OTT Movies : ఈమధ్య జనాలు ఎక్కువగా ఓటీటీలోకి వచ్చే సినిమాలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతివారం ఇక్కడ బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. హారర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. కొత్త వాటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ వారం కూడా కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు కొత్త సినిమాలు ఏ ఓటీటీలో కి ఏ మూవీ రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.. మరి ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో ఓ లుక్ వేసుకోండి..
నిజం చెప్పాలంటే గతవారం థియేటర్లలో మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం థియేటర్లలో సింగిల్, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల తప్ప వేరే సినిమాలు అంతగా చెప్పుకోదగినవి కాదు.. అయితే, అటు ఓటీటీలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అనే ఆసక్తి మూవీ లవర్స్ లో ఉంటుంది. ప్రస్తుతానికైతే థియేటర్లలో సింగిల్ మూవీ హవానే నడుస్తుంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఏ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. దానికైతే కొత్త సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.. మరి ఈ వారం డిజిటల్ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం..
ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ కాబోతున్న సినిమాలు..
హాట్ స్టార్..
ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 13
హై జునూన్ (హిందీ సిరీస్) – మే 16
వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17
అమెజాన్ ప్రైమ్..
భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) – మే 16
సోనీ లివ్..
మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 15
సన్ నెక్స్ట్..
నెసిప్పయ (తమిళ సినిమా) – మే 16
నెట్ ఫ్లిక్స్..
సీ4 సింటా (తమిళ సినిమా) – మే 12
బుక్ మై షో..
స ల టే స ల న టే (మరాఠీ సినిమా) – మే 13
Also Read : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎన్టీఆర్ కొత్త మూవీ స్టార్ట్..
ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు అయితే థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు కానీ ఓటీటీలో మాత్రం రెండు సినిమాలు బాగా ఆసక్తిగా ఉన్నాయి. అందులో మలయాళ నటుడు జోసెఫ్ బేసిల్ నటించిన మరణమాస్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలా సీ4 సింటా మూవీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఈవారం శుక్రవారం ఎక్కువగా సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయని సమాచారం..
ఇక థియేటర్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే.. మొన్న ఈ మధ్య వహల్గామలో జరిగిన ఉగ్రదాడి వల్ల కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ జనాలు ఆసక్తి చూపించలేదు.. దాంతో ఈ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యాయి.