E-Paper
Advertisement

Bigg Boss Buzz : ఎంత దూరం పెడదామని ట్రై చేసినా… తనూజపై భరణి షాకింగ్ కామెంట్స్

Bigg Boss Buzz : ఎంత దూరం పెడదామని ట్రై చేసినా… తనూజపై భరణి షాకింగ్ కామెంట్స్
Advertisement

Bigg Boss Buzz Promo : బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రతీ కాంటెస్టెంట్ ను బిగ్ బజ్ లో శివాజీ ఎంత రోస్టింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షోలో ఎలిమినేషన్ కార్యక్రమం అలా అయిపోగానే, ఇలా బిగ్ బజ్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఎలిమినేట్ అయిన భరణిని శివాజీ ఓ ఆట ఆడుకున్నారు. బిగ్ బజ్ ప్రోమోలో శివాజీ ప్రశ్నలకు భరణి ఇచ్చిన సమాధానాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

ఎంత దూరం పెడదాం అనుకున్నా…  

ప్రోమోలో “ఎవరికైనా బిగ్ బాస్ హౌస్ లో లైఫ్ లో ఒక్కసారి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటారు. కానీ మీకు రెండు సార్లు వచ్చింది. వై నో సద్వినియోగం ? అసలు ఎక్కడ కొట్టింది అని ?” అడిగారు శివాజీ. “ఎక్కడ కొట్టింది అని కాదు గానీ… మిగతా 5 మంది నాకంటే బాగా ఆడారేమో” అని సమాధానం చెప్పాడు భరణి. “సెకండ్ టైమ్ ఎంట్రీ తర్వాత దివ్యాను దూరం పెట్టడానికి ట్రై చేశారు?” అన్న ప్రశ్నకు… “గేమ్ పరంగా తనకు నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఎంత దూరం పెడదాం అని ట్రై చేసినా…” అంటూ అది నిజమేనని ఒప్పుకున్నారు. “మనమెందుకు బాధ పడాలి?” అని శివాజీ అడిగితే… “గేమ్ అనేది మైండ్ తో ఆడాలి. కానీ ఇక్కడ నా మైండ్ ను హార్ట్ డామినేట్ చేసింది” అని చెప్పాడు భరణి.

తనూజ గేమ్ ముందే తెలుసు 

Advertisement

“మెడిసిన్ తీసుకున్న రోజున మీరు ఇట్స్ ఓకే అండి పర్లేదు అన్నారు. కానీ నామినేషన్ లో దాన్నే తీసుకురావడం బాలేదు అన్పించింది” అంటూ సంజన – భరణి గొడవ గురించి అడిగారు. “ఫన్ చేస్తానని చెప్పింది నా మీద. నా మెడిసిన్ దాచి ఫన్నా?” అంటూ సిరియస్ అయ్యాడు భరణి. ఇక “తనూజా తన గేమ్ తాను ఆడుకుంది. మీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అది మీకు ఎప్పుడూ అర్థం అయ్యింది? ” అని భరణిని అడిగారు శివాజీ. “కొన్ని కొన్ని సందర్భాలలో అర్థం అయ్యింది. ఇవన్నీ మాట్లాడవచ్చో లేదో” అని భరణి అంటుండగానే ప్రోమోను ఎండ్ చేశారు.

మరి పూర్తి ఎపిసోడ్ ను చూస్తేనే గానీ ఆయన ఏం చెప్పారు అన్నది తెలియదు. కానీ చివర్లో తనూజా తన గేమ్ తాను ఆడుకుంది అన్న విషయం అర్థం అయ్యింది అంటూ భరణి చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలియగానే భరణి తనూజా కప్పు కొట్టి, తనను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేయాలని కోరారు. హౌస్ లో ఉన్నన్ని రోజులూ భరణి – తనూజ – దివ్య బాండ్ గురించి రచ్చ రచ్చ జరిగింది. ఇక దివ్య ఎంట్రీతో బీటలు వారిన తనూజ – భరణి బంధం.., ఆమె ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయాక కూడా బాగవ్వలేదు.

Advertisement

Read Also : వీకెండ్ మస్తీ… హౌస్ లో జరిగిన మోస్ట్ పాపులర్ సీన్స్ రీక్రియేషన్… టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×