E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : విన్నర్ ప్రైజ్ మనీ రివీల్… రీతూ కోసం లక్షలు కుమ్మరిస్తానన్న డెమోన్

Bigg Boss 9 Telugu Promo : విన్నర్ ప్రైజ్ మనీ రివీల్… రీతూ కోసం లక్షలు కుమ్మరిస్తానన్న డెమోన్
Advertisement

Bigg Boss 9 Telugu Promo : బిగ్ బాస్ సీజన్ 9కి మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డు పడబోతోంది. నిన్న హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో, ప్రస్తుతం హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే డే 98 నుంచి వరుసగా 3 ప్రోమోలు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలలో మొత్తం ఫన్ క్రియేట్ చేసి, ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

విన్నర్ ప్రైజ్ మనీ రివీల్

మొదటి ప్రోమోలో నాగార్జున విన్నర్ ప్రైజ్ మనీని రివీల్ చేశారు. విన్నర్ కు 50 లక్షలు ప్రైజ్ మనీ వస్తుందంటూ ఆ మనీని టాప్ 6 కంటెస్టెంట్స్ కు చూపించారు. అలాగే ఈ ప్రైజ్ మనీని గెలిస్తే… ఎవరికి ఎంత ఇచ్చి పంపిస్తారు అని హౌస్ మేట్స్ ను అడిగారు నాగార్జున. డెమోన్, ఇమ్మూ పేర్లు చెప్పిన భరణి… ఇమ్మూకైతే 20 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడు. ఇక ఇమ్మూ భరణిని పంపిస్తానని చెప్పాడు. వెంటనే నాగార్జున ‘అప్పుడేమో పవర్ అస్త్రాతో బయటకు పంపావు. ఇప్పుడు మళ్ళీనా ?’ అంటూ ఇమ్మూను ఇరికించె ప్రయత్నం చేశారు. ‘వాళ్ళు అదే నిజం అనుకుంటారు సార్’ అంటూ ఇమ్మూ నాగార్జునను వేడుకున్నాడు. ఇక డెమోన్ ప్రైజ్ మనీలో రీతూకి ఎంత పెట్టి గిఫ్ట్ కొనిస్తావు ? అని అడిగారు నాగ్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 5 లక్షలు పెట్టి రీతూకి గిఫ్ట్ కొనిస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు. అతను చెప్పిన సంఖ్య చూసి హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తర్వాత తమన్ తో పాటు హౌస్ లోకి ఓ కొత్త హీరోని తీసుకొచ్చి పరిచయం చేశారు నాగార్జున.

గ్రీకు వీరుడి అన్ టోల్డ్ లవ్ స్టోరీ 

Advertisement

ఆయన వస్తూనే ఏమీ మాట్లాడకుండా సైగలు చేశారు. నాగ్ కు అర్థం కాకపోవడంతో ‘సారీ సార్… డైరెక్టర్ ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకపోవడంతో అలవాటులో పొరపాటు’ అంటూ అసలు విషయం చెప్పాడు. అంతేకాదు ‘మీరు బయటకు చెప్పలేని అన్ టోల్డ్ లవ్ స్టోరీ ఏదన్నా ఉందా సార్ ?’ అని నాగార్జునను అడిగాడు. ఆయన ఇప్పుడు ఎందుకులే అని తల గోక్కొవడంతో… తమన్ కల్పించుకుని ‘గ్రీకు వీరుడితో మాట్లాడుతున్నావ్’ అని పంచ్ వేశాడు.

రెండవ ప్రోమోలో హౌస్ లో మోస్ట్ పాపులర్ కాంట్రవర్సీని రీక్రియేట్ చేయమన్నారు. రీతూ – డెమోన్ గొడవను సంజన – భరణి రీక్రియేట్ చేశారు. అలాగే కళ్యాణ్ – తనూజా టచ్ గొడవను, ట్రయాంగిల్ రచ్చను, సుమన్ నామినేషన్ గొడవను కూడా రీక్రియేట్ చేసి నవ్వులు పూయించారు.

Advertisement

మూడవ ప్రోమోలో మీ కంప్లైంట్, రేజ్ అన్నీ చెప్పమన్నారు. ఇమ్మూపై కంప్లైంట్ మోత మోగించి గిఫ్టులు కొట్టేసింది తనూజ. అలాగే తనుజపై డెమోన్, సంజనాపై ఇమ్మూ కంప్లైంట్స్ చేశారు.

Read Also : సుమన్ శెట్టి ఎలిమినేషన్… బిగ్ బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×