BigTV English

Bigg Boss Shivaji: ఏకంగా 14 ఎకరాలు అమ్మేశా.. కష్టాలు చెప్పుకొని ఎమోషనల్ అయిన శివాజీ..!

Bigg Boss Shivaji: ఏకంగా 14 ఎకరాలు అమ్మేశా.. కష్టాలు చెప్పుకొని ఎమోషనల్ అయిన శివాజీ..!

Bigg Boss Shivaji :ఒకప్పుడు హీరోగా, విలన్ గా ప్రేక్షకులను మెప్పించిన శివాజీ(Shivaji) ఈ మధ్యకాలంలో జోరు పెంచారు. ముఖ్యంగా గత ఏడాది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 (Biggboss 7) లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తన ఒరిజినల్ క్యారెక్టర్ ను అందరికీ పరిచయం చేశారు. టైటిల్ విన్నర్ గా బరిలోకి దిగిన శివాజీ ,టాప్ 3తో సరిపెట్టుకోవడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ’90s మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ వెబ్ స్టోరీ తో సంచలన విజయం అందుకున్నారు. దీనిని ఈటీవీ విన్ యాప్ లో నేరుగా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో ‘తొలిప్రేమ’ సినిమాలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి(Vasuki) లీడ్ రోల్ పోషించింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్(Jabardast) కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ (Khushboo)తో కలిసి సహ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.


కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నారు..

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయాన్ని అభిమానులతో చెప్పుకొచ్చారు. శివాజీ మాట్లాడుతూ.. “ఇంద్ర సినిమాలో చిరంజీవి(Chiranjeevi) తో కలిసి నటించాను. ఆ సినిమా సమయంలో నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కనీసం రెంట్ కట్టడానికి కూడా డబ్బు ఉండేది కాదు. ఆ విషయం నేను చిరంజీవికి చెప్పలేదు. కానీ ఆయనకి ఎవరి ద్వారానో ఈ విషయం తెలిసింది. దాంతో ఆయన పిలిచి మరీ నాకు రూ.10,000 ఇచ్చారు. నేను వద్దు సార్ అని చెప్పినా సరే ఆయన పర్వాలేదు ఉంచు అని అన్నారు. అలా ఆయన ఇచ్చిన పదివేల రూపాయలు నాకు ఏడాది మొత్తం ఉపయోగపడ్డాయి. అప్పటి నుంచే ఆయన నన్ను బాగా చూసుకునేవారు. అయితే చిరంజీవి నాతో క్లోజ్ గా ఉండడం కొందరికి నచ్చక.. మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు” అంటూ తెలిపారు శివాజీ.


14 ఎకరాల భూమిని అమ్మేశాను..

ఆస్తుల గురించి మాట్లాడుతూ..” నాకు ఆస్తులు కంటే క్యారెక్టర్ ముఖ్యం. నేను నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే వ్యాపారాలు ఉండేవి. సినిమాల్లో రాణిస్తూనే వ్యాపారాలు కూడా చేశాను. ఆ రోజుల్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు నా చేతుల్లో ఉండుంటే ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఇంకొకరు ఉండేవాడు కాదు..చాలా ప్రధాన నగరాలలో ఎకరాల కొద్దీ భూములు ఉండేవి. అత్యంత విలువైన 14 ఎకరాల భూమిని నేను సినిమా కోసం అమ్మేశాను. ఒకవేళ ఆ ఆస్తుల ఉండుంటే తిరుగులేని ధనవంతుడిగా ఉండేవాడిని” అంటూ తెలిపారు శివాజీ.

బిగ్ బాస్ షోకి అందుకే వెళ్ళా..

ఇక బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. “ఈ హౌస్ లో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే అడుగు పెట్టాను. అలాగే నేను మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా వెళ్లాను. అయితే ఈ రెండు కాకుండా అక్కడ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది” అంటూ శివాజీ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×