E-Paper
Advertisement

Bigg Boss 9 Finale: బిగ్‌ బాస్‌ 9 ఫినాలే చీఫ్‌ గెస్ట్‌ చిరంజీవి కాదట.. ఆ మాస్‌ హీరో, ఆయనెవరంటే!

Bigg Boss 9 Finale: బిగ్‌ బాస్‌ 9 ఫినాలే చీఫ్‌ గెస్ట్‌ చిరంజీవి కాదట.. ఆ మాస్‌ హీరో, ఆయనెవరంటే!
Advertisement

Bigg Boss 9 Telugu Grand Finale: ఫినాలేకు అంత రంగం సిద్దమౌవుతుంది. రేపు (ఆదివారం) బిగ్‌ బాస్‌ విజేత ఎవరో తేలనుంది. ఫినాలేకి సంబంధించిన ప్రిపరేషన్స్‌, షూటింగ్‌ పనులు చకచక జరగుతున్నాయి. ఈ రోజు శనివారం వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఇద్దరు ఎలిమినేట్‌ అయి హౌజ్‌ని వీడనున్నారు. అయితే ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరనే దానిపై ఎంతటి ఉత్కంఠ నెలకొందో.. ఫినాలేకు వచ్చే చీఫ్‌ గెస్ట్‌ ఎవరనేది కూడా అంతే ఆసక్తిని సంతరించుకుంది. కొన్ని రోజులు ఈ సీజన్‌ ఫినాలే వచ్చే చీఫ్‌ గెస్ట్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది.

వరుసగా చిరు సందడి

Advertisement

అయితే గత కొన్ని సీజన్లుగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ సీజన్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చీఫ్‌ గెస్ట్‌గా రావడమే కాదు.. కంటెస్టెంట్స్ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్స్‌ కూడా ఇస్తున్నారు.  బిగ్‌ బాస్‌ 4లో దివికి తన సినిమాలో ఆఫర్‌ ఇస్తా అని మాట ఇచ్చారు. అన్నట్టుగానే గాడ్‌ ఫాదర్‌లో సినిమాలో దివికి ఓ పాత్ర ఇచ్చారు. అలాగే బిగ్‌బాస్‌ 6లొ సోహైల్‌ సినిమాలో కామియే రోల్‌ చేస్తానని చెప్పి అతడిని అబ్బురపరిచాడు. అయితే ఇది ఇంక నేరవేరలేదు. సోహైల్‌కి చిరు కామియే డిమాండ్‌ చేసే స్టోరీ ఇంకా దొరకపోవడంతో.. అది పెండింగ్‌లో ఉంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కి కూడా చిరునే గెస్ట్‌ వస్తారని అంత అంచన వేస్తున్నారు.

చీఫ్ గెస్ట్ గా రవితేజ

ఈసారి ఫినాలో స్టేజ్‌పై చిరు ట్రోఫి ఇవ్వడంతో పాటు కంటెస్టెంట్స్‌కి ఎలాంటి ఆఫర్స్‌ ఇస్తాడని అని కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌9 ఫినాలే కోసం ఆడియన్స్‌ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో టాక్‌ ప్రకారం ఈ సీజన్‌కి చీఫ్‌ గెస్ట్‌గా చిరు రావడం లేదని టాక్. అయితే ఈసారి మరో స్టార్‌ హీరో బిగ్‌ బాస్‌ 9 ఫినాలే సందడి చేయబోతున్నారట. ఆయన మాస్‌ మాహారాజ రవితేజ. ఈ సారి రవితేజ ఈ సీజన్‌ ఫినాలేకు చీఫ్‌ గెస్ట్ వస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. తన మూవీ షూటింగ్స్ బిజీ కారణంగా చిరు ఈసారి రాలేకపోతున్నారట. దీంతో చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ టీం రవితేజని సంప్రదించారట. దీంతో ఆయన వస్తానని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రవితేజ భర్త మహశయులకు విజ్ఞప్తి చిత్రంతో బిజీగా ఉన్నారు.

Advertisement

Also Read: Bigg Boss 9 Elimination: ఈ వీకెండ్‌ ఇద్దరు అవుట్‌.. సంజనతో పాటు అతడు కూడా..!

భర్త మహశయులకు విజ్ఞప్తితో బిజీ

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన ఫినాలేకు వస్తే తన సినిమా ప్రమోషన్స్‌కి ప్లస్‌ అవుతుంది. కాబట్టి బిగ్‌ బాస్‌ 9 తెలుగు ఫినాలేకు ఆయన అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పటికే ఫినాలేపై ఆడియన్స్‌ ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక రవితేజ చీఫ్‌ గెస్ట్‌ అని తెలియడంతో వారి సెలబ్రేషన్స్‌ మరింత రెట్టింపు అయ్యాయి. ఆయన మాస్‌ ఎనర్జీ.. ఫీనాలుకు మరింత స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుందంటూ అభిమానులంత తెగ మురిసిపోతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్నిగంటలు వెయిట్‌ చేయాల్సిందే.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×