E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇక భరించలేను… బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతానంటూ నాగ్ ను వేడుకున్న సంజన

Bigg Boss 9 Telugu : ఇక భరించలేను… బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతానంటూ నాగ్ ను వేడుకున్న సంజన

Bigg Boss 9 Telugu : గత వారం నామినేషన్ల హీట్లో బిగ్ బాస్ హౌస్ భగ్గుమన్న విషయం తెలిసిందే. ఎన్నో గొడవలు జరిగినప్పటికీ హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టిన గొడవ సంజన – రీతూ మధ్య జరిగిందే. డెమోన్ – రీతూ క్యారెక్టర్లను కించపరుస్తూ సంజన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అందుకే ఈ వివాదంపై నాగార్జున ఎలా స్పందిస్తారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే సంజన మాత్రం తన వితండవాదనతో సారీ చెప్పకుండా నాగార్జుననే ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో నాగార్జున కూడా సీరియస్ కావలసి వచ్చింది.

నువ్వు చేస్తే మజాక్ వాళ్ళు చేస్తే రజాకా ?

నాగార్జున వస్తూనే ఈ వారం హౌస్ మేట్స్ అందరినీ డిస్టర్బ్ చేసిన ఇష్యూ ఏంటని అడిగారు. సంజనకు క్లోజ్ గా ఉండే ఇమ్మూనే మమ్మా చేసిన రచ్చ గురించి చెప్పాడు. కానీ సంజన మాత్రం తాను చేసిన తప్పును చివరిదాకా ఒప్పుకొనేలేదు. “ఇక్కడ 100 కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు హత్తుకుని కూర్చోవడం నాకు ఇబ్బందిగా అన్పించింది. ఇదే చెప్పాను నేను. అందులో ఒక బీప్ వర్డ్ వాడానా? నాకు ఏం అన్పించిందో అది చెప్పడం కూడా తప్పేనా? ముందుగానే వాళ్ళకు చెబుదాం అనుకున్నా. కానీ నాకు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం లేదు. నాకు ఇబ్బంది అన్పించి నెనే దుప్పటి కప్పుకున్నా. వాళ్ళను తప్పు పట్టట్లేదు. నాకు ఇబ్బందిగా అన్పించింది అని చెప్పాను. అది తప్పు అయినా ఇప్పటికీ అదే మాట మీద నిలబడతా” అంటూ తనను తాను సమర్థించుకుంది సంజన.

అయితే నాగార్జున మాత్రం ఈ గొడవ కోసం సంజన ముందుగానే ఎలా ప్లాన్ చేసిందో మొత్తం వీడియోల ద్వారా బట్టబయలు చేశారు. “డెమోన్ తో నామినేషన్లలో నువ్వు మధ్యలో రాకు అని ముందుగానే ఎందుకు చెప్పావ్? తనుజా దగ్గర వాళ్ళిద్దరి రిలేషన్ గురించి ఎందుకు డిస్కస్ చేశావ్? ఫ్యామిలీ వీక్ తరువాత గట్టిగా ఆడుదాం అనుకుని రూత్ లెస్ గా ఆడావు. ఇది ఖచ్చితంగా రీతూ – డెమోన్ క్యారెక్టర్ ను కించపరచడమే. వాళ్ళిద్దరినీ చూసి నువ్వు కళ్ళు మూసుకున్నావా ? మరి నిన్ను – ఇమ్మూని చూసి ఆడియన్స్ అలాగే కళ్ళు మూసుకున్నారా ? 19 ఏళ్లు కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు కదా. చిన్న షోలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉండకూడదా ? నువ్వు బయట ఏదో తప్పు చేశావ్ కాబట్టి నీపక్కన ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని వాళ్ళంటే నీకు ఎలా ఉంటుంది? నీకంత ఇబ్బందిగా ఉంటే వెళ్లిపో” అంటూ గేట్స్ ఓపెన్ చేయించారు నాగార్జున.

ఊహించని షాకిచ్చిన సంజన 

ఆమె వెళ్లిపోవాలా వద్దా అన్న నిర్ణయాన్ని రీతూ చేతిలో పెట్టారు నాగ్. కానీ అంతలోగానే సంజన సారీ చెప్పకుండా తాను వెళ్లిపోతానని పట్టుబట్టింది. గత 10 వారాల వరకు మేము త్యాగం చేస్తేనే నువ్వు ఏ హౌస్ లో ఉన్నావు అనే మాటలు విన్నాను. వాళ్ళు 100 సార్లు ఆ మాట అంటే నేను 1000 సార్లు చచ్చిపోయాను. ఇంకా నావల్ల కాదు సార్ నేను వెళ్లిపోతా. పంపించండి” అని వేడుకుంది సంజన. కానీ ‘ప్రతీ 5 నిమిషాలకు నీ మూడ్ మారితే నడవదు ఇక్కడ. నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావో, అంతకంట పెద్ద బ్లాక్ మార్క్ తో వెళ్తావు” అంటూ హెచ్చరించారు. చివరికి సంజన సారీ చెప్పడంతో అంతా సద్దుమనిగింది.

Read Also : తనూజా నువ్వెవరు ? సంజనాకు గేట్స్ ఓపెన్…టాప్ కంటెస్టెంట్లను ఉతికి ఆరేసిన నాగార్జున

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×