BigTV English

UK Cousin Marriages : బ్రిటన్‌‌లో మేనరిక వివాహాలపై నిషేధం.. బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన ఇండియన్ ఎంపీ

UK Cousin Marriages : బ్రిటన్‌‌లో మేనరిక వివాహాలపై నిషేధం.. బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన ఇండియన్ ఎంపీ

UK Cousin Marriages | మేనరిక వివాహాలను నిషేధించాలంటూ బ్రిటన్ దేశంలోని పార్లమెంటు కొత్త చట్టం కోసం బిల్లు ప్రతిపాదించారు. ఇతర దేశాల నుంచి వచ్చి బ్రిటన్ పౌరసత్వం పొందిన చాలామంది మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల మానసిక, అంగ వైకల్యం గల పిల్లలు జన్మిస్తున్నారని కన్‌జర్వేటివ్ ఎంపీ రిచర్డ్ హోల్డెన్ వాదించారు.


పార్లెమెంటులో ఎంపీ రిచర్ట్ హోల్డెన్ తన పార్టీ తరపున మేనరిక వివాహాలపై నిషేధం విధిస్తూ చట్టం తీసుకురావాలని బిల్లుని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో మాట్లాడుతూ.. పాకిస్తానీ, ఐర్లాండ్, భారత మూలాలున్న బ్రిటన్ పౌరులు ఎక్కువగా తమ మేనత్త, మేనమామ, బాబాయ్, పెదనాన్న, పిన్ని పిల్లలను వివాహం చేసుకుంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగే కజిన్ మ్యారేజెస్ (మేనరిక వివాహాల్లో) ఈ సామాజిక వర్గాలకు చెందిన వారే 20 నుంచి 40 శాతం మంది ఉన్నారని.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

“విదేశాల నుంచి వచ్చి బ్రిటన్ లో స్థిరపడిన కుటుంబాలలో వారి తాతల తరం కంటే ఈ తరం వారు ఎక్కువ సంఖ్యలో మేనరిక వివాహాలు చేసుకుంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. గత దశాబ్ద కాలం డేటా చూస్తే.. ఇప్పటి యువత ఇలాంటి వివాహాలకు ఇష్టపడకపోయినా వారి తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహాలు చేస్తున్నారు.” అని కన్‌జర్వేటివ్ ఎంపీ రిచర్డ్ హోల్డెన్ చెప్పారు.


Also Read:  అతనికి 100.. ఆమెకు 102.. లేటు వయసులో లవ్ మ్యారేజ్.. గిన్నిస్ రికార్డ్

ఆక్స్‌ఫర్డ్ జర్నల్ ఆఫ్ లా అండ్ రెలీజియన్ చేసిన అధ్యయనం గురించి ఎంపీ రిచర్డ్ హోల్డెన్ ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోని 10 శాతం జనభా కజిన్ మ్యారెజెస్ (మేనరిక వివాహాలు) చేసుకుంటోందని.. ఇలాంటి వివాహాలు మధ్యప్రాచ్య దేశాలు (గల్ఫ దేశాలు), వెస్ట్ ఏషియా, ఉత్తర్ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

ఎంపీ రిచర్డ్ హోల్డెన్ ప్రవేశ పెట్టిన బిల్లును పార్లమెంటులో కొంత మంది వ్యతిరేకించారు. “వారిలో భారత మూలాలున్న ఇండిపెండెంట్ ఎంపీ ఇక్బాల్ మొహమ్మద్ ఒకరు. ఆయన మేనరిక వివాహాలపై నిషేధం పై మాట్లాడుతూ.. దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఇలాంటి వివాహాలు చేసుకోవడం సహజమే. కానీ సామాజిక వర్గాలను ప్రత్యేకంగా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని ఆరోగ్య సమస్యల దృష్టి కోణంలో చూడాలి.. ప్రజలకు వీటి వల్ల భవిష్యత్తులో కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగించాలి.” అని అన్నారు.

ఇండియాలోని గుజరాత్ కు చెందిన ఎంపీ ఇక్బాల్ మొహమ్మద్ మాట్లాడుతూ.. “సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో 35 నుంచి 50 శాతం ప్రజలు కజిన్ మ్యారేజెస్ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాల్లో ఇది చాలా కామన్. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఈ తరహా వివాహాలతో కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. ఆర్థిక భద్రత కూడా ఇందులో ముఖ్యమైన అంశం. కానీ మేనరిక వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన కల్పించాలి. దంపతులకు ముందుగానే వైద్య పరీక్షలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.” అని అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లుపై మళ్లీ జనవరి 2025 సమయంలో పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×