E-Paper
Advertisement

Bigg Boss 9: మరీ ఇంత దారుణమా.. టీఆర్పీ రేటింగ్లో వంటలక్కను కూడా దాటేయలేని పరిస్థితా?

Bigg Boss 9: మరీ ఇంత దారుణమా.. టీఆర్పీ రేటింగ్లో వంటలక్కను కూడా దాటేయలేని పరిస్థితా?
Advertisement

Bigg Boss 9:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది తమ పాపులారిటీని పెంచుకున్నారు. మరి కొంతమంది నెగెటివిటీని కూడా మూటగట్టుకున్నారు. ఇకపోతే నెగటివ్ ఇమేజ్ దక్కించుకున్న వారికంటే ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ షో ఒక్కో భాషలో ఒక్కో సీజన్ జరుపుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.. తెలుగులో 8 సీజన్లు పూర్తికాగా.. ప్రస్తుతం 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది. అయితే ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ మాత్రం అత్యంత దారుణంగా పడిపోయింది అనడంలో సందేహం లేదు. ఎంతలా అంటే ఆఖరికి వంటలక్క సీరియల్ టీఆర్పీ రేటింగ్ కూడా దాటలేకపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దారుణంగా పడిపోయిన టీఆర్పీ రేటింగ్..

తాజాగా వచ్చిన టీఆర్పీ రేటింగ్ ను బట్టి చూస్తే అర్బన్ , రూరల్ మొత్తం కలిపి కేవలం 5.03 రేటింగ్ మాత్రమే ఈ షో దక్కించుకోవడం గమనార్హం.. దీన్నిబట్టి చూస్తే ఇది టీవీ సీరియల్ కంటే అత్యంత తక్కువ అని చెప్పాలి. ఇక వంటలక్క కార్తీక దీపం 2 సీరియల్ ఏకంగా 14.36 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకొని నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.. ఇటు స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంటే.. రియాల్టీ షో అయిన బిగ్ బాస్ మాత్రం చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్ దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఈ సీజన్ కి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు అనే వార్త స్పష్టం అవుతోంది.

Advertisement

also read:SSMB 29: జక్కన్న కమర్షియల్ బ్రెయిన్.. ఈవెంట్ రైట్స్ ను హాట్ స్టార్ ఎన్ని కోట్లకు దక్కించుకుందంటే ?

బిగ్ బాస్ ముద్దుబిడ్డ వల్లేనా..

ఇకపోతే ఈసారి ఈ సీజన్ కి టీఆర్పి రేటింగ్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం పార్షియాలిటీ చూపిస్తున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ మా చానల్లో ప్రసారమైన సీరియల్స్ లో ముద్దమందారంలో నటించిన తనూజ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. పైగా ఈమె ఎన్ని తప్పులు చేసినా బిగ్ బాస్ ఏమీ అనకపోవడం.. అటు హోస్ట్ నాగార్జున కూడా ఈమెకు ఫేవర్ గా మాట్లాడడం.. అంతేకాకుండా ప్రతి వీకెండ్ లో కూడా స్పెషల్ గా కన్ఫేషన్ రూమ్ కి పిలిపించి ఈమెకు మాత్రమే సలహాలు ఇవ్వడం ఇవన్నీ చూసి ఇటు చూసే ఆడియన్స్ లో మాత్రమే కాకుండా అటు కంటెస్టెంట్స్ మధ్య కూడా వ్యతిరేకత నెలకొంటుంది. టాస్కులు కూడా పెద్దగా లేకపోవడం.. చూసే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడం లేదు. ఇక ఈ కారణాలే ఈ సీజన్ రేటింగ్ తగ్గిపోతుంది అనడానికి ప్రధాన కారణం అని బిగ్ బాస్ లవర్స్ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×