E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ ఫైనల్ జర్నీ షురూ..ఆకట్టుకున్న తనూజ జర్నీ.. కన్నీళ్లు పెట్టించేసింది..

Bigg Boss 9 Telugu Promo: బిగ్ బాస్ ఫైనల్ జర్నీ షురూ..ఆకట్టుకున్న తనూజ జర్నీ.. కన్నీళ్లు పెట్టించేసింది..
Advertisement

Bigg Boss 9 Telugu Promo: బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో పూర్తి కావొస్తుంది.. ఈ నేపథ్యంలో టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీని ఇచ్చేలా టాస్క్ లను పెడుతున్నారు. 9వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే ఉంది. ఈ ఆదివారం ఫైనల్‌ జరగబోతుంది. దీంతో చివరి వారం ఆద్యంతం సరదా టాస్క్ లతో అలరిస్తున్నారు. బిగ్ బాస్‌ కూడా ఎంటర్‌టైన్‌లు చేసే టాస్క్ లు ఇస్తున్నారు.. బుధవారం ఎపిసోడ్ టాస్క్ లతో బాగానే ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇమ్మూ జాతకంతో బాగానే ప్రేక్షకులను అలరించాడు.. ఇక తాజాగా గురువారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేయ్యండి..

తనూజ జర్నీతో ఎమోషనల్…

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోని టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోను చూపిస్తున్నాడు.. నిన్న ఇమ్మానుయేల్ జర్నీ చూపించాడు.. ఇప్పుడేమో తనూజను హౌస్ లోకి రమ్మని పిలుస్తాడు. తెరమీద మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి.. బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం.. మీ నటనకు ఆస్కారం లేని చోటు. ఇలాంటి కఠిన ప్రదేశంలో ఎన్నో ఒడిదుడుగులు దాటుకొని టాప్ 5 లో ఒక్కరుగా నిలిచి మీరు ఎంతటి చిచ్చరపిడుగు అన్నది చూపించారు అని బిగ్ బాస్ అంటారు. చిన్నవాటికి మనసు నొచ్చుకొనే దూదిరంగం కథన రంగంలో విరుచుకుపడే శివంగిలాగా దూసుకుపోయే వీరత్వం.. మీ మనస్తత్వం మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నదే తనుజ పుట్ట స్వామి అని బిగ్ బాస్ అంటాడు.. హౌస్ లో తన జర్నీ ని చూసిన తనుజ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..

Advertisement

Also Read : దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్..40 కోట్ల నష్టం తప్పదా..?

ఈ సీజన్ విన్నర్ ఎవరు..? 

బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో.. ఈ షో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం హౌస్ లో 9వ సీజన్ జరుగుతుంది.. ఈ సీజన్ కూడా మరో రెండు రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా హౌస్ లోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లా జర్నీని బిగ్ బాస్ చూపిస్తున్నారు. హౌస్ లో తమ జర్నీకి సంబంధించిన ఫోటోలను చూసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ తనుజాకు సంబంధించిన జర్నీని బిగ్ బాస్ చూపిస్తాడు. అయితే ప్రస్తుతం హౌస్ లో టాప్ లో కొనసాగుతున్న ఫైవ్ మెంబర్స్ కంటెస్టెంట్లలో ముగ్గురు పేర్లు విన్నర్ కి దగ్గరగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు మరెవరో కాదు తనుజ, పవన్, కళ్యాణ్ పడాలా.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విన్నర్ ట్రోఫీని అందుకునే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలోనూ అటు పోల్స్ చెబుతున్నాయి.. మరి ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు? ఎవరు రన్నర్ గా నిలుస్తారు? 50 లక్షల ప్రైజ్ మనీ ఎవరి సొంతమవుతుందో తెలియాలంటే కేవలం రెండు రోజులు మాత్రమే వెయిట్ చేయాలి..

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×