BigTV English
Advertisement

OTT Movie : టైమ్ ట్రావెల్ కాప్ డ్రామా.. తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసిన టైం ట్రావెల్ వెబ్ సిరీస్

OTT Movie : టైమ్ ట్రావెల్ కాప్ డ్రామా.. తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసిన టైం ట్రావెల్ వెబ్ సిరీస్

OTT Movie : పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒకేసారి చూడగలిగితే… ఇలాంటి టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే  సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే ఓ వర్గం ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. కాకపోతే ఇలాంటి సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ లోనే అందుబాటులో ఉంటాయి. కాబట్టి భాష రాక కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక టైం ట్రావెల్ సినిమాలు కేవలం హాలీవుడ్ లోనే ఉన్నాయా అంటే కాదు ఇప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ లతో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాప్ థ్రిల్లర్ సిరీస్ కూడా అలాంటిదే. ఇప్పటికే రిలీజ్ అయి రికార్డుల క్రియేట్ చేసిన ఈ సిరీస్ ప్రస్తుతం తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఏంటో తెలుసుకుందాం పదండి.


తెలుగులో కూడా స్ట్రీమింగ్..

జీ5 ఓటిటిలో కొన్నాళ్ల కిందట రిలీజ్ అయిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గ్యారా గ్యారా. ఈ వెబ్ సిరీస్ రెండు వేరు వేరు కాలాల్లో జరిగే క్రైమ్స్ పరిష్కరించడానికి ట్రై చేసే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను కలుపుతుంది. దానికి ఓ వాకీ టాకీ వారధిగా మారుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సిరీస్ ను కొరియన్ డ్రామా సిగ్నల్ స్ఫూర్తితో నిర్మించారు. ఇక ఇప్పటికే హిందీలో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సిరీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆగస్టు 9 నుంచి జీ5  అనే ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ లో కృతిక కామ్ర, ధైర్య కార్వా, ఆకాష్ దీక్షిత్, రాఘవ్ ప్రధాన పాత్రులు పోషించారు. ఉమేష్ బెస్త్ దర్శకత్వం వహించారు. భాష ఒక బారియర్ కాదు అనుకునే వారు ఇప్పటికే సిరీస్ ను చూసేసి ఉంటారు.


Review: 'Gyaarah Gyaarah' is a time-bending thriller that leaves you guessing backed by ...

స్టోరీ ఏంటంటే…

ఈ సిరీస్లో 1990, 2001, 2016 టైం లైన్స్ లో మూడు దశాబ్దాల కాల వ్యవధిలో సాగుతుంది. కానీ స్టోరీ మొదలవడం మాత్రం 2016లో ఓ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలవుతుంది. అతనికి దొరికిన ఒక వాకి టాకీ ప్రతిరోజూ రాత్రి 11;11 గంటలకు కేసులను పరిష్కరించిన మరో పోలీస్ ఆఫీసర్ శౌర్య అద్వాల్ ను కలుపుతుంది. వీరిద్దరూ వేరు వేరు కాలాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లు అన్న విషయం తెలియకుండానే ఇద్దరూ కలిసి కేసుల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్ లుగా వచ్చింది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. కాబట్టి ఈ వీకెండ్ మర్చిపోకుండా ఓ లుక్ వెయ్యండి. ముఖ్యంగా టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ జానర్లలో వచ్చే సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కు ఈ సిరీస్ మంచి ఆప్షన్. హిందీలో చూడడం కష్టం అని భావించే అచ్చ తెలుగు మూవీ లవర్స్ ఇప్పుడు భాష అనే అడ్డంకి లేకుండా ఈ సినిమాను తెలుగులోనే ఆస్వాదించవచ్చు.

Tags

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×