BigTV English

Tesla – Team India : టీమిండియా స్పాన్సర్ గా టెస్లా… రంగంలోకి ఎలాన్ మాస్క్ ?

Tesla – Team India : టీమిండియా స్పాన్సర్ గా టెస్లా… రంగంలోకి ఎలాన్ మాస్క్ ?
Advertisement

Tesla – Team India : ప్రమోషన్ బిల్లు రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్  గేమింగ్ బిల్లు 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తమ జట్లకు జెర్సీ స్పాన్సర్ గా ఉన్న ప్రధాన గేమింగ్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్ల జెర్సీలకు అధికారికంగా స్పాన్సర్ లేకుండా పోయారు. సెప్టెంబర్ 09న ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీమిండియా జెర్సీ లేకుండానే దిగుతుందని కొందరూ పేర్కొంటే.. మరికొందరూ టీమిండియా స్పాన్సర్ తోనే బరిలోకి దిగుతుందని మరికొందరూ పేర్కొంటున్నారు. ఇప్పటీకే విమల్ పాన్ మసాలా టీమిండియా కి 2028 వరకు స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని.. మరోవైపు టొయోటా మోటార్ కార్పొరేషన్ కూడా ఆసక్తి చూపుతుందని వార్తలు వినిపించాయి. తాజాగా మరో కొత్త కంపెనీ ముందుకు వచ్చేసింది. అదే టెస్లా కంపెనీ.


టీమిండియా స్పాన్సర్ గా ఎలన్ మస్క్ ఆసక్తి.. 

టీమిండియా కి స్పాన్సర్ షిప్ చేసేందుకు ఎలన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తరువాత టీమిండియా ప్రధాన జెర్సీ స్పాన్సర్ గా టెస్లా మోటార్స్ కూడా రేస్ లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఓ ఫిన్ టెక్ స్టార్టప్, టాటా గ్రూపు, రిలియన్స్, అదానీ వంటి గ్రూపులు బీసీసీఐకి తమ ఆసక్తి గురించి తెలిపాయని సమాచారం. జెర్సీ స్పాన్సర్ షిప్ ను వాస్తవానికి అధికారిక టెండర్ ప్రకియ ద్వారా నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండ్లను ఆహ్వానించింది. 2023లో రూ.358 కోట్లతో మూడు సంవత్సరాల వరకు డ్రీమ్ 11తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ స్థానాన్ని డ్రీమ్ 11 భర్తీ చేసింది. భారత ప్రభుత్వం తాజా నిర్ణయంతో డ్రీమ్ 11-బీసీసీఐ అగ్రిమెంట్ మధ్యలోనే రద్దయింది.


ఆసియా కప్ కి ముందు టీమిండియాకి షాక్.. 

ఈ నేపథ్యంలో టీమిండియాకి విమల్ పాన్ మసాలా, టాటా గ్రూపు, రిలియన్స్, అదానీ వంటి గ్రూపులతో పాటు తాజాగా టెస్లా కంపెనీ కూడా రేసులోకి రావడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆసియా కప్ ముందు టీమిండియా జట్టు కి భారీ ఎదురు దెబ్బ తగిలిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సారి ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు ఆటగాళ్లు ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనున్నట్టు సమాచారం. స్పాన్సర్ షిప్ హక్కుల కోసం బీసీసీఐ త్వరలోనే కొత్త బిడ్ ని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 09 ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు బీసీసీఐ స్పాన్సర్ లేకుండా ఆడనుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు స్పాన్సర్ గురించి రకరకాల పేర్లు వినిపించడంతో ఇంతకు అసలు టీమిండియాకి స్పాన్సర్ గా ఎవ్వరూ వ్యవహరిస్తున్నారని అభిమానులు కాస్త గందరగోళంలో పడ్డారు. బీసీసీఐ అధికారికంగా ధృవీకరించే వరకు ఇలాంటి వార్తలు వినిపించడం ఖాయం అనే స్పష్టంగా తెలుస్తోంది అని కొందరూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Related News

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

IND vs AUS: RO-KO అంటూ జాకీలు పెట్టి లేపారు..కంగారుల ముందు మాత్రం తోక ముడిచారు !

IND VS AUS 1st ODI: టాస్ గెలిచిన ఆసీస్..ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..జ‌ట్ల వివ‌రాలు ఇవే

INDW vs ENGW: ఇవాళ ఇంగ్లండ్ తో డూ ఆర్ డై.. ఓడితే టీమిండియా ఇంటికేనా ?

IND VS AUS 1st ODI: నేడే ఆస్ట్రేలియాతో తొలి వన్డే..వ‌ర్షం ప‌డే ఛాన్స్‌.. టైమింగ్స్‌,ఉచితంగా చూడాలంటే

Colombo Rains: గ‌బ్బులేపుతున్న కొలంబో వ‌ర్షాలు…వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 మ్యాచ్ లు ర‌ద్దు..త‌ల ప‌ట్టుకుంటున్న ఐసీసీ

Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

Dhaka Airport Fire: బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా భారీ అగ్నిప్రమాదం..ఉలిక్కిప‌డ్డ ప్లేయ‌ర్లు

Big Stories

×