E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 89 : కళ్యాణ్ కోసం తనూజ స్టాండ్… కట్టగట్టుకుని రీతూని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… ఫస్ట్ ఫైనలిస్ట్ పట్టేసింది ఎవరంటే?

Bigg Boss 9 Telugu Day 89 : కళ్యాణ్ కోసం తనూజ స్టాండ్… కట్టగట్టుకుని రీతూని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… ఫస్ట్ ఫైనలిస్ట్ పట్టేసింది ఎవరంటే?
Advertisement

Bigg Boss 9 Telugu Day 89 : రీతూ – భరణి ఆడిన నిన్నటి టాస్క్ లో తనూజా డౌట్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. అయితే భరణి వేయాల్సిన రింగ్ ను రీతూ దాచిపెట్టడం భరణి ఆగ్రహానికి కారణం అయ్యింది. భరణి తన రెక్ట్యాంగిల్ సెట్ చేసినా కూడా సంచాలక్ దగ్గర ఆ రింగ్ లేకవడంతో, చేసేదేం లేక చేతులు ఎత్తేశాడు. కానీ రీతూ స్ట్రాటజీ అనుకుని, తాను కరెక్ట్ ట్రయాంగిల్ పెట్టే దాకా భరణి రింగ్ ను తన దగ్గరే దాచుకుంది. అయితే ముందు తానేమీ కావాలని చేయలేదని బొంకిన రీతూ, డెమోన్ దగ్గర మాత్రం అది తనకు గార్బేజ్ లోని బాక్స్ లో దొరికిందని, దాన్ని తన టాస్క్ అయ్యేదాకా దాచానని చెప్పింది. అలాగే భరణి అడిగే టైమ్ కి దాన్ని అక్కడే ఎక్కడో పారేశానని క్లారిటీ ఇచ్చింది.

భరణి వర్సెస్ కళ్యాణ్ 

రీతూ రింగ్ దాచింది అన్న విషయాన్ని తనూజ భరణికి చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ కోపంలోనే “ఎవరు షూస్ ఊపితే ఎవరికి హెల్ప్ అయ్యిందో తెలుసు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఏం చూపించారో నాకు బాగా తెలుసు” అని నోరు జారాడు. నిజానికి ఆయన అన్నది డెమోన్ ను. కానీ నింద మొత్తం కళ్యాణ్ మీదే పడుతుంది. దీంతో కళ్యాణ్ “అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పటిదాకా డెమోన్ కు కూడా తెలీదు. నాకు అదంతా శ్రీజ చెప్పింది. మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారు?” అంటూ ఫైర్ అయ్యాడు. “నీ పేరు తీయలేదు కదా” అంటూ భరణి కళ్యాణ్ మీద మీదకు వెళ్ళాడు. ఇమ్మూ, డెమోన్, తనూజా ఈ గొడవను ఆపడానికి ట్రై చేశారు. అర్థరాత్రి వరకు “అసలు రింగ్ ను దాచడం ఏంటి?” అంటూ భరణి దాన్ని జీర్ణించుకోలేకపోయారు. చివరికి సంచాలక్ రీతూనే విన్నర్ అని ప్రకటించింది.

కట్టు నిలబెట్టు టాస్క్

Advertisement

“ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి మీ ముగ్గురికీ ఇస్తున్న టాస్క్ కట్టు నిలబెట్టు. ఈ యుద్ధంలో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా టవర్ ను కట్టి, బ్యాట్స్ సహాయంతో కూలకుండా చూసుకోవాలి. మిగతా కంటెస్టెంట్స్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాకూడదు అనుకున్న వాళ్ళ టవర్ ను బాల్స్ తో పడగొట్టడానికి ట్రై చేయొచ్చు” అన్నది టాస్క్. ఇందులో సంచాలక్ సంజన కాగా… భరణి, సుమన్ శెట్టి రీతూ వైపు, డెమోన్ కళ్యాణ్, ఇమ్మూ వైపు బాల్స్ విసిరారు. దీంతో తనూజా కళ్యాణ్ ను ఎవరు టార్గెట్ చేస్తే వాళ్లను తాను టార్గెట్ చేస్తానని చెప్పింది. అన్నట్టుగానే కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న డెమోన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడో అంటే రీతూని తనూజా టార్గెట్ చేసింది. రీతూ ఎంతగానో వేడుకుంది తనను టార్గెట్ చేయొద్దని, కానీ డెమోన్ ఏం చేస్తున్నాడో చూడు అంటూ చేస్తున్న పనిని ఆపలేదు. దీంతో రీతూని తనూజా, సుమన్, భరణి కలిసి టార్గెట్ చేశారు. ఫలితంగా రీతూ ఈ టాస్క్ ఓడిపోయింది. దీంతో నువ్వు ఒక్కడివే ఏం చేస్తావ్ అంటూ డెమోన్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది రీతూ. ఓడిపోయిన ఇద్దరికీ అంటే ఇమ్మూ – రీతూకి మళ్ళీ టాస్క్ పెట్టగా… డెమోన్ – తనూజ సపోర్ట్ తో రీతూ విన్ అయ్యింది.

“ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఈ చివరి యుద్ధంలో ఎవరైతే తమ సత్తా చాటుతారో వాళ్ళే ఈ గౌరవాన్ని పొందగలుగుతారు. మీకిస్తున్న చివరి టాస్క్ జయమ్మ నిశ్చయమ్మురా. ఇందులో టన్నెల్ లో ఉన్న బ్యాగ్స్ ను పక్కన పడేసి, పాక్కుంటూ వెళ్ళి, లివింగ్ ఏరియాకు వెళ్ళాలి. అక్కడ పోల్ ను బ్లాక్స్ మీద పెట్టి, బ్యాలెన్స్ చేస్తూ నడవాలి. యాక్టివిటీ ఏరియాకు వచ్చి బాల్స్ ను తీసుకుని రోల్ చేసి బాస్కెట్ లో పడేలా చేయాలి. ఈ టాస్క్ లో రీతూ, కళ్యాణ్ ఆడగా… తనూజా సంచాలక్. కళ్యాణ్ గెలిచి ఫస్ట్ ఫైనాలిస్ట్ గోల్డెన్ ఛాన్స్ ను పట్టేశాడు.

Advertisement

Read Also : ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి అవుట్… రీతూ వర్సెస్ భరణి… లాస్ట్ మినిట్లో తనూజ ట్విస్ట్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×