BigTV English

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Bigg Boss.. బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న ఏకైక రియాల్టీ షో. ఈసారి 8వ సీజన్ మొదలైన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా, అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారంలో భాగంగా అభయ్ (Abhay) ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. మూడవ వారం నామినేషన్ లో భాగంగా..ప్రేరణ, యష్మీ గౌడ , పృథ్వి, నైనిక , మణికంఠ , సీత, విష్ణుప్రియ , అభయ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూడగా తాజాగా మూడవ వారం నుండి అభయ్ ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.


3 వ వారం ఎలిమినేట్ కానున్న అభయ్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రారంభంలో చాలా నిదానంగా ఈ షో నడిచింది. కానీ మూడవ వారంలో మాత్రం టాస్కులు అదిరిపోయాయి. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు అన్నీ కూడా అద్భుతంగా ఉండటమే కాకుండా కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడారు. ఒక్క అభయ్ తప్ప. టాస్కులు ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ ఒక క్లాన్ కి చీఫ్ గా వ్యవహరిస్తూ తనకు, క్లాన్ కు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఒక మూలన కూర్చొని రేలంగి వేషాలు వేయడం ఆడియన్స్ కు అసలు నచ్చలేదు. నిన్న జరిగిన ఎగ్ కలెక్టింగ్ టాస్క్ లో అభయ్ ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు.


మాటలతో బిగ్ బాస్ కి కోపం తెప్పించిన అభయ్..

ముఖ్యంగా అవతల క్లాన్ కి సంబంధించిన వాళ్ళు ఈయన వద్దకు వచ్చి గుడ్లు దోచుకొని వెళ్తుంటే పండగ చేసుకోండి అంటూ తేలికగా వదిలేశాడు. మరొకవైపు యష్మీ, ప్రేరణ , మణికంఠ క్రూరంగా ఆడుతుంటే.. నిఖిల్ క్లాన్ సభ్యులతో పోరాడి అంత కష్టపడి గుడ్లను గెలుచుకుంటూ ఉంటే.. ఈయన మాత్రం తేలికగా వదిలేయడం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి తోడు ఇదేం పనికిమాలిన గేమో అర్థం కావడం లేదు అంటూ ఏకంగా బిగ్ బాస్ ని దుర్భాషలాడడం అభయ్ పై నెగిటివిటీ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఈ వారం నామినేషన్ లోకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చాడు. ప్రేక్షకులు సేవ్ చేస్తారనే నమ్మకం కూడా పెట్టుకున్నాడు. దీనికి తోడు కంటెస్టెంట్ గా ఈవారం ఫెయిల్ అవ్వడమే కాదు చీఫ్ గా కూడా డిజాస్టర్ అనే చెప్పాలి. అందుకే రోజు వారీ ఓట్ల కంటే కూడా బాగా తగ్గిపోయాయి.

Bigg Boss: Abhay who is going to be eliminated from the house.. What is the remuneration for 3 weeks..?
Bigg Boss: Abhay who is going to be eliminated from the house.. What is the remuneration for 3 weeks..?

టాలెంట్ ను నిరూపించుకోలేకపోయిన అభయ్..

ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మూడు వారాలకు గానూ ఇతను తీసుకుంటున్న పారితోషకం ఎంత అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలలో కాస్త మంచి పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీ కావడంతో ఈయనకి వారానికి రూ.3 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది బిగ్ బాస్. ఇక ఒప్పందం ప్రకారం వారానికి రూ.3 లక్షలు అంటే 3 వారాలకు గానూ రూ .9 లక్షలు అభయ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. నిజానికి మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ , గేమ్ గనక సరిగ్గా ఆడి ఉంటే కచ్చితంగా టాప్ 5 లోకి వచ్చేవాడు. కానీ బిగ్ బాస్ లోకి రిలాక్స్ అవడం కోసం వచ్చినట్టు వుంది. పైగా టాస్కులు ఆడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం వల్లే అభయ్ ను ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Bigg Boss 9 New Captain: భరణికి చెక్ పెట్టిన కళ్యాణ్.. హౌజ్‌ కొత్త కెప్టెన్‌ అతడే!

Bigg Boss 9 Promo: అదిరిపోయిన కెప్టెన్సీ టాస్క్.. అతి నమ్మకం పనికిరాదు పాపా!

Bigg Boss 9 Promo: పొట్టిగా ఉండడం ఆయన చేసిన తప్పా.. ఏంటమ్మా ఫ్లోరా?

BB 9 Wild Card: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కాంట్రవర్సీ క్వీన్.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 : 2 టాస్క్ లతో స్కోర్స్ తారుమారు, నాశనం చేసిన రీతు, సేఫ్ జోన్ కి వెళ్ళిపోయిన ఆ ముగ్గురు

Bigg boss 9: దివ్య వచ్చాక భరణి నిజంగానే మారిపోయాడా? అసలు సంజన ఎమోషన్ వెనుక అర్థం ఉందా?

Big Stories

×