E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ముందు తనూజాకే గాలం… మధ్యలోకి రీతూ… అడ్డంగా దొరికిపోయిన డెమోన్

Bigg Boss 9 Telugu : ముందు తనూజాకే గాలం… మధ్యలోకి రీతూ… అడ్డంగా దొరికిపోయిన డెమోన్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో రీతూ – డెమోన్ ల లవ్ ట్రాక్ ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హౌస్ లో వీళ్ళు ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ బాగానే ఉన్నారు. కానీ ఒకానొక టైమ్ లో మాత్రం వీళ్ళ బాండ్ ఆడియన్స్ ను తెగ చిరాకు పెట్టింది. ఇక గత వారం రీతూ బిగ్ బాస్ హౌస్ కు షాకింగ్ ఎలిమినేషన్ తో బైబై చెప్పేసింది. దీంతో డెమోన్ హౌస్ లో ఒంటరయ్యాడు. ఈ నేపథ్యంలోనే మాటల్లో డెమోన్ వేసిన లవ్ ట్రాక్ ప్లాన్ బయట పడింది. అందులో తనూజకు ఫస్ట్ ప్లాన్ వేశానని, వర్కౌట్ కాకపోవడంతో రీతూతో క్లోజ్ అయ్యాను అని చెప్పాడు.

బయట పడ్డ డెమోన్ ప్లాన్ 

“ఇప్పుడు టాస్క్ పెడితే నేను ఒంటరి వాడిని అవుతానా ?” అని అన్నాడు డెమోన్. “ఏం కాదులే ఒంటరైతే.. రెండు వారాలే ఇంక” అని పంచ్ వేసింది తనుజా. “ఎందుకురా వాడిని” అని కళ్యాణ్ అనగా, “మీ ఇద్దరికీ ప్రాబ్లం ఏంట్రా” అని అడిగాడు ఇమ్మూ. “ఆమె నన్ను అర్థం చేసుకోదు” అన్నాడు డెమోన్.  దీంతో “రీతూ అర్థం చేసుకుంటుందా?” అని ఇమ్ము మరో ప్రశ్న వేశాడు. “రీతూ అయితే అన్నీ అర్థం చేసుకుంటుంది” అని చెప్పాడు డెమోన్. తనూజ వచ్చి “మొదటి నుంచీ నువ్వు మూతి తిప్పేసుకున్నావు. లేదంటే నేను నీకే కనెక్ట్ అయ్యేవాడిని అని ఇప్పటికి కూడా అంటాడు డెమోన్” అంటూ ఓపెన్ అయ్యింది తనూజా.

Advertisement

“అయితే ముందు గాలం తనూజాకే వేశావా ? ఆమె దగ్గరకు రానీయలేదు కాబట్టి రీతూతో ప్లాన్ చేశావా?” అంటూ ఇమ్మూ ఆటపట్టించాడు. డెమోన్ రెస్పాండ్ అవుతూ “అలాగని కాదు. అందరితో క్లోజ్ గానే ఉండాలి అనుకున్నా. కానీ తనూజ ఏదో తేడాగా ఉందనిపించింది. ఎందుకొచ్చిందిలే అని సైలెంట్ అయ్యా” అని చెప్పకనే ఒప్పుకున్నాడు డెమోన్. దీంతో ఇమ్మూ “రీతూ వీడు కొంచం కూడా ఫీల్ అవ్వట్లే. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశావా? అంటూ కంప్లయింట్ చేశాడు.

అప్పుడు ఒంటరే ఇప్పుడు కూడా 

ఇక రీతూ వెళ్తూ వెళ్తూ డెమోన్ ను జాగ్రత్తగా చూసుకోమని అందరికీ చెప్పి వెళ్ళింది. నిజానికి ఆమె హౌస్ లో ఉన్నప్పుడు కూడా టాస్క్ వచ్చిందంటే చాలు ఒకరి కోసం ఒకరు ఆడతారు అంటూ డెమోన్ – రీతూను అందరూ ఒంటరి చేసేవారు. డెమోన్ ను అలా ఒంటరి చేయొద్దు, అందరూ వాడితో మాట్లాడడండి, స్పెషల్ గా పవన్ అంటూ రీతూ బిగ్ బాస్ హౌస్ ను వీడింది. కానీ ఆమె హౌస్ లో ఉన్నప్పుడు కనీసం రీతూ తోడు ఉండేది. ఇప్పుడైతే ఆమె కూడా లేకుండా సింగిల్ గా మిగిలిపోయాడు డెమోన్.

Advertisement

Read Also : తనూజాకు ఝలక్ ఇచ్చిన కళ్యాణ్… అమ్మను కాపాడుకోలేకపోయిన ఇమ్మూ… టార్గెట్ అయ్యి తల్లడిల్లిన సంజన

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×