Kamal Haasan..లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాలు, వ్యాపారాల ద్వారా వందల కోట్లు సంపాదించారట. అయితే ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా పదవికి నామినేషన్ వేయాలంటే.. వాళ్లకు ఉన్న ఆస్తులు, అప్పులు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా తాజాగా కమల్ హాసన్ సొంత పార్టీ అయినటువంటి ‘మక్కల్ నీది మయ్యం’ నుండి ఆయన రాజ్యసభకు నామినేషన్ వేశారు. అయితే డీఎంకే పార్టీకి సపోర్ట్ చేయడంతో కమల్ హాసన్ ని రాజ్యసభకు పంపించడానికి డీఎంకే పార్టీ కూడా సపోర్ట్ చేసింది.అలా తాజాగా రాజ్యసభకి నామినేషన్ వేశారు కమల్ హాసన్.అయితే ఈ నామినేషన్ లో కమల్ హాసన్ తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి..ఎన్ని అప్పులు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ కమల్ హాసన్ ఇన్నేళ్ల తన సినీ జీవితంలో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడు.. అప్పు కూడా ఉందంటున్నారు.. మరి దాని సంగతేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
కర్ణాటక వివాదం.. తొలిరోజే డిజాస్టర్..
‘ థగ్ లైఫ్ ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాదంలో ఇరుక్కున్న కమల్ హాసన్.. తన సినిమాకి నష్టం వచ్చినా పర్వాలేదు అని తనకు అవమానం జరిగిందని భావించిన కర్ణాటకలో తన సినిమాను విడుదల చేయలేదు. అయితే కన్నడ భాష తమిళ భాష నుండి పుట్టిందని కన్నడని చిన్నచూపు చూడడం వల్లే కన్నడిగుల కోపానికి బలయ్యారు కమల్ హాసన్.అయితే కర్ణాటకలో కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా విడుదల చేయకపోయినప్పటికీ కథలో బలం లేకపోవడం వల్లే మిగతా ఆడియన్స్ కూడా ఆదరించలేకపోయారు.
అలా ఫస్ట్ రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.అయితే వివాదాలతో తన సినిమాకి మరింత ప్రమోషన్ అవుతుంది అనుకున్నారు.కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. థగ్ లైఫ్ మూవీ ఇండియన్ 2 మూవీ కంటే భారీ డిజాస్టర్ అని ఇండస్ట్రీలోని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
కమలహాసన్ ఆస్తులు, అప్పులు..
అయితే తాజాగా డీఎంకే పార్టీ సపోర్ట్ తో రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్ హాసన్ తన ఆస్తులు బయటపెట్టారు. కమల్ హాసన్ ఇప్పటివరకు దాదాపు రూ.305.55 కోట్లు సంపాదించారట. అలాగే లోన్ల ద్వారా కమల్ హాసన్ కి దాదాపు రూ.49.67 కోట్ల అప్పులు ఉన్నట్టు తెలిపారు. ఇక ఆయనకు ఉన్న ఆస్తిలో స్థిరాస్తి రూ.245.86 కోట్లు, చరాస్తి రూ.59.69 కోట్లు ఉన్నట్టు చెప్పారు.
ఇక కమల్ హాసన్ కి దాదాపు రూ.22.24 కోట్ల విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందట.ఈ ల్యాండ్ తో తనకి 2023-2024 సంవత్సరంలో దాదాపు రూ.78.9 కోట్ల లాభాలు వచ్చినట్టు తన నామినేషన్ పత్రంలో రాసుకొచ్చారు.. ఇక కమల్ హాసన్ కి 4 కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయట.. ఇక ఈ 4 బిల్డింగ్ల ధర దాదాపు రూ.111.1 కోట్ల వ్యాల్యూ ఉంటుందని మెన్షన్ చేశారు.
ALSO READ: Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి విజయభాను మృతి!
కమలహాసన్ కార్ కలెక్షన్..
ఇక కమల్ హాసన్ కి ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే.. ఆయన దగ్గర లెక్సస్, మహేంద్ర, బిఎండబ్ల్యూ, బెంజ్ వంటి లగ్జరీ కార్ల కంపెనీకి చెందిన ఖరీదైన కార్లు కమల్ హాసన్ గ్యారేజీలో ఉన్నాయట. ఇక ఈ ఖరీదైన కార్ల ధర దాదాపు రూ.8.43 కోట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం తన చేతిలో రూ.2.6లక్షల క్యాష్ ఉన్నట్టు కూడా మెన్షన్ చేశారు.
అలా కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్లో తన ఆస్తులు, అప్పులు బయట పెట్టడంతో ఇన్నేళ్ల సినీ జీవితంలో కమల్ హాసన్ ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించారా అని కొంతమంది షాక్ అయితే మరి కొంతమంది విడ్డూరంగా అప్పులు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ తన ఒక్కో సినిమాకి రూ.20 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకోవడంతో పాటు సినిమా హిట్ అయితే ఆ సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటారు.