Bigg Boss Agnipariksha Promo :సామాన్యులను కంటెస్టెంట్లుగా మార్చడానికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరిట ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20వేలకి పైగా అప్లికేషన్లు రాగా.. పలు రౌండుల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. ఆ 45 మంది సామాన్యులలో ఐదు మందిని మాత్రమే హౌస్ లోకి పంపించనున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అగ్నిపరీక్ష పేరిట ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా ప్రత్యేకంగా ఈ షోని స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ (Navdeep ), అభిజిత్ (Abhijeeth), బిందు మాధవి(Bindu Madhavi) జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉండగా.. ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) హౌస్ గా చేస్తున్నారు.
అగ్ని పరీక్ష 9వ ఎపిసోడ్ ఐదు మూడవ ప్రోమో రిలీజ్..
ఇకపోతే తాజాగా 9వ ఎపిసోడ్ కి సంబంధించిన మూడవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న సామాన్యులకు.. జడ్జిలు ఇచ్చిన టాస్క్ చూసి ఆఖరికి పని మనుషులను చేశారు కదరా అంటూ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి టాస్క్ విషయానికి వస్తే.. వంట పాత్రలను శుభ్రం చేసి, బట్టలు మడత పెట్టి, ఫ్లోర్ క్లీన్ చేయమని ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. పైగా కడిగిన ఆ ప్లేట్లలోనే భోజనం చేయాలని కూడా తెలిపింది. అలా ఎవరికి వారు టాస్క్ పూర్తి చేసే పనిలో పడగా.. కొంతమంది మాత్రం రూల్స్ బ్రేక్ చేశారు. ఒకరికి కేటాయించిన ప్లేస్ లోని చెత్త మరొకరి ప్లేస్ లో వేయడం.. బట్టలు సరిగా మడత పెట్టకపోవడం.. పైగా ప్లేట్లు సరిగ్గా క్లీన్ చేయకపోయినా సంచాలక్ గా వ్యవహరించిన వారు ఓకే చెప్పడం ఇవన్నీ కూడా కాస్త రాంగ్ గా అనిపించాయి.
సీరియస్ గా స్టేజి నుంచి దిగిపోయిన నవదీప్..
ఇది చూసిన శ్రీముఖి టాస్క్ పూర్తయిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. ఇలాంటి ప్లేట్లలో మీరు భోజనం చేస్తారా? అంటూ తిరిగి వారికే ప్రశ్నలు వేసింది. అంతేకాదు అక్కడి ప్లేట్లను విసిరి పడుతూ నానా రభస చేసింది. జడ్జ్ నవదీప్ స్టేజ్ పైకి వచ్చి.. జోబులో ఎల్లో కార్డ్స్ తీసి సీరియస్ గా ఎల్లో కార్డ్స్ ఇచ్చేస్తాను అంటూ స్టేజ్ పైనుంచి కూడా ఆయన దిగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అటు హోస్ట్ గా శ్రీముఖి .. ఇటు జడ్జీలు గా వీరు అందరూ కూడా ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. మరి ఆ 45 మంది సామాన్యులలో హౌస్ లోకి వెళ్ళబోయే ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరో తెలియాల్సి ఉంది.