Bigg Boss 9 Telugu Day 102 : బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏవీల సందడి నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మూ ఏవీతో టాప్ 5పై బిగ్ బాస్ స్టార్ట్ చేసిన ప్రశంసల వర్షం నేడు డెమోన్, తనూజా ఏవీలతో కొనసాగింది.
రెండు వైపులా పదునున్న కత్తి
గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఈ సీజన్లో తన మెమొరీస్ అన్నీ చూసి మురిసిపోయింది తనూజ. ఇంతలో “తనూజ తెర మీద మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. అదే మిమ్మల్ని ఆడియన్స్ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ గా, కూతురిగా చూసుకునేలా చేసింది. బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో ఒకరిగా నిలిచి, మీరెంత చిచ్చర పిడుగో ప్రూవ్ చేశారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కదన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మీరు చేసే అల్లరి, భయపడని తత్వం… మీలోని ఆకర్షణ శక్తికి ప్రేక్షకులే కాదు ఎవ్వరూ అతీతులు కారని స్పష్టం చేశాయి. ఈ హౌస్ లో ప్రతీ ఒక్క విషయం మీ చుట్టే తిరిగిందంటే మామూలు విషయం కాదు. ఈ ఇంట్లో మీతో కలిసిపోయిన వారు, లేదంత కలబడ్డ వారే ఉన్నారు.
మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటను మీ రూల్స్ తో ఆడించడంలో మీరు నేర్పరి. వంటగది నుంచే మీరు ఇంటిని గెలిచిన తీరు అద్భుతం. మీరు సపోర్ట్ కోసం పాకులాడతారని, బంధాల పునాదులపై ఆటలాడతారని చాలామంది నిందించినప్పుడు నొచ్చుకున్నారు. నాన్న అనే ఎమోషన్ నిజంగానే ఉన్నా కూడా మనసుని రాయి చేసుకుని బంధాలను పక్కన పెట్టి ఆడారు. కత్తికి రెండు వైపులా పదునైన మీ వ్యక్తిత్వం… దూది లాంటి సునితత్వం, కదనరంగంలో విరుచుకుపడే శివంగి ధీరత్వం… ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానం… తనూజా పుట్టస్వామిని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది” అంటూ తనూజా ఏవీని వేశారు. “ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇంతగా ప్రేమించి, ఈరోజు నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన ప్రతి ఒక్క నా అభిమానికి థాంక్ యూ సో మచ్” అంటూ ఎమోషనల్ అయ్యింది తనూజా.
డెమోన్ అంటే వెన్నులో వణుకు
“డెమోన్ పవన్ కామనర్ లాగా అడుగు పెట్టిన మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో కాంకరర్ గా మారిన్ తీరు మీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డెమోన్ చేసే విధ్వంసం ఏంటో వారు దగ్గరుండి చూశారు. మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం. ఎవరితో పోరాడితే వారి ఆట ఖతం. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తపించే మీరు యోధుడు.
హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ ఉంటే ఫిట్ గా ఉన్నట్టు అని నమ్మే మీ మాటను మనసు వినలేదు. మీకోసం తపించే మరొకరి కోసం తపించింది. మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయట పడడానికి ఆ బంధం తోడ్పడింది. టాస్క్ లలో అయినా, నా అనుకున్న మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అన్న మీ మాటే ఈ ప్రయాణాన్ని అమాంతం మోకాళ్ళ మీదికి తీసుకొచ్చింది. ఆమె ఎలిమినేట్ అయినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాకు తెలుసు. కానీ తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మిమ్మల్ని కర్తవ్యం వైపు అడుగులు వేయించింది. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. మీరు మీ చెమటోడ్చి, చివరి వరకూ పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్ గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా… ఇప్పుడు టాప్ 5లో నిలబడ్డావు” అంటూ హైలెట్ ఎలివేషన్ ఇచ్చారు. ఆ తరువాత ఏవీని ప్లే చేశారు.
Read Also : తనూజాకు కాబోయే వాడు కళ్లముందే… బాబోయ్ ఇంత ఓపెన్ గా చెప్పేశాడేంటి ఇమ్మూ భయ్యా?