Bigg Boss Nainika : బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న ఏకైక డాన్స్ షో ఢీ.. ఈ షో ద్వారా భారతదేశం నలుమూలలా ఉన్న డాన్సర్లు ఎంతోమంది తమ టాలెంట్ నిరూపించుకొని, ప్రస్తుతం సినిమాల్లో కొరియోగ్రాఫర్లుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ షోలో కొంతమంది స్పెషల్ పర్సన్స్ గా ఉన్నారు. అలాంటి వారిలో నైనిక ఒకరు.. తన డాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న నైనిక గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంది. తన ఆట మాట తీరుతో చివరి వరకు కొనసాగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నైనిక వరుసగా యూట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఓ ప్రొడ్యూసర్ ఆమెను దారుణంగా టార్చర్ చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నైనికను అంత టార్చర్ చేసిన ఆ ప్రొడ్యూసర్ ఎవరో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రొడ్యూసర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నైనిక..
ఢీ డ్యాన్సర్ నైనిక గురించి అందరికి తెలిసే ఉంటుంది.. గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంది. అందులో తన యాటిట్యూడ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో తర్వాత ఆమె బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నైనిక కేవలం సోషల్ మీడియాకు మాత్రమే అంకితమైనది. అయితే కొన్ని సినిమాల్లో నటించిందని ఆమె అంటున్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనిక క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పింది.. తనకు డాన్సర్ గా రావాలని ఉంది. దాంతోపాటు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలని అనుకుంటున్నాను అని తన మనసులో నేను మాటను బయట పెట్టేసింది.
Also Read : ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్..
నేను డాన్సర్ గా స్క్రీన్ పై నటిగా మాత్రమే ఆమె చేస్తానని తేల్చి చెప్పేసింది. అయితే కాస్టింగ్ కౌచ్ పై తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంది. ప్రొడ్యూసర్ ఆఫర్ కోసం వెళ్తే ఫోన్ చేసి రాత్రంతా తనను టార్చర్ చేశాడని నైనిక అంటుంది. మొదట నాకు కాస్టింగ్ కౌచ్ అంటే తెలియక ఏదో అనుకున్నాను. ఆ తర్వాత దాని గురించి తెలుసుకొని మరోసారి ఫోన్ చేసినప్పుడు ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పేసాను.. అయినా కూడా అప్పటికి ఆ ప్రొడ్యూసర్ నన్ను వదలలేదని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరన్నది నైనిక చెప్పలేదు. ఈమె చెప్పింది బాలీవుడ్ ప్రొడ్యూసరా? టాలీవుడ్ ప్రొడ్యూసరా?అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది..
నైనిక ప్రస్తుతం ఏం చేస్తుంది..?
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటుంది. యూట్యూబ్‌లో తనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.. ఈమధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.. ఇక నైనికా రెండు ప్రాజెక్టులలో నటించబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమాల గురించి అనౌన్స్ చేయబోతుందని సమాచారం..