E-Paper
Advertisement

Guntur District: ఆటోడ్రైవర్ హత్య.. అతడి ప్రియురాలే చంపిందంటూ భార్య ఫిర్యాదు, అసలు ఏమైంది?

Guntur District: ఆటోడ్రైవర్ హత్య.. అతడి ప్రియురాలే చంపిందంటూ భార్య ఫిర్యాదు, అసలు ఏమైంది?
Advertisement

Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియురాలి నివాసానికి సమీపంలోని అరటి తోటలో ఆటో డ్రైవర్ వెంకటేశ్ దారుణ హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానికుల సమాచారం ప్రకారం.. వెంకటేశ్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శిరీష అనే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్‌ను ప్రియురాలి నివాసానికి  సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకువెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చారు. నిందితులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

Advertisement

వెంకటేశ్ మృతిపై అతడి భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. శిరీషే దగ్గరుండి ఈ హత్య చేయించిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు.

మృతుడి బంధువుల సమాచారం వెంటనే పోలీసులు ఘటనాస్థలికి  చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

ALSO READ: Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×