Rajiv Ghai on Virat: టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను టెస్టులో ఆడబోన అంటూ ఓ సంచలన పోస్ట్ కూడా విడుదల చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో.. విరాట్ కోహ్లీ అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. అటు లేడీ ఫ్యాన్స్ కూడా… స్టార్ క్రికెటర్ ను దూరం చేసుకుంటున్నామని ఎమోషనల్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ మళ్లీ టెస్టుల్లో కనిపించబోడు అంటేనే… షాకింగ్ గా ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పైన చాలామంది క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇండియన్ ఆర్మీ సభ్యులు కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు.
ALSO READ: Five Penalty Runs: ఒరేయ్ సచ్చినోడా కీపింగ్ అక్కడ చేస్తారా.. కొంపముంచిన హెల్మెట్.. 5 పరుగులు బొక్క
ఆర్మీ లోను విరాట్ కోహ్లీ క్రేజ్
టీమీడియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై… ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ రాజీవ్ ఘాయ్ స్పందించారు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం పై ఆయన మాట్లాడుతూ… వెంటనే విరాట్ కోహ్లీ… రిటర్మెంట్ అంశం కూడా వచ్చింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు కాసేపటి క్రితమే వార్తలు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం చాలా బాధాకరమైన అంశమని తెలిపారు. కానీ టైం అయిపోయింది కాబట్టి ఎవరైనా రిటర్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు రాజీవ్ ఘాయ్. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే సమయంలో పాకిస్తాన్ పై జరిగిన యుద్ధం పై కూడా ఆయన స్పందించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించినట్లు తెలిపారు. ఇండియా జోలికి వస్తే మళ్లీ ఏం చేస్తామో అని రుచి చూపించామని వివరించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ రాజీవ్ ఘాయ్.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై అనుష్క శర్మ రియాక్ట్
టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై.. ఆయన భార్య అనుష్క శర్మ స్పందించారు. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటర్మెంట్ చేస్తావని నేను ఎప్పుడు ఊహించలేదని ఆమె… పేర్కొన్నారు. 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు అందుకున్నావ్… నీలాంటి క్రికెటర్ ను మళ్లీ చూడలేము… హాట్సాఫ్ విరాట్ కోహ్లీ అంటూ అనుష్క శర్మ పోస్ట్ పెట్టింది. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ… కేవలం వన్డే మ్యాచ్ లు ఆడనున్నాడు. అటు ఇప్పటికే… టి20 క్రికెట్ కు కూడా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ALSO READ: Hardik Pandya : తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు.. అందుకే హార్దిక్ పాండ్యాకు విడాకులు !
Everybody loves Virat Kohli 🐐pic.twitter.com/RjpwRsR64c
— Out Of Context Cricket (@GemsOfCricket) May 12, 2025