E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: భరణి అలా ఉండటం నచ్చలేదు, అసలు క్యారెక్టర్ బయట పెట్టిన నాగబాబు

Bigg Boss 9 Promo: భరణి అలా ఉండటం నచ్చలేదు, అసలు క్యారెక్టర్ బయట పెట్టిన నాగబాబు
Advertisement

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ సీజన్ 9.. 11 వారాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ ఉండబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

నా జీవితంలో బెస్ట్ మూమెంట్

ఆడియన్స్ ఇది ఫ్యామిలీ టైం అంటూ నాగార్జున ఇంట్లో చెప్పడంతో ప్రోమో స్టార్ట్ అయింది. భరణి తల్లి మరియు భరణి కోసం నాగబాబు కూడా వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకు మించిన అసలైన మూమెంట్ నాకు లేదు. నాకు ఇది చాలు సార్ అంటూ భరణి వాళ్ళని చూడగానే చాలా హ్యాపీ ఫీలయ్యాడు. నా జీవితంలో ఇది ఒక బెస్ట్ మూమెంట్ అంటూ భరణి చెప్పాడు. జీవితాంతం రుణపడి ఉంటాను సార్ అంటూ మాట్లాడాడు భరణి.

భరణి అలా ఉండటం నచ్చలేదు

Advertisement

నా తమ్ముడు నాగబాబు భరణికి గురూజీ ఎలా అయ్యాడు అంటూ నాగార్జున నాగబాబుని ప్రశ్నించారు. నాకు భరణి పరిచయమైన కొత్తల్లో ఇలా ఉండేవాడు కాదు. భరణి అప్పట్లోనే చాలా అగ్రెసివ్. చాలాసార్లు కూడా నేను తిట్టాను నువ్వు ఇలా ఉండకూడదు. కానీ హౌస్ కి వచ్చిన తర్వాత మరీ గంగిగోవుల అయిపోయాడు. నాకు భరణి ఇలా ఉండటం ఇప్పుడు కూడా నచ్చట్లేదు. ఓవర్ సాఫ్ట్ అయిపోయాడు హౌస్ లోకి వచ్చిన తర్వాత.

Also Read: Manchu Vishnu: 94 ఏళ్ల సినిమా చరిత్రలో మా నాన్న 50 ఏళ్లు, మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్

ఎమోషనల్ అయిన కళ్యాణ్ ఫాదర్

Advertisement

మరోవైపు కళ్యాణ్ పేరెంట్స్ కూడా వచ్చారు. హాస్టల్ కి రాలేదు అని నువ్వు బాధ పడ్డావు. ఇప్పుడు నీకోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు అంటూ నాగార్జున వాళ్ళ పేరెంట్స్ ను కళ్యాణ్ కు చూపించారు. కళ్యాణ్ తండ్రి కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎక్కడో మారుమూల ఉన్నవాడిని నా కొడుకు ఈ స్టేజికి తీసుకొస్తాడు అని ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

నాగబాబు షోలో కాసేపు సందడి చేశారు. హౌస్ లో ఎక్కువగా నవ్వేది రీతు. మాయాబజార్ సినిమాలో ఎస్వీ రంగారావుల నవ్వుతుంది అంటూ తన పైన కామెంట్ చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫన్ తో పాటు ఎమోషనల్ గా ఉండబోతుంది అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అయితే వస్తున్న సమాచారం ప్రకారం హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తుంది. దివ్య గత రాత్రి తనుజాతో విపరీతమైన గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో ఇద్దరిలో తప్పు ఎవరిది అంటూ హౌస్ మేట్స్ అందరిని కూడా నాగార్జున ప్రశ్నించారు. ఎక్కువ శాతం మంది తనుజ తప్పు అని మాట్లాడారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×