Bigg Boss 9 Telugu Day 99 : ఈ ఎపిసోడ్ మొదట్లోనే డెమోన్ – తనూజ గొడవ పడ్డారు. తరువాత టాప్ 5 కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ అభినందించారు.
“ఇంటి సభ్యులు బిగ్ బాస్ జర్నీ అంటే ఏంటి అనే ప్రశ్నకు మీ హృదయం నుంచి వచ్చే భావాలను పంచుకోవాలి. ఇమ్మూ “బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు. ఈజీగా నవ్వించవచ్చు అనుకున్న. కానీ వచ్చిన ఫస్ట్ వీకే హరీష్ గారితో గొడవ జరిగింది. దీంతో ఇన్నాళ్ళో నేను కట్టుకున్న కోట కూలిపోయిందా అని బాధ పడ్డాను. రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. అలాంటి టైమ్ లోనే మా మమ్మా పరిచయం అయ్యి, మంచి బూస్ట్ ఇచ్చింది నాకు. ఒక మ్యాటర్ ను తలుచుకుంటేనే ఏడుపు వస్తుందనే విషయం ఇక్కడికి వచ్చాకే తెలిసింది” అంటూ తన స్టోరీ చెప్పుకొచ్చాడు. “నాతో కనీసం ఒక్క రెండు వారాలు ఎవరైనా ఉండగలుగుతారా? భరించగలుగుతారా? అని నా మీద నేను జోకులు వేసుకుని వచ్చాను. ఇది నాకు రీలైఫ్” అని చెప్పింది సంజన.
“బిగ్ బాస్ కు వచ్చే ముందు కెరీర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నాను. మా డాడీనీ సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఇంకా మా అన్నయ్య మీద డిపెండ్ అవుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను. ఇక్కడికి వచ్చే వన్ మంత్ ముందే మా నాన్నకు టంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం ఏకంగా 7 నెలలు వెయిట్ చేశాను. ఇలా కష్టపడుతున్న టైమ్ లోనే మా అన్నయ్య కామనర్స్ కు బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తున్నారట. అప్లై చేసుకో అని చెప్పారు. చేయడం, సెలెక్ట్ కావడం ఇక్కడిదాకా రావడం జరిగింది. ఈ క్రమంలోనే కిచెన్ టీంలో ఎక్కువగా ఉండడంతో రీతూతో మంచి పరిచయం ఏర్పడింది. ఇది నాకు న్యూ బిగినింగ్ బిగ్ బాస్ థాంక్యూ” అంటూ ఎమోషనల్ అయ్యాడు డెమోన్. “నాకు నా ఫ్యామిలీ కంటే ఎక్కువ లవ్ ఇచ్చింది నా తెలుగు ఆడియన్స్. ఇక్కడికి వచ్చాక ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉండడం నేర్చుకున్నా” అని తనూజా చెప్పింది. “బిగ్ బాస్ అంటే కావాలనుకునే కష్టం. నిద్ర సరిగ్గా ఉండదు. ఫుడ్ సరిగ్గా ఉండదు. మనుషులు కరెక్ట్ గా ఉండరు. అయినా ఇది కావాలి” అంటూ కళ్యాణ్ చెప్పాడు.
“మీ ఐదుగురు బిగ్ బాస్ సీజన్ 9 అల్టిమేట్ యోధులు. ది ఫైవ్ ఫైటర్స్. ఈ సీజన్లో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన టాస్క్ లను మళ్ళీ గుర్తు చేసుకుందాం. వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్. ప్రతీ రోజు మీలో ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది డే అయ్యి, మీ ఆత్మీయుల నుంచి సందేశాన్ని పొందే ఛాన్స్ పొందబోతున్నారు” అంటూ మళ్ళీ ఐకానిక్ టాస్క్ లను రిపీట్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా పోటీదారులకు ఇచ్చిన టాస్క్ ‘రేస్ ఆఫ్ గ్లో’. ఈ టాస్క్ లో భరణి,డెమోన్… తనూజా కళ్యాణ్ రెండు టీములుగా ఆడారు. సంజన సంచాలక్. ఈ టాస్క్ లో డెమోన్ – ఇమ్మూ టీం విన్ కాగా, ఇద్దరికీ స్టార్స్ పంపించారు బిగ్ బాస్. అలాగే ట్రీట్ గా బర్గర్స్ ను ఇచ్చారు. అయితే వాటిని గెలిచిన ఇద్దరు మాత్రమే తినాలని కండిషన్ పెట్టారు.
వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్ లో ఇచ్చిన మరో టాస్క్ ‘నాచోరే నాచోరే’. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకున్న కలర్ హోల్స్ లో నుంచి బయటకు రావాలి. చివరగా వచ్చే వాళ్ళు టాస్క్ నుంచి ఔట్. అలా ఒక్కొక్కరుగా బయటకు రాగా, చివరకు డెమోన్ విన్ అయ్యి మరో స్టార్ తో పాటు తనకు ఇష్టమైన డెజర్ట్ ను ట్రీట్ గా పొందాడు. దీంతో వీడిని ఇద్దరం కలిసి నెక్స్ట్ గేమ్ లో గెలవకుండా చేయాలిరా అని ఇమ్మూ ప్లాన్ చేశాడు. పోనీలే అన్నా 13 వారాల తరువాత ఎలాంటి అడ్డంకులు లేకుండా గెలుస్తున్నాడు అని కళ్యాణ్ సర్ది చెప్పాడు.
Read also : ఎంత దూరం పెడదామని ట్రై చేసినా… తనూజపై భరణి షాకింగ్ కామెంట్స్