BigTV English

Bigg Boss: ఆ స్టార్ క్రికెటర్ తో పెళ్లి, పిల్లలు కూడా.. హాట్ బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ!

Bigg Boss: ఆ స్టార్ క్రికెటర్ తో పెళ్లి, పిల్లలు కూడా.. హాట్ బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ!

Bigg Boss:క్రికెటర్ల మీద మామూలు జనాలే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా మనసు పడుతూ ఉంటారు. అలా మన ఇండియన్ క్రికెటర్ల మీద మనసు పడి ఇష్టపడ్డ మోడల్స్, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ అలియాస్ బిగ్ బాస్ బ్యూటీ కూడా ఒకరు. అయితే ఈమె ఏకంగా ఆ స్టార్ క్రికెటర్ ని ప్రేమించడమే కాదు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నాను అంటూ హాట్ బాంబు పేల్చింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఈమె పెళ్లి చేసుకొని, పిల్లల్ని కూడా కన్నాను అంటున్న ఆ స్టార్ క్రికెటర్ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer). పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా ఉంటూ.. దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టుని ఐపీఎల్ లో ఫైనల్ కి తీసుకు వచ్చిన ఘనత శ్రేయాస్ అయ్యర్ ది. ఈయన తన అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ ని ఫైనల్ కి తీసుకువచ్చారు. కానీ చివర్లో రాణించలేకపోయారు. అయితే అలాంటి శ్రేయాస్ అయ్యర్ గురించి తాజాగా ఓ నటి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శ్రేయాస్ అయ్యర్ తో పెళ్లి అయి, పిల్లలు పుట్టారు – బిగ్ బాస్ బ్యూటీ ఎడిట్ రోజ్


మరి ఇంతకీ ఆ నటి ఎవరంటే..? హిందీ నటి ఎడిన్ రోజ్(Edin Rose).. మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఎడిన్ రోజ్.. హిందీ బిగ్ బాస్ 18 ద్వారా ఫేమస్ అయ్యింది. అలాగే తెలుగులో రవితేజ (Raviteja )నటించిన ‘రావణాసుర’ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. తాజాగా నయనతార (Nayanthara)నిర్మిస్తున్న LIK మూవీలో ఒక కీ రోల్ పోషిస్తుంది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నా మనసులో ఎప్పుడో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాను. శ్రేయాస్ అయ్యర్ నా తండ్రిలాగే దక్షిణ భారతీయుడు. మా నాన్న తమిళీయుడే. శ్రేయాస్ అయ్యర్ కూడా తమిళీయుడే. అందుకే నాకు శ్రేయాస్ అయ్యర్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆయన ఎప్పుడూ గడ్డంతో చాలా అందంగా ఉంటారు.ఆయన హైట్, కలర్ అంటే చెప్పలేనంత ఇష్టం..

ఎడిన్ రోజ్ పై ట్రోల్స్..

శ్రేయాస్ అయ్యర్ తన మెరుగైన కెప్టెన్సీతో కచ్చితంగా భవిష్యత్తులో భారత జట్టుకి కెప్టెన్ అవుతాడని నా నమ్మకం. ఆయన హైట్, పర్సనాలిటీ నన్ను కట్టిపడేసింది. అలాగే తనకు విరాట్ – అనుష్క (Virat-Anushka) జంట అంటే చాలా ఇష్టమని, వీరిద్దరూ ఆదర్శ దంపతులు అంటూ చెప్పుకొచ్చింది. అయితే శ్రేయాస్ అయ్యర్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టిన నటి ఎడిన్ రోజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా అంటే శ్రేయాస్ సీక్రెట్ గా ఈ విషయాన్ని మెయింటైన్ చేసాడేమో అనుకున్నాం. కానీ నువ్వు మనసులో పెళ్లి చేసుకున్నావా.. అయినా మనసులో అనుకుంటే పెళ్ళై, పిల్లలు కూడా పుట్టారమ్మా.. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వెళ్లి అడుగు అంటూ సోషల్ మీడియాలో ఎడిన్ రోజ్ వ్యాఖ్యలపై ట్రోల్స్,మీమ్స్ పేలుతున్నాయి. మరి ఈమె నేరుగా శ్రేయాస్ అయ్యర్ తో తన మనసులో మాట చెబుతుందో లేదో చూడాలి.

ALSO READ:Kamal Haasan: ఆస్తులే కాదు అప్పులు కూడా..ఇదెక్కడి విడ్డూరం!

Related News

Bigg Boss 9 Promo : సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలైంది, కన్నీటి కుళాయిలు ఓపెన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటి?

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Big Stories

×