BigTV English

Bigg Boss: మెగా చీఫ్ గా బిగ్ బాస్ మహారాణి.. నిఖిల్ వర్సెస్ గౌతమ్ టఫ్ ఫైట్ షురూ.!

Bigg Boss: మెగా చీఫ్ గా బిగ్ బాస్ మహారాణి.. నిఖిల్ వర్సెస్ గౌతమ్ టఫ్ ఫైట్ షురూ.!

Bigg Boss : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టిన మిల్కురి గంగవ్వ (Gangavva ) బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని.. అనారోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే బిగ్ బాస్ పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఇక నాగార్జున సహాయంతో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న ఈమె మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అలా అడుగుపెట్టిందో లేదో బిగ్ బాస్ మహారాణి అంటూ అభివర్ణించారు బిగ్ బాస్. దీంతో గంగవ్వ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ క్రేజే ఇప్పుడు ఈమెను మెగా చీఫ్ గా ఎంపిక చేసింది.


మెగా చీఫ్ గా ఎన్నికైన గంగవ్వ..

నిన్నటితో నామినేషన్ రచ్చ ముగిసింది. మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చేసారు. ఇక హౌస్ లో మెగా చీఫ్ పోటీలు వేరే లెవల్ లో ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు జరిగిన టాస్కులు ఒక లెక్క అయితే ఈరోజు ఎపిసోడ్ నుంచి జరగబోయే టాస్కులు మరో లెక్క అన్నట్టుగా ఉంది. నిన్న హౌస్ లో ప్రారంభమైన మెగా చీఫ్ టాస్క్ కారణంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెద్ద ఎత్తున జరిగాయి. రాయల్ క్లాన్ నుండి గంగవ్వ ను నేరుగా మెగా చీఫ్ కంటెండర్ గా రాయల్ క్లాన్ సభ్యులు ఎంచుకున్నారు. వీకెండ్ టాస్క్ లో బాగా ఆడి అత్యధిక టాస్కులు గెలిచినందుకు నాగార్జున రాయల్ క్లాన్ సభ్యులకు ఒక షీల్డ్ ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ షీల్డ్ ను ఉపయోగించుకొని ఎవరో ఒకరు వాళ్ళ క్లాన్ నుండి నేరుగా మెగా చీఫ్ కంటెండర్ అవ్వచ్చు.. ఈ నేపథ్యంలోనే ఆ క్లాన్ వాళ్ళు ఆ షీల్డ్ ను గంగవ్వ కి ఇచ్చి ఆమె ఏ టాస్క్ ఆడకుండా నేరుగా చీఫ్ కంటెండర్ గా చేశారు.


స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఛార్జర్స్ టాస్క్..

మిగిలిన కంటెస్టెంట్స్ కి చీఫ్ కంటెండర్. అయ్యేందుకు బిగ్ బాస్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఛార్జర్స్ అని ఒక టాస్క్ పెట్టారు. రాయల్ క్లాన్ సభ్యులు ఫోన్స్, ఓజీ క్లాస్ సభ్యులు ఛార్జర్స్. ఇటు రాయల్ క్లాన్ సభ్యులు కేవలం హౌస్ లోపలే ఉండాలి. ఓజీ క్లాన్ సభ్యులు కేవలం గార్డెన్ ఏరియాలోనే ఉండాలి. అయితే ఈ టాస్క్ లో సభ్యుల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. నబీల్, నిఖిల్ కి గౌతమ్ అంటే మొదటి రోజు నుంచి నచ్చడం లేదు అనే విషయం ఆడియన్స్ కు అర్థం అయినట్లుంది ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఈ టాస్క్ విషయంలో గొడవ తార స్థాయికి చేరినట్లు సమాచారం. ఈరోజు లేదా రేపటి ఎపిసోడ్ లో ఈ గొడవ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిఖిల్ వర్సెస్ గౌతమ్..

బయట స్నేహితులుగా కొనసాగిన నిఖిల్ ,గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో టాస్క్ తర్వాత శత్రువులుగా మారిపోవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకానొక దశలో ఫిసికల్ గా కొట్టుకుంటారేమో అని కూడా అనిపిస్తోంది అని సమాచారం. మరి వీరిద్దరి మధ్య గొడవ పూర్తిగా తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×