E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 77 : అమ్మను చూడగానే తనూజ ఎమోషనల్… అటు తిరిగి ఇటు తిరిగి భరణికే ఫిట్టింగు… ఇమ్మూ చేతిలో ఎలిమినేషన్ పవర్

Bigg Boss 9 Telugu Day 77 : అమ్మను చూడగానే తనూజ ఎమోషనల్… అటు తిరిగి ఇటు తిరిగి భరణికే ఫిట్టింగు… ఇమ్మూ చేతిలో ఎలిమినేషన్ పవర్

Bigg Boss 9 Telugu Day 77 : బిగ్ బాస్ వేదికపై సీజన్ 9 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ లు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కళ్యాణ్, భరణి, దివ్య, ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీలు రాగా, తాజా ఎపిసోడ్ లో నాగ్ మాస్ ఎంట్రీ తరువాత మిగిలిన కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారు.

సుమన్ కు ఇంట్లో దబిడి దిబిడే 

ఇంట్లో ఎవ్వరికి తెలియని టాప్ సీక్రెట్ ను చెబితేనే ఫ్యామిలీలను పంపుతానని నాగార్జున మెలిక పెట్టారు. సుమన్ శెట్టి ఇంట్లో షూటింగ్ అని చెప్పి ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తాను అంటూ ఓపెన్ అయ్యాడు. అక్కడ ఏం చేస్తారు అని ఆయన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు నాగ్. తరువాత సుమన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆయన వారసులు కొడుకు, కూతురు స్టేజ్ మీదకు వచ్చారు. వాళ్ళతో పాటు స్టార్ కమెడియన్ శ్రీనివాస రెడ్డి కూడా వచ్చారు. “గేమ్ బాగా ఆడుతున్నావు. కప్పు పట్టుకుని రావాలి. ఎవ్వరిని నమ్మొద్దు” అని కోరింది ఆయన కూతురు. టాప్ 5లో సుమన్ శెట్టిని, ఇమ్మూ, తనూజ, భరణి, కళ్యాణ్ అని చెప్పారు. అలాగే పద్మనాభాసింహ అనే క్యారెక్టర్ ను సుమన్ శెట్టికి, అపరిచితుడు క్యారెక్టర్ ను తనుజాకు ఇచ్చాడు. ఇమ్మూ కన్ఫ్యూజ్ అవుతున్నాడని, డెమోన్ తన కోసం గేమ్ ఆడాలని, భరణిని చెరుకు రసం బండిలో చెరుకులా పిండేస్తున్నారని, తనుజా- దివ్యలలో ఛాయాదేవి, సూర్యకాంతం అని చెప్పారు.

తరువాత సంజన ఫ్యామిలీ నుంచి ఆమె తల్లి అనిత, మేనల్లుడు జమీన్ వచ్చారు. బాండింగ్ బాగానే ఉంది. కానీ అదే నిన్ను కిందకు లాగుతోంది అని ఆమెను హెచ్చరించారు. సంజన, ఇమ్మాన్యూయేల్, కళ్యాణ్, తనుజా, సుమన్ లకు టాప్ 5 ఇచ్చారు. అనంతరం రీతూ కోసం ఆమె బ్రదర్, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ వచ్చాడు. గేమ్ బాగా ఆడుతున్నావ్ అని రీతూని ఎంకరేజ్ కూడా చేశారు. అయితే డెమోన్ నామినేషన్లలో రీతూని నామినేట్ చేయకపోతే బాగుండేద. నామినేషన్ అయ్యాక 2 నిమిషాలు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడావు. అదే ముందు మాట్లాడితే బెటర్ ఉండేది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టాప్ 5లో రీతూ, తనూజ, కళ్యాణ్, ఇమ్మూ, డెమోన్ కు ఇచ్చారు.

తనూజాకు బిగ్ సర్ప్రైజ్ 

తనూజా కోసం ఆమె మొట్టమొదటి సీరియల్ ‘ముద్దమందారం’ నటీనటులు పవన్ సాయి, హరిత స్టేజ్ మీదకు విచ్చేశారు. హరితను చూడగానే తనూజ వెక్కి వెక్కి ఏడ్చింది. “కప్పు తీసుకుని రావాలి. నీ కోసం నాన్న వెయిట్ చేస్తున్నారు అంటూ హరిత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక పవన్ సాయి నాన్నా జాగ్రత్తగా చూసుకోండి అంటూ భరణికి ఆమె బాధ్యతను అప్పగించారు. అంతేకాదు అతను ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్ ను తీయగా దాన్ని భరణికే ఇచ్చాడు. నాగార్జున ఈ మూవీ డైలాగ్ గుర్తింది కదా ? అని అడిగారు. వెంటనే పవన్ సాయి ‘అది నా పిల్ల’ అనే డైలాగ్ ను చెప్పాడు. అంతేకాదు తనూజ కోసం విజిల్ వేయడం నేర్చుకుంటున్నా అని చెప్పాడు. ఇక తనుజాను ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ముద్ద మందారం చెవిలో పెడుతుంది అని చాలా కామెంట్స్ చేశారు. నీ చుట్టూ తిరుగుతూ నీకే ముద్దుగా మందారం పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పువ్వులన్నింటినీ మాలలాగా కట్టి, వికసించేలా చేయాలి నువ్వు” అని హింట్స్ ఇచ్చారు.

డెమోన్ ఫ్యామిలీ ఎమోషన్ 

అలాగే డెమోన్ తండ్రి స్టేజ్ మీదకు వచ్చి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ముందుగా నాగ్ ను హగ్ చేసుకుని, తరువాత తన కొడుకుకు బాగా ఆడాలని చెప్పారు. ఏడవొద్దు. నీకు బాధ కలిగించే విషయాలకు దూరంగా ఉండు. అది ఎవరైనా సరే” అంటూ హింట్ ఇచ్చారు. అలాగే ఆయన శివగామి క్యారెక్టర్ ను సంజనకు ఇచ్చారు. అయితే వెళ్తూ డెమోన్ ఫ్రెండ్ “సంజన మీరు బాహుబలిని పక్కన పెట్టి, మీ కొడుకు ఇమ్మూ భల్లాల దేవకి సపోర్ట్ చేస్తున్నారు” అని చెప్పారు. అలాగే టాప్ 5లో డెమోన్, ఇమ్మూ, సంజన, తనూజ, రీతూకి ఇచ్చారు. రేలంగి మామయ్య క్యారెక్టర్ ను డెమోన్ కే ఇచ్చారు.

చివరగా ఎలిమినేషన్ రౌండ్ ను ఇమ్మూకే అప్పగించారు నాగార్జున. నామినేషన్లలో సంజన, దివ్య మిగలగా… పవర్ అస్త్రాను వాడి, ఈవారం నామినేషన్ ప్రక్రియను రద్దు చేయొచ్చు అని చెప్పారు. ఇక ఇప్పుడు వాడకపోతే తరువాత యూజ్ ఉండదు అంటూ ఎలిమినేషన్ ను క్యాన్సిల్ చేశాడు ఇమ్మూ. లాస్ట్ లో దివ్యకు తక్కువ ఓటింగ్ వచ్చింది, ఇమ్మూ పవర్ అస్త్రా వాడకపోతే ఆమె ఎలిమినేట్ అయ్యి ఉండేదని తేల్చారు.

Read Also : తనూజా మంచి మనవరాలు… భరణి తల్లి దెబ్బకు కన్నీళ్ళు పెట్టుకున్న దివ్య

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×