BigTV English
Advertisement

Cleanest Railway Stations: దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!

Cleanest Railway Stations: దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!

Indian Railways: భారతీయ రైల్వేలో గత దశాబ్ద కాలంగా బోలెడు సంస్కరణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే మీద ప్రత్యే దృష్టి పెట్టడంతో అద్భుతంగా రూపొందుతున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను పునర్నిర్మిస్తున్నది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయాణీకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. అటు అద్భుతమైన ఇండియన్ మేడ్ సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వందేభారత్, నమో భారత్ రైళ్లతో ప్రయాణీకులు వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. హైడ్రోజన్, బుల్లెట్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నది కేంద్ర ప్రభుత్వం.


టాప్ 10లో 7 స్టేషన్లు రాజస్థాన్ లోనివే!    

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమం రైల్వే స్టేషన్లలో పకడ్భందీగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను అద్భుతంగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అధికారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ్ రైల్, స్వచ్ఛ్ భారత్’ సర్వేలో పలు రైల్వే స్టేషన్లు అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. పలు అంశాలను ఆధారంగా తీసుకొని నిర్వహించిన ఈ సర్వేలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన 10 రైల్వే స్టేషన్లను గుర్తించారు. వాటిలో 7 రైల్వే స్టేషన్లు రాజస్థాన్ లోనే ఉండటం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక్క రైల్వే స్టేషన్ టాప్ 10లో స్థానాన్ని దక్కించుకుంది. ఇంతకీ అత్యంత పరిశుభ్రమైన టాప్ 10 రైల్వే స్టేషన్లు ఏవంటే..


దేశంలో అత్యంత పరిశుభ్రమైన 10 రైల్వే స్టేషన్లు

1.హరిద్వార్ జంక్షన్ రైల్వే స్టేషన్

జోన్: ఉత్తర రైల్వే

రాష్ట్రం: ఉత్తరాఖండ్

ర్యాంక్: 10

2.అజ్మీర్ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 9

3.ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 8

4.విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్

జోన్: సౌత్ సెంట్రల్ రైల్వే

రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్

ర్యాంక్: 7

5.సూరత్‌ గఢ్ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 6

6.గాంధీనగర్ జైపూర్ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 5

Read Also: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

7.జమ్మూ తావి రైల్వే స్టేషన్

జోన్: ఉత్తర రైల్వే

రాష్ట్రం: జమ్మూ కాశ్మీర్

ర్యాంక్: 4

8.దుర్గాపుర రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 3

Read Also: బుల్లెట్ రైలు కారిడార్ లో వందేభారత్ పరుగులు, ఇప్పట్లో ఆ రైళ్లు రానట్లేనా?

9.జోధ్‌ పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 2

10.జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

జోన్: నార్త్ వెస్ట్రన్ రైల్వే

రాష్ట్రం: రాజస్థాన్

ర్యాంక్: 1

Read Also: దేశంలో అత్యంత చెత్త రైల్వే స్టేషన్లు ఇవే.. టాప్ 10లో 6 స్టేషన్లు ఆ రాష్ట్రంలోనే!

Read Also: బాబోయ్.. ఒక్క రోజులో ఇండియన్ రైల్వే ఆదాయం అన్నికోట్లా?

Related News

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Big Stories

×