The Raja Saab : ‘ది రాజా సాబ్’ మూవీపై మేకర్స్, ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లినట్టుగా అయ్యింది. రికార్డుల ఊచకోత అని కాలర్ ఎగరేద్దాం అనుకున్న అభిమానులకు ఆ ఛాన్స్ దక్కేలా కనిపించడం లేదు తెలంగాణలో పరిస్థితి. దీనంతటికీ కారణం అల్లు అర్జున్ అంటూ మండిపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ‘ది రాజా సాబ్’ కలెక్షన్స్ ను, అల్లు అర్జున్ కు అసలు లింకు ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి టాలీవుడ్ షాక్ అయ్యే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇకపై తెలంగాణలో టికెట్ల దరలు పెంచడం ఉండదని తేల్చి చెప్పారు. దీని ఎఫెక్ట్ సంక్రాంతికి రాబోయే సినిమాలపై పడుతున్నది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. మెయిన్ ఎఫెక్ట్ ‘ది రాజా సాబ్’ పైనే ఉండబోతుంది. ఎందుకంటే ఈ మూవీని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించారు. అలాగే మూవీ రిలీజ్ అయ్యాక భారీ ఓపెనింగ్స్, రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టికెట్ ధరల పెంపునకు అవకాశం లేదు. దీంతో మూవీ కలెక్షన్లపై దెబ్బ పడే ఛాన్స్ ఉంది. టికెట్ రేట్లు పెంచకపోతే కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేయడం కష్టమే మరి. దీని అంతటికి కారణం అల్లు అర్జునే. 2024 డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్ చేసిన తప్పే అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఆ రోజు రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనను ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. పోలీసుల మాట బన్నీ విని ఉంటే… తొక్కిసలాటలో ఆవిడ చనిపోయేది కాదు. ఆ అబ్బాయికి అలా అయి ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ ఈ టికెట్ల గోల లేకుండా ప్రశాంతంగా ఉండేది అని అనుకుంటున్నారు. కానీ ఆ ఒక్క తొక్కిసలాట కారణంగా మొదలైన టికెట్ రేట్లు సమస్య ఇంకా కొనసాగుతోంది. పెద్ద సినిమా వచ్చిన ప్రతీసారి అదే జరుగుతోంది. ఇటీవల కొన్ని సినిమాలకు టికెట్ రేట్లను పెంచారు కూడా. కానీ మళ్ళీ టికెట్ రేట్ల పెంపు సమస్య కోర్టు దృష్టిని వెళ్లడం, తెలంగాణ ప్రభుత్వం ఇకపై టికెట్ రేట్లు పెంచేది లేదని డిసైడ్ అవ్వడంతో బన్నీని ప్రభాస్ ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు.
నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అఖండ 2’ డిసెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి. టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల హైక్ జీవోను కోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా కోర్టు ఆదేశాలను పాటించలేదని బుక్‌మై షో పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి ‘అఖండ 2’ టికెట్ రేట్ల విషయంలో పొరపాటు జరిగిందని, ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచడం ఉండదని చెప్పి టాలీవుడ్ పై బాంబ్ వేశారు.
Read Also : వృద్ధాశ్రమంలో చేరిన ప్రముఖ నటి… ఎవరూ సాయం చేయలేదా?