Hero Vishal:కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఈయన .. ఆ తర్వాత తెలుగు, తమిళ్లో తాను నటిస్తున్న సినిమాలను ఒకేసారి విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో విశాల్. మరొకవైపు పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా విశాల్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే విశాల్ తన మాట నిలబెట్టుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మాట నిలబెట్టుకుంటున్న హీరో విశాల్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా విశాల్ పనిచేస్తున్న విషయం తెలిసిందే.. ఇక నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టాక ఆ బిల్డింగ్ లోనే తన పెళ్లి జరుగుతుంది అని విశాల్ కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఆ విషయాలను విశాల్ నిజం చేయబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియా గుర్తు చేస్తోంది. ఎలాగో ఇప్పుడు నడిగర్ సంఘం నిర్మాణం పూర్తి కావచ్చింది. కాబట్టీ విశాల్ పెళ్లి న్యూస్ కూడా చెప్పాడు. దీనికి తోడు విశాల్ పెళ్లి కోసమే నడిగర్ సంఘం బిల్డింగ్ కంప్లీట్ కావాలని, అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇన్నాళ్లు మొండి పట్టు పట్టి పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే విశాల్ పెళ్లి కోసమే నడిగర్ సంఘం భవనం నిర్మాణ పనులు కూడా వేగమయ్యాయి. ఇక ఇంతకుమించిన శుభ తరుణం ఏముంటుంది.. అని తన పెళ్లి గురించి కూడా అనౌన్స్ చేసేసారు విశాల్. మొత్తానికైతే విశాల్ ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhansika) తో ఏడడుగులు వెయ్యబోతున్నారు.
15 ఏళ్లుగా పరిచయం..
ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తో సాయి ధన్సికకు దాదాపు 15 సంవత్సరాల క్రితమే పరిచయం ఉందట. ఎక్కడ కనిపించినా చాలా గౌరవంగా పలకరిస్తారని, మా ఇంటి వరకు వచ్చి నాకున్న సమస్యను పరిష్కరించిన హీరో విశాల్ మాత్రమే అంటూ తెలిపింది సాయి ధన్సిక. ఇక ఆమె మాట్లాడుతూ.. నాకు ఎప్పుడూ ఏం కావాలన్నా ముందుండే వ్యక్తులలో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు అంటూ విశాల్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. ఇక సాయి ధన్సిక విషయానికి వస్తే.. నటిగా నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 15 ఏళ్ల క్రితమే పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం కచ్చితంగా పెళ్లికి దారి తీస్తుందని ఇద్దరికీ అనిపించాకే ఈ నిర్ణయానికి వచ్చాము అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే సాయి ధన్సిక నటించిన యోగి సినిమా వేడుకల్లో పెళ్లి గురించి అనౌన్స్ చేసింది ఈ జంట ఇక ఆగస్టు 29వ తేదీన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు ఇక పెళ్లి తర్వాత కూడా సాగిదన్సిక సినిమాలలో నటిస్తుందని విషయాలు చెప్పిన విషయం తెలిసింది. ఇకపోతే విశాల్ ఆనందంగా ఉండటమే తన మొదటి ధ్యేయం అంటూ ధన్సిక చెప్పింది. ఇకపోతే సాయి ధన్సిక కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం షికారులో నటించగా.. అలాగే అంతిమ తీర్పు, దక్షిణ అనే మరో రెండు తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
ALSO READ:Harihara Veeramallu: పవన్ మూవీకి నైజాంలో భారీ డిమాండ్.. ఎన్ని కోట్లంటే?