Bigg Boss 9 Telugu Day 83 :ఈ వారం మొత్తం జరిగిన గొడవలు, వాటి గురించి డిస్కస్ చేయడానికి నాగార్జున ఫుల్ ఫైర్ తో వేదికపైకి వచ్చారు. ముందుగా శుక్రవారం జరిగిన రచ్చను చూపించారు. సర్ఫ్ ఎక్సెల్ మాటికి ఎక్స్ప్రెస్ రేస్ అగైనెస్ట్ టైం అండ్ స్టెయిన్స్ అనే టాస్క్ ను రెండు టీంలుగా ఆడారు. పింక్ టీంలో తనూజా, బ్లూ టీం భరణి ఉన్నారు. సంచాలక్ దివ్య. టాస్క్ ఆడుతున్న క్రమంలోనే తనూజా సహనం కోల్పోయింది. “ఈసారి సీజన్ మొత్తం ఒక్కరికే సంచాలక్ ఇచ్చేయండి బిగ్ బాస్” అంటూ ఫైర్ అయ్యింది. దీంతో “రూల్స్ అన్నీ నీకు ఒక్కదానికే తెలిసినట్టు మాట్లాడకు” అని భరణి అన్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. “నాకు నువ్వు మాత్రమే కనిపిస్తావు అన్నట్టుగా మాట్లాడుతున్నావ్. బిగ్ బాస్ సంచాలక్ కావాలని వేరే వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ టైమ్ వాళ్ళకి ఇవ్వండి” అని దివ్య కూల్ గానే సమాధానం ఇచ్చింది.
“ఫ్యామిలీ వీక్ తరువాత అందరూ హ్యాపీగా ఉంటారనుకున్నా. కానీ మీ తీరుతో నేను హ్యాపీగా లేను. హౌస్ అంతా డిస్ట్రబ్ అయిన గొడవ ఏంటి?” అని సంజన గొడవను తెరపైకి తీసుకొచ్చారు. వెంటనే ఇమ్మూ.. సంజన – రీతుల గొడవ అని చెప్పాడు. అలాగే సుమన్ ఒక అమ్మాయిని అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. ఈవిడ ఇలా ఎలా మాట్లాడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. షాక్ అయ్యాను అని చెప్పాడు డెమోన్. “నాకు వాళ్ళు పక్కపక్కన కూర్చోవడం నాకు నచ్చలేదు, అన్ కంఫర్ట్ గా ఉందని చెప్పడంలో తప్పేముంది సార్?” అని తిరిగి నాగార్జునే అడిగింది సంజన. హౌస్ లో అందరినీ వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? అని ప్రశ్నించారు. ఒక్కరు కూడా వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు. “ముందే ఎందుకు చెప్పలేదు అంటే అంత ఇంటర్ ఫియర్ అవ్వడం ఇష్టం లేదు” అని చెప్పింది సంజన. “అలాంటప్పుడు ముందే తనుజా దగ్గర నువ్వు పెట్టిన డిస్కషన్ ఏంటి? పర్సనల్ ఈక్వేషన్ కోసం డిస్కషన్ పెట్టావు. వాళ్లందరికీ అన్పించలేదు. నీకు ఎందుకు అనిపించింది. నామినేషన్ లో తీసుకొచ్చి పర్సనల్ ఎటాక్ చేశావ్. అక్కడ రిలేషన్ ను డిఫైన్ చేశావు. ఇక్కడ రిలేషన్ ను మిస్ అండర్స్టాండ్ చేసుకున్నావ్. పవన్, రీతూలపై క్లియర్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేశావ్. నీకు కంఫర్ట్ గా లేకపోతే గేట్స్ ఓపెన్ చేస్తా వెళ్ళిపో. బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ది గేట్” అని సీరియస్ అయ్యారు నాగార్జున. వెంటనే గేట్లు ఓపెన్ కాగా… సంజన కుళాయి తిప్పేసింది. తన తప్పును ఒప్పుకుని సారీ చెప్పింది.
కెప్టెన్ కళ్యాణ్ అగ్రెషన్ గురించి, నువ్వు వాడిన బీప్ పదాల గురించి మనం మాట్లాడుకుందామా? అని అడిగారు నాగ్. కళ్యాణ్ సైలెంట్ అవ్వడంతో ఏమైందని ప్రశ్నించారు. ఆ అగ్రెషన్ లో ఏం జరిగిందో గుర్తు లేదని చెప్పాడు. యాంగర్ డేంజర్ అని చెప్పి కళ్యాణ్ విషయాన్ని పక్కన పెట్టేశాడు. డెమోన్ – ఇమ్మూ నామినేషన్ లో నీకేం పని? తన పాయింట్ చెప్పలేడా? నువ్వు అతనికి లాయర్ వా? అంటూ రీతూపై సిరియస్ అయ్యాడు నాగ్. అసలు అక్కడ ఏం జరిగిందనేది కళ్యాణ్ వివరిస్తుంటే… డెమోన్ మధ్యలో ఏదో చెప్పబోయాడు. అంతలోనే కళ్యాణ్ తో మాట్లాడుతుంటే మధ్యలో నీ ఇంటర్ఫియర్స్ ఏంటి డెమోన్? సంజన విషయంలో ఏమైంది ఇది? సర్లే నువ్వు మాట్లాడలేవులే. బదులుగా నీ లాయర్ మాట్లాడుతుంది అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు నాగ్. ఈ గొడవలో డెమోన్ దే తప్పు అని వీడియో చూపించి మరీ చెప్పారు నాగ్. అలాగే బిగ్ బాస్ కు చెప్పడానికి నువ్వెవరు తనూజా? అది ఆయన డెసిషన్ కదా… భరణి – దివ్య – తనూజ మీ గొడవతో మాకు చిరాకు వస్తోంది. ఇంకా 3 వారాలు ఉన్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. లేదంటే మీ ఆటకి మా ఆడియన్స్ ఫుల్ స్టాప్ పెడతారు” అని ఇచ్చిపడేశారు.
చివరగా ఈ రణరంగంలో వారియర్స్ ఉంటారు. మీకు ఇందులో వారియర్ ఎవరు? బ్యాక్ స్టాబర్ ఎవరు? అని చెప్పమన్నారు. సుమన్ సంజనకు బ్యాక్ స్తాబర్, డెమోన్ కు స్ట్రాంగ్… కళ్యాణ్ డెమోన్ బ్యాక్ స్టాబర్, ఇమ్మూ ఎనిమీ… భరణి వారియర్ డెమోన్, బ్యాక్ స్టాబర్ సంజన అని… డెమోన్ వాడు గేమ్ లో కెప్టెన్ కావాలని నన్ను ఎరగా వాడుకోవాలి అన్నాడు అని కళ్యాణ్ కు బ్యాక్ స్టాబర్, ఇమ్మూకి ఎనిమీ ఇచ్చాడు. ఇమ్మూ కళ్యాణ్, డెమోన్ ఇద్దరూ నాకు టఫ్ కాంపిటీషన్ అని చెప్పాడు. తనూజా రీజన్ లేకుండా నామినేట్ చేస్తాడని ఇమ్ముకి బ్యాక్ స్టాబర్, అలాగే టఫ్ డెమోన్ కి ఇచ్చింది. రీతూ కళ్యాణ్ టఫ్, ఇమ్ము కంటెండర్లో నన్ను తీసేద్దాం అని ఉన్నా తరువాత కవర్ చేశాడు అని చెప్పింది. దీంతో ఇమ్ము – రీతూ మధ్య రచ్చ మొదలైంది.
Read Also : కళ్యాణ్ తో తనూజా అంతమాట అనేసిందేంటి ? ఎక్కడో తేడా కొడుతోంది మావా