తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 8వ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో, 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా వచ్చారు.. వీరంతా కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావడం గమనార్హం. అలా మొత్తం 22 మందితో ఈ కార్యక్రమం చాలా రసవత్తరంగా సాగింది. ఇకపోతే చివరి మజిలీకి కేవలం 5 మంది మాత్రమే చేరుకున్నారని చెప్పవచ్చు. వారిలో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్.. వీరంతా కూడా ఫైనలిస్టులుగా నిలిచి, టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉండగా ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా అవినాష్ కి 10 లక్షల రూపాయలు ఆశ చూపించి ఎలిమినేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు గౌతమ్, నిఖిల్ టైటిల్ రేస్ లో పోటాపోటీగా పోటీ పడుతున్న నేపథ్యంలో చాలామంది గౌతమ్ కు టైటిల్ విన్నర్ ఇవ్వాలి అని కామెంట్లు చేస్తుంటే, ఇంకొంతమంది హౌస్ లో మొదటి రోజు నుంచి తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న నిఖిల్ కి ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.అందులో భాగంగానే నిఖిల్ కి టైటిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలేకి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 15 ఆదివారం రోజున ఈ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరగబోతుందని సమాచారం. అంతేకాదు ఈ కార్యక్రమానికి పుష్ప -2 సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారట. ఈయన చేతుల మీదుగానే విజేతకు టైటిల్ ట్రోఫీ అందివ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా 102వ రోజుకు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ ప్రోమోలో టైటిల్ రేస్ లో దూసుకుపోతున్న గౌతమ్ కి అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చి అబ్బురపరిచారు బిగ్ బాస్. బిగ్బాస్ హౌస్లో గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని బిగ్ బాస్ తెలియజేశారు. అక్కడ చాలా అద్భుతంగా డెకరేటివ్ చేయగా.. లోపలికి గౌతమ్ ఎంటర్ అవ్వగానే అక్కడ హౌస్ లో గడిపిన క్షణాలకు సంబంధించిన మెమోరీస్ ని ఒక పెద్ద ఆల్బమ్ రూపంలో పెట్టారు. ఇక ఆల్బమ్ ఓపెన్ చేయగానే తన అన్నయ్య కనిపించారు. నాకు అందరికంటే ఎక్కువ సపోర్టు దొరికింది అన్నయ్య నుంచే అంటూ తన అన్నయ్య ఫోటోని ముద్దాడాడు గౌతమ్. లక్ష్యాన్ని చేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోనే బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు అంటూ హౌస్ లో కంటెస్టెంట్స్ తో తాను పడ్డ కష్టాలను చూపించారు. అలాగే యష్మి ను ప్రేమించి ఆ తర్వాత ఆమె స్నేహితుడు అని చెప్పడంతో బాధపడకుండా పాదరసంలా పాకుతూ తనను తాను స్ట్రాంగ్ అనిపించుకున్నారు.అలా మొత్తానికైతే ఈ వారం హౌస్ లో గౌతమ్ జర్నీ ని చూపించి గౌతమ్ కి సర్ప్రైజ్ ఇస్తారు బిగ్ బాస్.