E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ఎలిమినేషన్… బిగ్ బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్

Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ఎలిమినేషన్… బిగ్ బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 వరకు కొనసాగాలంటే ఆడియన్స్ ఓటింగ్, హౌస్ మేట్స్ సపోర్ట్ మాత్రమే కాదు కూసింత లక్కు కూడా ఉండాలి. అది సుమన్ శెట్టికి కాసింత ఎక్కువగానే ఉంది. మొదట్లోనే ఎలిమినేట్ అవుతాడనుకున్న సుమన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్స్, ఫైర్ స్టార్మ్స్ అన్నింటినీ దాటుకుని టాప్ 7 వరకూ వచ్చాడు. అంతేకాదు ఈ 14 వారాల్లో ఆయన అందుకున్న భారీ రెమ్యునరేషన్ మరో విశేషం.

అమాయకత్వంతో ఆఖరి వరకూ…

అమాయకత్వంతో పాటు అతని మంచితనమే సుమన్ శెట్టిని ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగేలా చేసింది. కన్నింగ్ గేమ్ ఆడకుండా ఆ నిమిషం మనసులో ఏం అన్పిస్తే అదే చెప్పి, చేసి ఆడియన్స్ మనసును గెలుచుకున్నాడు. కానీ ఆయన పెద్దగా గేమ్ ఆడలేదు. అప్పుడప్పుడూ కొన్ని టాస్క్ లలో మెరవడం, భరణితో ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ కన్పించలేదు. అది ఆయన అభిమానుల వరకూ ఓకే. కానీ మిగిలిన ఆడియన్స్ మాత్రం సుమన్ శెట్టి కంటే వర్త్ అనిపించిన మిగిలిన కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి, అతన్ని మాత్రం చివరి వరకూ లాక్కురావడం ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా రీతూ ఎలిమినేట్ అవ్వడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రేక్షకులు. ఆ సమయంలో సుమన్ అవుట్ అవ్వాల్సి ఉండగా, ప్లాన్ చేంజ్ చేసి రీతూను పంపేశారు. ఏ రకంగా చూసుకున్నా కూడా సుమన్ కంటే రీతూనే బెటర్.

Advertisement

ఏదైతేనేం అందరితో బాగుండే మంచితనం, ముఖ్యంగా భరణి, తనూజ, ఇమ్మూలతో ఫ్రెండ్షిప్ కారణంగా ఆయనకు ఓటింగ్ కూడా బాగానే పడింది. పెద్దగా ఆడకపోయినా, కొన్ని టాస్క్ లలో ఆడి నాగార్జున చేత శభాష్ అన్పించుకున్నారు. అంతేకాదు హనుమంతుడి బలం తనకే తెలియనట్టు సుమన్ శెట్టిలో ఉన్న బలం ఏంటో అతనికి ఈ హౌస్ లోకి వచ్చేదాకా తెలియలేదు. తనూజతో కలిసి ఆడిన వాటర్ టాస్క్ లో సుమన్ శెట్టి ప్రభంజనం ఎలా ఉంటుందో ఆడియన్స్ చూశారు. ఇక చివరికి ఒక్క వారం మిగిలి ఉండగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

సుమన్ ఖాతాలో ఎన్ని లక్షలు ?

అయితే బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న సెలబ్రిటీల లిస్ట్ లో చేరిపోయారు సుమన్. ఆయనకు రోజుకి 45 వేల రెమ్యూనరేషన్… అంటే 14 వారాలకు గానూ 44 లక్షలు సుమన్ ఖాతాలో బిగ్ బాస్ వేసినట్టు టాక్. అదే నిజమైతే యాంకర్ రవి తర్వాత ఆ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టినే. బిగ్ బాస్ హౌస్ లో మంచితనంతో ఇన్ని వారాలు నెట్టుకురావడం అన్నది మామూలు విషయం కానే కాదు. సుమన్ మాత్రం లక్కుతో ఆడుతు పాడుతూ ఆ 14 వారాలు హౌస్ లో ఉండి తనదైన ముద్ర వేశాడు. ఇక ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని రూమర్లు విన్పిస్తున్నాయి.

Advertisement

Read Also : సంజనాపై తనూజ రివేంజ్ ప్లాన్ ను బయట పెట్టిన నాగార్జున… రిగ్రెట్ వీక్… సుమన్ అవుట్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×