్ కు 120, సుమన్ కు 90, తనూజా, భరణికి 90, సంజనాకు 80 పాయింట్స్ వచ్చాయి. కానీ తరువాత ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. “ఇంటి సభ్యులందరూ కలిసి నేనిస్తున్న తరువాత టాస్క్ లో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుడిని ఎన్నుకోవాలి. వాళ్ళు తరువాత టాస్క్ లో పాల్గొనలేరు. వారికిచ్చే పాయింట్స్ 0” అంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో అందరూ కలిసి మాట్లాడుకుని ఇమ్మూను తొలగిద్దాం అనుకున్నారు. కానీ అందుకు ఇమ్మూ ఒప్పుకోలేదు.

అంతలోపు సంజన రచ్చ రచ్చ చేసింది. ఇమ్మూకి “తనూజా వాళ్ళు నీ పేరే చెప్పమని ఫోర్స్ చేస్తున్నారు” అని చెప్పింది. మరోవైపు వాళ్ళు భరణి పేరు చెప్పారు అంటూ చిచ్చు పెట్టింది. కానీ “భరణి అన్న పేరునే నేను తీయలేదు, టార్గెట్ చేయలేదు. మీరు ముగ్గురూ కలిసి నన్ను తీసేస్తా అంటే నేను సైలెంట్ గా ఉండాలా ?” అని అన్నాడు ఇమ్మూ. భరణి తన పేరును ఇమ్ము చెప్పాడు అనగానే ఫైర్ తో గొడవకు లేచి వచ్చాడు. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు “లీడర్ బోర్డులో ఇమ్మూ టాప్ లో ఉన్నాడు. అతనికి నెక్స్ట్ గేమ్ ఆడకపోయినా ఫరాక్ పడదు. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు” అని భరణి, సుమన్, తనూజా చెప్పారు.

Advertisement

సంజన వర్సెస్ తనూజ 

“ఒకవేళ నేను కలిసిరాక కంబ్యాక్ ఇవ్వలేక, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హగ్ ఇచ్చి టాటా బైబై చెప్పేస్తారు అంతేనా” అని ఫైర్ అయ్యారు ఇమ్ము. సంజన డెమోన్ పేరు, డెమోన్ సంజన పేరు చెప్పారు. అలాగే కళ్యాణ్ కూడా సంజన పేరు చెప్పాడు. ఇమ్మూ సంజనాకు చెరో 3 ఓట్లు పడ్డాయి. “ఇది జరుగుతుందనే నేను మీ ఓటు ముఖ్యమని చెప్పాను. మీరేమో నేను బెదిరిస్తున్నా అనుకున్నారు. మీరా నేనా అంటే నేను ఏం అంటాను?” అని అడిగాడు ఇమ్ము. దీంతో “బిగ్ బాస్ నా ఓటును మార్చి ఇమ్మూకి వేస్తా” అని చెప్పింది సంజన. వెంటనే తనూజా లేచి “నేను నా ఓటును సంజనకు వేస్తాను” అని చెప్పింది.

“నువ్వు మాటిచ్చావ్ కదా” అని అడిగింది సంజన. “ఎలాంటి పరిస్థితిలోనూ ఇమ్మూనీ తీయను అని చెప్పి తీసావ్. నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యినున్నాను. ఇమ్మూని తీయను, తనుజాను తీస్తాను అన్నప్పుడు ట్రోఫీ కనిపించలేదా?” అంటూ తనూజా సిరియస్ అయ్యింది. దీంతో సంజనా – తనూజా మధ్య వార్ నడిచింది.

ఇక లీడర్ బోర్డులో టాప్ లో ఉన్న ఇద్దరికి ప్రేక్షకులను ఎదుర్కొనే ఛాన్స్ ఇచ్చారు. డెమోన్ – ఇమ్మూ వెళ్ళి ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. చివరికి ఇమ్ముకి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కింది.

Read Also : ముందు తనూజాకే గాలం… మధ్యలోకి రీతూ… అడ్డంగా దొరికిపోయిన డెమోన్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×