Bigg Boss 9 Telugu Promo: బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ సీజన్ 9 ఫైనల్ దశకు చేరుకుంది. రేపు ఆదివారమే బిగ్ బాస్ ఫైనల్ జరగనుంది.. టాప్ 5లో తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. ఈ ఐదుగురిలో విన్నర్ గా ఎవరి నిలుస్తారు అన్నది ప్రస్తుతం ఆడియన్స్ లో మెదులుతున్న ప్రశ్న.. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరొక్క రోజు వెయిట్ చేయాల్సిందే.. ప్రస్తుతం ఆడియన్స్ ఫైనల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరు వస్తారు అన్నది సస్పెన్స్.. ఇదిలా ఉండగా తాజాగా ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు.. ఆ ప్రోమో లో రాజా సాబ్ టీమ్ సందడి చేశారు. ఆ ప్రోమో నెట్టింట ట్రెండ్ అవుతుంది.
బిగ్ బాస్ షోను ఎక్కువ మంది వీక్షిస్తారు. దానివల్ల సినిమాల ప్రమోషన్స్ చేసుకునేందుకు ఇదొక బెస్ట్ ప్లాట్ ఫామ్.. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంబంధించిన టీమ్స్ హౌస్ లో సందడి చేశారు. తమ సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు.. తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ టీమ్ సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమోను చూస్తే.. పాపలకే పాప మా నిధి పాప అని ఓ వాయిస్ మొదటగా వినిపిస్తుంది. ఆ వాయిస్ రాగానే రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంట్రీ ఇస్తుంది… ఇమ్మూ పులిహోర కలుపుతుండగా నిధి మొదలు పెట్టావా ముందు మీ హౌస్ చూడాలి అని అంటుంది. హౌస్ లోకి వెళ్ళగానే అక్కడ కూర్చొని నేను రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నాను. హారర్ కామెడీ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాలో మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ నటిస్తున్నారని నిధి అంటుంది. ఆ తర్వాత మీరు హౌస్ లో విన్నర్ గా గెలిస్తే ఏం చేస్తారు అని అడుగుతారు. ముందుగా పవన్ నేను విన్నర్ గా నిలిస్తే సినిమాల్లోకి ఎంటర్ అవుతాను. అంతేకాదు నాకు రెండు గోల్స్ ఉన్నాయి అని అనగానే నిధి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి మీకు 2 గర్ల్స్ ఉన్నారా అని అడుగుతుంది.. ఆ తర్వాత ఇమ్ము సంజన పై సెటైర్లు వేస్తాడు. కాస్త సరదాగా నిధి హౌస్ మేట్స్ తో ముచ్చటిస్తుంది.
Also Read : ప్రభాస్ పరువు తీసిన ‘రాజా సాబ్’.. అక్కడ బుకింగ్స్ మరీ ఇంత తక్కువా..?
నిధి హౌస్ లో ఉండగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు.. హౌస్ మేట్స్ అందరు కూడా కళ్లకు గంతలు కట్టుకొని బీమ్ బ్యాగ్స్ పై కూర్చోవాలని చెప్తాడు. అది కూడా మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ చేసి ఆగిన తర్వాత కూర్చోవాలని చెప్తాడు. టాస్క్ లో హౌస్ లోని అందరూ కూడా పాల్గొంటారు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సంచాలక్ గా ఉంటుంది.. అందరూ కూడా తమ బీమ్స్ బ్యాగ్ పై కూర్చొని గెలుస్తారు.. కానీ ఇమ్మూ మాత్రం అవుట్ అవుతాడు. నిధి ఇమ్మానుయేల్ అవుట్ అని చెప్పగానే నేను నిధి పాప కోసమే అవుట్ అయ్యాను అని అంటాడు.. ఆ మాట వినగానే నిధితో సహా అందరూ నవ్వుకుంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఇవాళ ఎపిసోడ్ ఎంత సందడిగా సాగుతుందో చూడాలి…