E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu promo: రీతూ లేకపోవడంతో హ్యాపీగా పవన్.. గేమ్ కోసమే రీతూతో క్లోజ్?

Bigg Boss 9 Telugu promo: రీతూ లేకపోవడంతో హ్యాపీగా పవన్.. గేమ్ కోసమే రీతూతో క్లోజ్?
Advertisement

Bigg Boss 9 Telugu Promo: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో 9వ సీజన్ ప్రసారం అవుతుంది. ఇక తొమ్మిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక నేడు 97వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ కార్యక్రమం నుంచి ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా సాగిపోయిందని చెప్పాలి. ఇక నాగార్జున వచ్చి రావడంతో పవన్ తో మాట్లాడారు. రీతు చౌదరి(Rithu Chowdary) హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అందరితో బాగా కలిసి పోతున్నావు కదా అంటూ మాట్లాడటంతో వెంటనే పవన్ అవును సర్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

రీతూ లేకపోతేనే హ్యాపీగా పవన్..

ఇలా రీతు లేకపోవడంతోనే అందరితో కలిసి సరదాగా ఉన్నానని ఈ వారం చాలా సరదాగా గడిచిపోయింది అంటూ పవన్ చెప్పడంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు. వెంటనే సంజన రమ్య మోక్ష ఇంకో వారం ఉంటే బాగుండేది అని కూడా అన్నారు సార్ అంటూ చెప్పడంతో వెంటనే నాగార్జున బయటికి రా నీ సంగతి చెబుతుంది అంటూ మాట్లాడారు. అనంతరం హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి ఏడుగురు కంటెస్టెంట్ లో ఫోటోలను పెట్టి ఈ ఏడుగురులో ఎవరిని నమ్మొచ్చు.. ఎవరిని నమ్మకూడదు చెప్పాలి అంటూ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఇచ్చారు. నమ్మేవారికి గ్రీన్ కలర్ ఫ్లాగ్ నమ్మని వారికి రెడ్ కలర్ ఫ్లాగ్ పెట్టమని చెబుతూ ఉన్న ఏడుగురి మధ్య ఫిట్టింగ్ పెట్టారు.

ఎమోషనల్ గా భరణి సుమన్ శెట్టి బాండింగ్..

Advertisement

ఇక ఈ ప్రోమోలో సుమన్ శెట్టి భరణి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఒక స్పెషల్ వీడియో ప్లే చేయడంతో అందరిని ఆకట్టుకుంది సుమన్ శెట్టి ఫోటో దగ్గర భరణి వెళ్లి నమ్మొచ్చు అంటూ గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెట్టడంతో వీరిద్దరికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ తో ఒక వీడియోని ప్లే చేశారు. నిజంగా వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇలా ఈ ప్రోమో సరదాగా సాగిపోయిందని చెప్పాలి. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది.

Advertisement

ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి బయటకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ పరంగా లీస్టులో సుమన్ శెట్టి ఉండడంతో నేడు సుమన్ శెట్టి హౌస్ నుంచి రాబోతున్నారని అలాగే ఆదివారం ఎపిసోడ్లో భాగంగా భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు ఫినాలేకి వెళ్ళనున్నారు. ఇక హౌస్లో ప్రస్తుతం భరణి, సుమన్ శెట్టి, పవన్, కళ్యాణ్, ఇమ్మానుయేల్, సంజన , తనూజ ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: Hebha Patel: రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ.. ఆ పోస్ట్ కు అర్థం అదేనా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×