E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 98 : వీకెండ్ మస్తీ… హౌస్ లో జరిగిన మోస్ట్ పాపులర్ సీన్స్ రీక్రియేషన్… టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

Bigg Boss 9 Telugu Day 98 : వీకెండ్ మస్తీ… హౌస్ లో జరిగిన మోస్ట్ పాపులర్ సీన్స్ రీక్రియేషన్… టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే
Advertisement

Bigg Boss 9 Telugu Day 98 : బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ సండే ఫన్ డే ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇప్పటికే టాప్ 7లో నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ తనూజ, భరణి, ఇమ్మూ, డెమోన్, కళ్యాణ్, సంజన ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ముందుగా విన్నర్ ప్రైజ్ మనీని రివీల్ చేస్తూ, మారుతీ సుజుకి విటోరిస్ అనే కారును కూడా విన్నర్ ఇంటికి తీసుకెళ్తారని ప్రకటించారు. 50 లక్షల ప్రైజ్ మనీని చూడగానే కంటెస్టెంట్స్ లో ఫుల్ ఎనర్జి వచ్చింది.

ప్రైజ్ మనీ ఎవరికి ?

ఈ ప్రైజ్ మనీని గెలిచిన వాళ్ళు ఎవరికి ఎంత ఇచ్చి బయటకు పంపిస్తారు? అని నాగార్జున ఒక్కొక్కరినీ చెప్పమని అడిగారు. ముందుగా భరణి డెమోన్, ఇమ్మూలను బయటకు పంపుతాను అని చెప్పాడు. కానీ ఇమ్మూకైతే 20 లక్షలు ఇచ్చి పంపుతాను. ఆ ప్రైజ్ మనీతో నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడంతో పాటు ఓల్డేజ్ హోమ్ కి ఇస్తా అని వెల్లడించాడు. ఇమ్మూ కూడా భరణి పేరే చెప్పాడు. అలాగే తన అప్పులు తీర్చుకుని, నమ్మి వచ్చిన అమ్మాయిని పీజీ చదివిస్తానని, తన అన్నను, అక్క పిల్లలను చూసుకుంటానని చెప్పాడు. నాగార్జున ‘అప్పుడేమో పవర్ అస్త్రాతో బయటకు పంపావు. ఇప్పుడు ఇలా’ అంటూ ఇమ్మూను ఇరికించారు. ‘అయ్యయ్యో వద్దు సార్… వాళ్ళు నిజమేమో అనుకుంటారు సార్’ అంటూ ఇమ్మూ నాగార్జునను వేడుకోవడంతో నవ్వించింది. ఇక డెమోన్ కు మాత్రం అందరిలా కాకుండా “ప్రైజ్ మనీలో రీతూకి ఎంత గిఫ్ట్ కొనిస్తావు ?” అని అడిగారు నాగ్. డీమెన్ టక్కున “5 లక్షలతో రీతూకి గిఫ్ట్ కొనిస్తాను” అని చెప్పాడు. తనకొచ్చిన మనీని మరో కామనర్ అయిన కళ్యాణ్ తో సగం షేర్ చేసుకుంటా అని, మిగతాది తన తండ్రి టంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కు వాడతానని చెప్పాడు. కళ్యాణ్ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటానని, తనూజ ఎడ్యుకేషన్ లేని పిల్లలను చదివిస్తానని, సంజన మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఇస్తానని చెప్పారు.

టాలీవుడ్ టౌన్ లోకి కొత్త హీరో

Advertisement

ఈ ఫన్నీ టాస్క్ తర్వాత తమన్ ను ‘మై టెడ్డి బేర్’ అంటూ హౌస్ లోకి ఆహ్వానించారు నాగార్జున. అలాగే ఓ కొత్త హీరోని తీసుకొచ్చి పరిచయం చేశారు. ఆయన వస్తూనే మాటలతో కాకుండా చేతులతో సైగలు చేశారు. ‘సారీ సార్… డైరెక్టర్ ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకపోవడంతో అలవాటులో పొరపాటుగా అలా చేశాను’ అంటూ తన సినిమా గురించి మాట్లాడాడు. ‘మీరు ఇప్పటి వరకూ చెప్పని అన్ టోల్డ్ లవ్ స్టోరీ ఏదన్నా ఉందా సార్ ?” అని నాగార్జునను అడగ్గా… తమన్ ‘గ్రీకు వీరుడితో మాట్లాడుతున్నావ్’ అనే పంచ్ తో నవ్వించాడు. ఇది అనీష్ హీరోగా నటిస్తున్న ‘న్యూ గాయ్ ఇన్ టౌన్’ అనే సినిమా ప్రమోషన్.

అనంతరం ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మోస్ట్ పాపులర్ కాంట్రవర్సీని రీక్రియేట్ చేయమని చెప్పారు నాగార్జున. ముందుగా రీతూ – డెమోన్ గొడవను సంజన – భరణి రీక్రియేట్ చేసి ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. అలాగే కళ్యాణ్ – తనూజా టచ్, విజిల్ గొడవను, ట్రయాంగిల్ కాంట్రవర్సీ, సుమన్ నామినేషన్ గొడవను కూడా రీక్రియేట్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ పై మీకున్న కంప్లైంట్స్ ను చెప్పి, గిఫ్ట్స్ పొందండి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగార్జున. ఇమ్మూపై చెవులు చిల్లులు పడే రేంజ్ లో కంప్లైంట్స్ చేసి 3 గిఫ్టులు అందుకుంది తనూజ. అలాగే తనూజాపై డెమోన్ కంప్లైంట్ చేయగా, ఇమ్మూ సంజనపై, భరణి సంజనపై, సంజన డెమోన్ పై, కళ్యాణ్ భరణిపై కంప్లయింట్ చేసి గిఫ్ట్స్ అందుకున్నారు. మధ్య మధ్యలో ఫైనలిస్టులను ప్రకటించారు. సెకండ్ ఫైనాలిస్ట్ తనూజ, థర్డ్ ఫైనలిస్ట్ డెమోన్, ఫోర్త్ ఫైనలిస్ట్ ఇమ్మూ, ఫిఫ్త్ ఫైనలిస్ట్ సంజన. భరణి ఎలిమినేట్ అయ్యాడు.

Advertisement

Read Also : సుమన్ శెట్టి ఎలిమినేషన్… బిగ్ బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×