Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ ప్రతీ వారం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. మామూలుగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ అంటే తమకు నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలి. ఇన్నేళ్లుగా అదే రొటీన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ సీజన్ 8లో మాత్రం అంతా మారిపోయింది. ఈవారం కొత్తగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయి వెళ్లిన పాత కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చి హౌస్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయమన్నారు బిగ్ బాస్. దీంతో వెళ్లిపోయిన వారంతా మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఆదిత్య ఓం, నైనికా, మణికంఠ, సీత వచ్చి కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేశారు.
అదే రియాలిటీ
ముందుగా హౌస్‌లోకి వచ్చిన ఆదిత్య ఓం.. యష్మీ, ప్రేరణలను నామినేట్ చేశాడు. యష్మీని నామినేట్ చేస్తూ తనది పూర్తిగా గ్రూప్ గేమ్ అని అన్నాడు. ఆ మాటకు యష్మీ ఒప్పుకోకపోతే తన తండ్రి అన్న మాటలను గుర్తుచేశాడు. యష్మీ తండ్రి హౌస్‌లోకి వచ్చినప్పుడు కూడా గ్రూప్ గేమ్ గురించి మాట్లాడాడని గుర్తుచేయడంతో తను సైలెంట్ అయిపోయింది. ఇక ప్రేరణను నామినేట్ చేస్తూ తనది కూడా గ్రూప్ గేమ్ అని స్పష్టం చేశారు ఆదిత్య ఓం. దానికి ప్రేరణ ఒప్పుకోకుండా వాదించాలని అనుకుంది కానీ సైలెంట్ అయిపోయింది. మెగా చీఫ్ అయిన తర్వాత మనుషులను చాలా చులకనగా చూసిందని రియాలిటీ ఏంటో తనకు తెలిసేలా చేశాడు ఆదిత్య ఓం.
Also Read: తగ్గని హవా.. మొన్న తెలుగు, నేడు కన్నడ.. శోభ క్రేజ్ మామూలుగా లేదుగా..?
ఫ్రెండ్స్ మధ్యే చిచ్చు
ఆ తర్వాత వచ్చిన నైనికా.. నబీల్, యష్మీని నామినేట్ చేసింది. ఆ ఇద్దరిలో ఫైర్ తగ్గిపోయిందని చెప్పింది. నబీల్.. గౌతమ్‌తో ఫ్రెండ్‌లాగా ఉంటూనే తన వెనకాల మాట్లాడుతున్నాడనే నిజాన్ని గౌతమ్‌కు తెలిసేలా చేసింది. ఇక మొదట్లో యష్మీలో చాలా ఫైర్ ఉండేదని, ఇప్పుడు అసలు అది కనిపించడం లేదని చెప్పింది. అంతే కాకుండా ప్రేరణ భర్త హౌస్‌లోకి వచ్చినప్పుడు తన గురించి తప్పుగా మాట్లాడిందని బయటపెట్టింది. దీంతో ప్రేరణ తన గురించి తప్పుగా అనుకుంటుందేమో అని ఆ విషయంపై అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది యష్మీ. అలా నైనికా వచ్చి యష్మీ, నబీల్ నిజస్వరూపాలను గౌతమ్, ప్రేరణల ముందు బయటపెట్టింది. మణికంఠ వచ్చి నిఖిల్, నబీల్‌ను నామినేట్ చేసి వారిలో ఫైర్ చాలా తగ్గిపోయిందనే కారణాన్నే మళ్లీ చెప్పాడు.
అమ్మాయిలను ట్రాప్
చివరిగా సీత.. నామినేషన్స్‌లోకి ఎంటర్ అవ్వడంతో పెద్ద సెన్సేషనే క్రియేట్ అయ్యింది. తను ప్రేరణ, యష్మీలను నామినేట్ చేసింది. ప్రేరణ ఎప్పుడెప్పుడు చీఫ్ అవుతుందా అని ఎదురుచూస్తే తనేమో ఆ పదవిని పెద్ద డిసాస్టర్ చేసిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇంకొకసారి మెగా చీఫ్ అవ్వాలని ఆశలు కూడా పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చింది. ఇక యష్మీ గురించి మాట్లాడుతూ.. యష్మీ అంటే నిఖిల్‌తో మాత్రమే కనిపిస్తుందని చెప్పింది. మధ్యలో నిఖిల్ జోక్యం చేసుకోగా మంచిగా ఆడుతున్న అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నావంటూ ముక్కుసూటిగా అనేసింది. దీంతో నిఖిల్ చాలా ఫీల్ అయ్యాడు. అన్నం తినకుండా ఏడుస్తూ పడుకున్నాడు. ఇక ఈ వారం నబీల్, నిఖిల్, పృథ్వి, యష్మీ, ప్రేరణ నామినేషన్స్‌లో ఉన్నారు.