Venkatesh: ‘కలియుగ పాండవులు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు విక్టరీ వెంకటేష్ (Venkatesh). మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన వెంకటేష్, ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని మాస్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్నారు. తన సినిమాలలో తానే కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. అలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన హీరోలలో వెంకటేష్ ప్రథమ స్థానంలో ఉంటారు.
బాలయ్య షోలో సందడి చేసిన వెంకటేష్..
ఇకపోతే తాజాగా ఈయన ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే వెంకటేష్.. బాలకృష్ణ(Balakrishna) హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి తన అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు ( Suresh Babu), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో కలిసి సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో ఎన్నో విషయాలు పంచుకున్న వెంకటేష్ ఒకానొక సమయంలో తనను ఊహించని శక్తి ఒకటి ఆవహించిందని, ఆ క్షణం తర్వాత తన జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని వెంకటేష్ తెలిపారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అరుణాచలం టెంపుల్ వల్లే ఇదంతా సాధ్యం..
ముఖ్యంగా తన జీవితంలో ఎన్నోసార్లు డిస్టర్బ్ అయ్యారట. ఆ సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించాక ఏం జరిగింది? అనే విషయాన్ని ఆయన పంచుకున్నారు.. వెంకటేష్ మాట్లాడుతూ..”ఈ ప్రపంచంలో నేను ఎన్నో ప్రదేశాలు తిరిగాను. ఎంతో మందిని కలిసాను. ఫలితంగా జీవితంలో ఎంతో డిస్టర్బెన్స్ ఎదురయ్యింది. చివరికి అరుణాచలం వెళ్లి స్వామి దర్శనం అనంతరం స్కందాశ్రమంలో మెడిటేషన్ చేశాను. అక్కడ ఏదో తెలియని శక్తి నాలోకి ప్రవేశించింది. అసలైన హ్యూమన్ ఎనర్జీ ఏంటో అక్కడే నాకు తెలిసింది. నేను అలాంటి శక్తిని అక్కడి నుంచే పొందగలిగాను. ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి సంఘటన కూడా నన్ను మళ్లీ డిస్టర్బ్ చేయలేక పోయింది. ఇప్పుడు చూస్తున్న వెంకీ లోని మార్పులు ఆ అరుణాచలం నుంచి వచ్చినవే, ఎక్కడ దొరకని ప్రశాంతత అక్కడే దొరుకుతుందని, ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదని అక్కడే తెలుసుకున్నాను” అంటూ వెంకటేష్ తెలిపారు. ఇక వెంకటేష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు..
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా చేపట్టగా న్యూ ఇయర్ సందర్భంగా జరిగే వేడుకలలో కూడా చిత్ర బృందం హాజరవుతున్నారు. అలాగే హీరోయిన్స్ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక జనవరి 14వ తేదీన రాబోయే ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.