Indian Railways: జమ్మూకాశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసేందుకు నిర్మిస్తున్న ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే లైన్ కు సంబంధించిన కత్రా-రియాసి సెక్షన్ మధ్య ట్రాక్ వర్క్ తాజాగా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ట్రయల్స్ మొదలు పెట్టారు. ఈ పరిధిలోని మొత్తం 18 కిలో మీటర్ల మేర ఈ ట్రయల్ రన్ కొనసాగింది.
ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ గురించి..
ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన భాగం కత్రా- రియాసి సెక్షన్. సుమారు 18 కిలో మీటర్ల పరిధిలో ఈ మార్గం విస్తరించి ఉంది. అత్యంత సవాళ్లతో కూడుకున్న ప్రాంతం ఇదే. ఈ నేపథ్యంలోనే ఈ సెక్షన్ లో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు, టన్నెల్స్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ట్రయల్ రన్ లో భాగంగా ట్రాక్ స్థిరత్వం, టన్నెల్ వెంటిలేషన్, సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థలను పరిశీలించారు. ప్రయాణీకులు, సరుకుల రవాణా సేవలు ప్రారంభించడానికి ముందు.. ఈ ట్రయల్స్ చివరి దశగా అధికారులు వెల్లడించారు. ఈ ట్రయల్స్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్షలు సక్సెస్ అయినట్లు తెలిపారు. ఈ రైల్వే మార్గం ప్రారంభానికి రెడీ అయినట్లేనని చెప్పుకొచ్చారు.
గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం
అటు కత్రా-రియాసి సెక్షన్ జమ్మూకాశ్మీర్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. సరుకు రవాణా సామర్థ్యాలను మెరుగుపరచనుంది. ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా చేసుకుని ఈ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేసింది.
USBRL ప్రాజెక్ట్ గురించి..
USBRL ప్రాజెక్ట్ అనేది జమ్మూకాశ్మీర్ పరిధిలో 272 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇందులో 255 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కత్రా- రియాసి మధ్య నిర్మాణ పనులు కాస్త మిగిలి ఉన్నాయి. తాజాగా ఈ పనులు కూడా పూర్తి కావడంతో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఉధంపూర్ -శ్రీనగర్- బారాముల్లా రైలు లింక్ (USBRL) భారత ఉపఖండంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న రైల్వే ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రాజెక్ట్ శ్రీనగర్- జమ్మూ మధ్య ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి 3.5 గంటలకు తగ్గిస్తుంది. ప్రధాని మోడీ జనవరి 2025లో కాశ్మీర్- ఢిల్లీ మధ్య ప్రయాణించే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించడంతో పాటు USBRL ప్రాజెక్టునును జాతికి అంకితం చేయనున్నారు. జనవరి 26న ఈ రెండు ప్రాజెక్టులను ఇనారేషన్ చేయనున్నట్లు ఇప్పటికే వందేభారత్ స్లీపర్ రైలు ట్రైయల్ రన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. డిసెంబర్ ఆఖరు లోగా మిగతా పరీక్షలు పూర్తి చేయనున్నారు.
Read Also: ఆ రైల్వే స్టేషన్‌లో ఎయిర్ పోర్ట్ తరహా భద్రతా తనిఖీలు.. చిన్న పిన్ను దొరికినా..