BigTV English

OTT Movie : రెండేళ్ల తర్వాత ఓటిటిలోకి తెలుగు ఫ్యాంటసీ థ్రిల్లర్… ఈ వీకెండ్ మస్ట్ వాచ్

OTT Movie : రెండేళ్ల తర్వాత ఓటిటిలోకి తెలుగు ఫ్యాంటసీ థ్రిల్లర్… ఈ వీకెండ్ మస్ట్ వాచ్

OTT Movie : ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయి పట్టుమని నెలరోజులు కూడా గడవక ముందే సినిమాలు ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. పైగా ఆ విషయాన్ని ముందస్తు ఇన్ఫర్మేషన్ గా ముందే ఇచ్చి ప్రేక్షకులను అలర్ట్ చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా స్ట్రీమింగ్ కానిచ్చేస్తారు. అయితే ఈవారం ఓటీటిలో రిలీజ్ కాబోతున్న సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ వీకెండ్ తెలుగు సినిమాలను మిస్ అవుతాం ఏమో అని అప్సెట్ అయ్యే వారి కోసమే ఈ మూవీ సజెషన్. తెలుగు మూవీ లవర్స్ ను సర్ప్రైజ్ చేయడానికి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాంటసీ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


ఈటీవీ విన్ లో అందుబాటులో…

కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్ము దులుపుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటి సినిమాల లిస్ట్ లో ఉండేదే. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అతనే హీరోగా కూడా నటించారు. ఈ సినిమాలో ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటించగా, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, మాస్టర్ అఖిల్, విద్యా సాగర్, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022లో థియేటర్లలోకి వచ్చింది. అయితే బిగ్ స్క్రీన్ పై మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి మూవీ లవర్స్ ను అలరించడానికి ఈటీవీ విన్ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూవీ ఆల్రెడీ ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే ఈ వీకెండ్ మర్చిపోకుండా చూసేయండి.


Surapanam OTT: ఓటీటీలోకి వచ్చేసిన శివలింగం మిస్సింగ్‌ డ్రామా.. ‘సురాపానం’ ఎక్కడ...

స్టోరీ విషయానికి వస్తే…

ఓ చిన్న పల్లెటూరులో దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతాడు శివ అనే దొంగ. ఫ్రెండ్స్ తో అల్లరి చిల్లరగా తిరుగుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతాడు. ఈ క్రమంలోనే అతను ఒక మైన్ ను తవ్వే బాధ్యతను తీసుకుంటాడు. మల్లన్న అనే వ్యక్తి అప్పగించిన ఈ పనిని చేస్తుండగా తవ్వకాల్లో శివుని ప్రతిమ బయట పడుతుంది. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ గా కనిపించే ఒక బాక్స్ కూడా దొరుకుతుంది. అందులో ఓ చిన్న సీసా ఉండడం, దాంట్లోనూ ఒక లిక్విడ్ లాంటిది కనిపించడంతో అదేంటా అని పరిశీలిస్తాడు శివ. ఆ తర్వాత ఆలోచించకుండా వెంటనే అందులో ఉన్న లిక్విడ్ ను గొంతులోకి పోసేసుకుంటాడు. మరోవైపు ఆ విగ్రహం మిస్ అవుతుంది. అసలు శివ తాగింది ఏంటి? విగ్రహం ఎందుకు ఎలా మిస్ అయింది అనే విషయాలు తెలియాలంటే సురాపానం అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే.

Tags

Related News

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

Big Stories

×