Team India: సాధారణంగా టీమిండియా ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ ఆడుతున్న అభిమానులు అక్కడికీ వీక్షించేందుకు వెళ్తుంటారు. అలాగే తమ అభిమాన క్రికెటర్లను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు మక్కువ చూపిస్తుంటారు. క్రికెట్ ప్రారంభంలో అంత క్రేజ్ లేనప్పటికీ.. కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్న సమయంలో వరల్డ్ కప్ వచ్చాక ఇండియన్ అభిమానులు క్రికెట్ పై ఆసక్తి కనబరిచారు. ఇక ఆ తరువాత సౌరబ్ గంగూలీ కెప్టెన్సీలో 2003లో టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఓటమి చెందింది. అయినప్పటికీ అభిమానుల మనస్సు గెలుచుకుంది. అప్పటి నుంచి అభిమానులు క్రికెట్ ను వీక్షించేందుకు ప్రపంచంలో ఎక్కడికి అయినా వెళ్లి వీక్షిస్తున్నారు. ముఖ్యంగా సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరెంద్ర సెహ్వాగ్ వంటి క్రీడాకారులను అప్పట్లో అభిమానులు కాస్త ఎక్కువగా ఉండేవారు.
ఇక ఆ తరువాత మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లకు కూడా ఆ క్రేజ్ ఉండేది. అయితే ఇప్పటికే ధోనీ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ-20 2024 వరల్డ్ కప్ విజయం సాధించిన తరువాత టీ-20 మ్యాచ్ లకు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత తాజాగా టెస్ట్ క్రికెట్ కి కూడా వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాడ్ కి బయలుదేరింది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటించింది. అయితే విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ లేకపోవడంతో టీమిండియా కి యూకేలో గ్రాండ్ వెల్కమ్ దక్కలేదు. వారిద్దరికీ బాగా ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న జట్టులో ఏ క్రికెటర్ కి కూడా కూడా అంతగా అభిమానులు లేకపోవడంతో టీమిండియా ను చూసేందుకు అభిమానులు విమానాశ్రయానికి ఎవ్వరూ రాలేదు. దీంతో టెస్ట్ జట్టు క్రికెటర్లు అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.
భవిష్యత్ లో ఆ క్రికెటర్ కి భారీ క్రేజ్..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు కెప్టెన్ గా ఉండటం.. మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడుతారని వారి పట్ల అభిమానం వ్యక్తం చేసారు. ప్రస్తుతం శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ వంటి స్టార్ క్రికెటర్లు టీమిండియాలో ఉన్నప్పటికీ వారికి అంతగా క్రేజ్ లేదు. గిల్ కంటే పంత్ కి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. ప్యూచర్ లో కీలక ఆటగాడు కే.ఎల్. రాహుల్ విరాట్ కోహ్లీ అంత క్రేజ్ తప్పక సంపాదించుకుంటాడని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తే.. బాగుండేదని పలువురు టీమిండియా అభిమానులు చెబుతుండటం విశేషం. టీమిండియా కీలక బౌలర్ బుమ్రా కోసం కూడా ఒక్క అభిమాని కూడా రాలేదు ఏంది..? అని అందరూ చర్చించుకోవడం గమనార్హం.