Bigg Boss Agnipariksha 2 : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో ప్రతి ఇండస్ట్రీలోనూ ప్రసారమవుతుంది. హిందీలో ఇప్పటికే 18 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తమిళ్ తెలుగు లో ప్రస్తుతం 9 వ సీజన్ ప్రసారం అవుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగులో బిగ్ బాస్ కామనర్స్ కోసం అగ్ని పరీక్షను నిర్వహించారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరుతో వచ్చిన ఆ షోలో కామనర్స్ పాల్గొన్నారు. అక్కడ తమ టాస్క్ లతో ప్రేక్షకులను మెప్పించిన వారిని హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జనాలను కాస్త ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి. దీంతో ఈ షో సీజన్ 2 ను నిర్వహించబోతున్నట్లు ఓ వార్త ప్రచారం లో ఉంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.
గత సీజన్లలో బిగ్ బాస్ షోలోకి ఒక్కరు మాత్రమే కామన్ మ్యాన్ వచ్చేవాడు. కానీ ఈ సారి మాత్రం హౌస్ లోకి ఎక్కువ మంది కామర్స్ హౌస్ లోకి వచ్చారు. వీళ్ళను ఎంపిక చెయ్యడానికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే షోను నిర్వహించారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష అప్లేషన్స్ ఆహ్వానించడం వారిలో నుంచి కొందరిని సెలెక్ట్ చేశారు. ఫైనల్ గా ఆరుగురిని హౌస్ లోకి పంపించారు. అయితే ఇప్పటికీ ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లో కొనసాగుతున్నారు. పది వారాలు పూర్తయిన కూడా ఆ ఇద్దరు మాత్రం నామినేషన్స్ లోకి వస్తూ మళ్లీ సేవ్ అవుతూ టాస్క్ లలో తమ సత్తా ని చూపిస్తున్నారు.. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని వారాల్లో పూర్తి కాబోతుంది.. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మళ్లీ వచ్చే ఏడాది కదా బిగ్ బాస్ మొదలయ్యేది. ఈ సీజన్ను మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నారు అన్నది ఇప్పుడు జనాల్లో మెదులుతున్న ప్రశ్న. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ షో సీజన్ 2 ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు అయితే నెట్టింట వినిపిస్తున్నాయి.. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం..
Also Read : ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?
ఈ ఏడాది సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం అయ్యింది. ఈ షో కన్నా ముందే అగ్నిపరీక్ష షోను నిర్వహించారు. అగ్నిపరీక్ష కు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ తో పాటు షోని శ్రీముఖి హోస్ట్ చేశారు.. అయితే అగ్నిపరీక్ష సీజన్ 2లో వీళ్లే కొనసాగుతారా లేదా వేరే బిగ్ బాస్ సెలబ్రిటీస్ వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి అగ్నిపరీక్ష సీజన్ తో సంబంధం లేకుండా కామనర్స్ నుంచి కొందరిని ఎంపిక చేసి వారితో అగ్నిపరీక్ష సీజన్ 2 నడిపిస్తారట. అందులో మంచి పర్ఫార్మ్ చేసి సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ సీజన్ 10 లోకి పంపిస్తారట. మరో నాలుగు వారాల్లో బిగ్ బాస్ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ సీజన్ విన్నర్ రేసులో తనూజ, ఇమ్ము, పవన్ ఉన్నారు. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి..