E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఒంటరైన ప్రేమ పక్షులు డెమోన్ – రీతూ… మరీ ఇలా పగబట్టారేంటి భయ్యా ?

Bigg Boss 9 Telugu : ఒంటరైన ప్రేమ పక్షులు డెమోన్ – రీతూ… మరీ ఇలా పగబట్టారేంటి భయ్యా ?
Advertisement

Bigg Boss 9 Telugu : ప్రేమ పక్షులు డెమోన్ – రీతూ బిగ్ బాస్ హౌస్ లో ఒంటరయ్యారు. రీతూతో క్లోజ్ గా ఉండే తనూజ కూడా చివరికి రీతూకి హ్యాండ్ ఇచ్చింది. ఇంతకీ హౌస్ లో ఏం జరిగింది? అందరూ కలిసి రీతూని ఎందుకు టార్గెట్ చేశారు? అనే వివరాల్లోకి వెళ్తే…

రీతూపై పగబట్టిన హౌస్ మేట్స్

రీతూ కోసం నిలబడ్డ ప్రతిసారీ డెమోన్ విలన్ అవుతున్నాడు. రీతూ చేసే పనుల వల్ల అతనిపై బ్యాడ్ ఎఫెక్ట్ పడుతోంది. తాజాగా రీతూ ‘రింగ్ మాస్టర్’ టాస్క్ లో రింగ్ దాచిపెడితే, భరణి డెమోన్ పై ఒంటికాలిపై లేచాడు. నిజానికి భరణి బాధ పడుతుంటే చూడలేక, రీతూ దగ్గర క్లారిటీ తీసుకుని వచ్చి చెప్పబోయాడు డెమోన్. కానీ అడికాస్తా నెగెటివ్ అయ్యింది. ఇక ఆ తరువాత మొదలైంది యుద్ధం. భరణి గడులు అన్నీ లాగేసుకున్న రీతూకి కళ్యాణ్, ఇమ్మూతో కలిపి ‘కట్టు నిలబెట్టు’ అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్.

Advertisement

ఇందులో హౌస్ మేట్స్ అందరూ ఒక్కటై రీతూకి పట్టపగలే చుక్కలు చూపించారు. ఏమాత్రం కనికరం లేకుండా ఇమ్మూ, కళ్యాణ్ ను వదిలేసి రీతూని టార్గెట్ చేశారు. రింగ్ దాచింది అన్న కోపంతో భరణి, అతనికి ఫేవర్ గా సుమన్ రీతూని టార్గెట్ చేస్తే, మరోవైపు డెమోన్ ఒక్కడే రీతూని కాపాడడానికి తన శాయశక్తులా ట్రై చేశాడు. ఇదిలా ఉంటే డెమోన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నాడు అంటూ తనూజ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రీతూని టార్గెట్ చేసి టవర్ ను పడగొట్టడానికి బాల్స్ వేసింది. ఇలా హౌస్ అంతా ఒక్కటి కావడంతో రీతూ – డెమోన్ ఇద్దరూ ఒంటరయ్యారు.

ఎప్పుడూ ఇదే తంతు 

నిజానికి ఎప్పుడు ఏ టాస్క్ వచ్చినా వీరిద్దరికీ స్ట్రాంగ్ అనే కారణంతో హౌస్ మేట్స్ సపోర్ట్ చేయరు. ఒకరికొకరు అన్నట్టుగా నడుచుకుంటారు రీతూ – డెమోన్. ఇప్పుడు కూడా అదే జరిగింది. టవర్ కూలిపోయి ఒడిపోవడంతో రీతూ గుక్కపెట్టి ఏడ్చింది. డెమోన్ కూడా ఆమె కోసం ఆడి అలసిపోయాడు. ‘నువ్వు ఒక్కడివే సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది?” అని డెమోన్ తో చెప్పి బాధ పడింది. “హౌస్ అంతా ఒక్కటైతే ఇంకెందుకు బిగ్ బాస్ ఈ టాస్క్?” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఒకానొక టైమ్ లో తనను ఒక్కదాన్నే టార్గెట్ చేయడం ఆపమని అందరినీ పేరు పేరునా వేడుకుంది రీతూ. తనూజాకు తప్ప ఒక్కరి మనసు కూడా కరగలేదు అక్కడ. చివరికి డెమోన్ – తనూజ సపోర్ట్ తో ఫస్ట్ ఫైనలిస్ట్ చివరి వరకూ చేరుకున్న రీతూ… ఆఖరి నిమిషంలో కళ్యాణ్ స్పీడ్ ను అందుకోలేక ఓడిపోయింది.

Advertisement

Read Also : కళ్యాణ్ కోసం తనూజ స్టాండ్… కట్టగట్టుకుని రీతూని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… ఫస్ట్ ఫైనలిస్ట్ పట్టేసింది ఎవరంటే?

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×