BigTV English

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss Telugu 9 Today Episode: నిన్నటి నామినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ కెప్టెన్ డిమోన్ పవన్ శ్రీజ దమ్ము కోసం వాడాడు. నామినేషన్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేయాలని చెప్పగా శ్రీజను సేవ్ చేశాడు. అలా అనగానే డిమోన్ తననే సేవ్ చేస్తాడని ఆశపడింది రీతూ చౌదరి. అతడు శ్రీజ పేరు చెప్పడంతో హర్ట్ అయ్యింది. ఆ వెంటనే నెత్తిపై ఉన్న కుండ తెరిచింది. నా హర్ట్ బ్రేక్ చేశావ్ అంటూ డిమోన్ కన్నీరు పెట్టుకుంది. డిమోన్ నామినేషన్ లో ఉన్న నువ్వు సేవ్ అవుతావన్న ధైర్యంతో చేశాను అని అంటాడు.


రీతూ సీక్రెట్స్ డ్రామా..

ఇక ఆ తర్వాత హౌజ్ లో ఇమ్మాన్యుయేల్ కామెడీతో అందరిని సరదాగా నవ్వించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ రీతూ చౌదరిని కన్ఫేషన్ రూంకి రమ్మని పిలిచాడు. అక్కడ వచ్చాక తన ముందు ఉన్న క్లాత్ ని తీయమని చెప్పాడు. అక్కడ ఫ్రై చికెన్ పెట్టి ఆమెను ఊరించాడు. హౌజ్ లోన కంటెస్టెంట్స్ కి సంబంధించి ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పి ఆ చికెన్ తినే అవకాశం పొందాలని చెప్పాడు. దీంతో రీతూ తనూజకు బయటకు ఓ వ్యక్తి అంటే క్రష్. కానీ, హౌజ్ లో పవన్ అంటే కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ చెప్పగా.. బిగ్ బాస్ దీనికి సాటిస్ఫై కాలేదు. అలా ఇమ్మాన్యుయేల్, డిమోన్ లకు సంబంధించిన విషయాలు చెప్పినప్పటికీ బిగ్ బాస్ అది సీక్రెటా వెటకరించారు. సరే నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి.. అందరి సీక్రెట్ తెలుసుకుని వచ్చి చెబుతా అంటూ బిగ్ బాస్ డీల్ చేసుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి అందరి సీక్రెట్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది.

బిగ్ బాస్ రణరంగం మొదలు

కాసేపటికి శ్రీజ దమ్ము డిమోన్, పవన్ లను హెచ్చరించింది. రీతూ చౌదరితో జాగ్రత్త.. తను ఏం మాట్లాడిన మీరు పడిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి.రీతూ వలలో పడకండి అంటూ హెచ్చరిస్తుంది. కంటెసెంట్స్ అందరిని బిగ్ బాస్ గార్డెన్ ఎరియాకి రమ్మన్నారు. ఈ రెండు వారాలుగా నేను నా ఇంట్లో మీ ఆటలు, మీ నవ్వులు, మీ ఏడుపులు, గోడవలు అన్ని గమనిస్తున్నా. మీకు ముందే మాటిచ్చాను. కేవలం క్రష్టుడిలా పక్కన ఉండి మీకు దారి చూపించడమే కాదు.. అర్జుడిలా రణరంగలోకి దిగుతానని చెప్పాను. ఇప్పుడు ఆ సమయంలో ఆసన్నమైంది.


స్వయంగా నేనే రంగంలోకి దిగి ఆటను నా చేతిలోకి తీసుకోబోతోన్న. శనివారం నాగార్జునతో మీకు ఎదురైన అనుభవం కేవలం ఓ చిన్న ట్రైలర్ మాత్రమే. కానీ, అసలు సినిమా ఎలా ఉండబోతోందో రాబోయో వారం మీకు చూపిస్తాను. ఇప్పుడు జరగబోయేది మీ ఊహాకు మించి ఉండబోతోందంటూ అంటూ కంటెస్టెంట్స్ లో అలర్ట్ చేశాడు బిగ్ బాస్. తన ఈ ఆట వారి నామినేషన్స్, ఆట, పాటపై కాకుండా హౌజ్ ఎవరూ ఉండాలనేదానిపై కూడా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించాడు. ఆ తర్వాత గార్డెన్ ఎరియాలో అమర్చిన చెట్టుకి వారి వారి పేరుతో యాపిల్స్ ని వెలాడదీశారు.

తనూజకి బిగ్ బాస్ సర్ప్రైజ్

ఆ పండ్లలో వివిధ రకాల విత్తనాలను ఉంచి.. ట్విస్ట్ పెట్టాడు. ఆ పండును మార్చుకోవాలని ఎవరూ అనుకుంటున్నారు అని అడగ్గా.. శ్రీజ దమ్ము, ప్రియ, రీతూ చౌదరి ముందుకు వచ్చారు. తనూజ కోసం బిగ్ బాస్ ఓ స్పెషల్ సర్ప్రైజ్ పింపించారు. తనకు ఎంతో ఇష్టమైన లగ్జరీ బడ్జెట్ కాఫీ పౌడర్ పంపించారు. కానీ, అంది పొందాలని ఓ కండిషన్ పెట్టారు. సంజన చేతికి ఆ బాటిల్ ఇచ్చి.. తనూజకి ఇచ్చారు. దీంతో సంజన ఈ కాఫీ కావాలంటే ఏదైనా చేసి.. నేను పడి పడి నవ్వేలా చేస్తే.. ఇది నీ చేతికి వస్తుందని అంటుంది. ఈ టాస్క్ లో తనూజకు ఇమ్మాన్యుయేల్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్లు సాయం చేస్తారు.

అలా సుమన్ శెట్టి ఇష్టపడుతున్న అమ్మాయిగా తనూజ, అమ్మాయిలంటే బయపడే యువకుడిగా సుమన్ శెట్టి.. అతడికి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఇమ్యాన్యుయేల్, డిమోన్ లు చేశారు. అలా సరదగా సరదాగా చేసి సంజను నవ్విస్తూ ఇంప్రెస్ చేశారు. దీంతో కాఫీ తనూజ చేతికి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి అలర్ట్ ఇచ్చారు. తమ పండ్లలో బ్లూ విత్తనం వచ్చిన తనూజ, ఇమ్మాన్యుయేల్, ప్రియ, రాము రాథోడ్, సుమన్ శెట్టిలకు ఇంటి నుంచి సందేశాలు వచ్చాయని, ఎవరెవరూ వాటిని పొందుతారో.. బయట అమర్చిన బ్యాట్రీ తగ్గిపోతుంది.

ఇమ్మాన్యుయేల్ ఎమోషన్

చివరికి అది అయిపోతే.. మిగిలిన వారికి ఆ సందేశం పొందే అవకాశం ఉండదని కండిష్ పెడతాడు బిగ్ బాస్. దీంతో అందులో మొదటగా ఇమ్మాన్యుయేల్ కన్ఫేషన్ రూంకి వెళతాడు. తన తండ్రి నుంచి లేటర్, తల్లి నుంచి ఆడియో సందేశం, ఫ్యామిలీ ఫోటో వస్తుంది. తండ్రి లేటర్ కావాలంటే హౌజ్ బ్యాటరీ నుంచి 45 శాతం, తల్లి ఆడియో పొందాలంటే 30 శాతం, ఫ్యామిలీ ఫోటో కావాలంటే 25 శాతం బ్యాటరీ తగ్గుతుందని చెబుతున్నారు. మిగతా వారి కూడా అవకాశం రావాలని ఇమ్మాన్యుయేల్.. కేవలం ఫ్యామిలీ ఫోటోనే తీసుకుంటాడు.

కానీ, తల్లి ఆడియో, తండ్రి లేటర్ మిస్ అవుతున్నందుకు చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను ఏడిస్తే తన తల్లి తట్టుకోలేదు.. నేను ఏడవను అంటూనే కంటి నిండ కన్నీరు పెట్టుకున్నాడు. ఫ్యామిలీస్ సందేశాలు వచ్చాయనగానే.. హౌజ్ మొత్తం సైలెంట్ అయ్యింది. ప్రియ, సుమన్ శెట్టి, తనూజ, రాము రాథోడ్ లోలోపల వేదనకు గురవుతూ.. సైలెంట్ అయిపోయారు. కన్ఫేషన్ రూం నుంచి బయటకు వచ్చిన ఇమ్ముకి బిగ్ బాస్ ఫ్యామిలీ ఫోటో పంపించాడు. అది చూసుకుని ఇమ్ము ఫుల్ ఖుష్. నేటి బిగ్ బాస్ 9 తెలుగు 16వ ఎపిసోడ్ ముగుసింది.

Related News

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×