BigTV English

Bigg Boss : ఇదెక్కడి పూజరా బాబోయ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Bigg Boss : ఇదెక్కడి పూజరా బాబోయ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు!

Bigg Boss : ప్రస్తుతం ఎక్కడ చూసిన బిగ్ బాస్ హవా నడుస్తుంది. ప్రతి ఇండస్ట్రీలోను బిగ్ బాస్ సీజన్ మొదలైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు రన్ అవుతున్నాయి. తెలుగులో వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత షో పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం విన్నర్ ట్రోపీ కోసం నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. ఇక కన్నడ బిగ్ బాస్ విషయానికొస్తే నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభమై ఎనిమిది వారాలు పూర్తి అయ్యింది. అయితే ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.. మొన్న ఏమో బిగ్ బాస్ లో పోలీస్ కేసు అయ్యింది. ఇప్పుడు ఏమో నెటిజన్స్ ట్రోల్స్ కు గురవుతుంది. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందని కన్నడీలు ఆలోచిస్తున్నారు. తాజాగా ట్రోల్స్ అందుకుంటున్న ఆ టాపిక్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


కన్నడ బిగ్ బాస్ పై పోలీసులకు ఫిర్యాదు.. 

బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభం నుంచే హౌస్ లో స్వర్గం- నరకం అనే కాన్సెఫ్ట్ నడిచిన విషయం తెలిసిందే. మొదటి రోజు, కొంతమంది కంటెస్టెంట్‌లను స్వర్గానికి పంపారు. కొంతమంది పోటీదారులను నరకానికి పంపారు. నరకానికి వెళ్లిన కంటెస్టెంట్లు నేలపై వేసిన మంచంపై పడుకోవాల్సి వచ్చింది. వారికి ఆహారం బదులు గంజి మాత్రమే ఇస్తున్నారు. సీటింగ్ కూడా‌ ఏర్పాటు చేయలేదు. వారిని జైలు తరహా కడ్డీల వెనుక ఉంచారు. తాగునీటి కోసం ఒక కుండ మాత్రమే ఉంచారు. ఆహారం, నీరు, ఆఖరికి బాత్ రూమ్ వెళ్లాలనుకున్నా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్ల అనుమతిని అడగాలి.. ఇలా మనుషులను మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్నారని, మానవ హక్కుల ఉల్లంఘన కింద మొన్నీమధ్య పోలీసు కేసు నమోదు అయ్యింది. అది మరువక ముందే మరో ఘటన నెటిజన్స్ ట్రోల్స్ కు గురైంది.


కంటెస్టెంట్ చేసిన పూజ..

హౌస్ లోని వాళ్ళ కోసం హౌస్ లో వినాయకుడిని ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు.. అక్కడ పూజ చేసుకోవాలని అనుకొనేవారికి అన్ని సదుపాయాలను కల్పించారు. ఈ హౌస్ లో కొనసాగుతున్న టాప్ కంటెస్టెంట్ చైత్ర కుందపుర వినాయకుడికి ప్రత్యేక పూజ చేసింది. అయితే ఆ పూజను వాళ్ళు అలానే చేస్తారా? లేదా అన్నది తెలియలేదు కానీ దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదేం పూజ తల్లి ఎప్పుడు, ఎక్కడ చూడలేదు అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో వీడియో కాస్త ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సీజన్ హౌస్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నాయి. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..

ఇక పోతే రీసెంట్ గా కన్నడ ముద్దుగుమ్మ ఫైర్ బ్రాండ్ శోభా శెట్టి హౌస్ లోకీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో రోజుకో రచ్చ చేసింది. ఆ క్రేజ్ ను కన్నడలో క్యాష్ చేసుకుందామని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచించింది. దాంతో హౌస్ లో ఆమెను దించారు. ఇక ముందు హౌస్ ఎలా మారుతుందో చూడాలి..

Tags

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×